
త్రయంబకం యజామహే
1
జాగృతదేవత
మేం ప్రయాణిస్తున్న టవేరా షోలాపూర్ దాటింది. శరత్కాలపు ప్రత్యూషమే అయినా నడిశీతాకాలంలాగా మంచు పట్టింది. తెలతెలవారుతున్నవేళ మేం ప్రయాణిస్తున్న దారి పొడుగునా కాలినడకన అసంఖ్యాకులైన యాత్రీకులు కనిపిస్తున్నారు. మహారాష్ట్రలో ఎన్నో గ్రామాలకు చెందిన బీదగ్రామీణులు వాళ్లు. పురుషులూ, స్త్రీలూ, ముసలీముతకా – అసలంతమంది యాత్రీకులు అట్లా కాలినడకన నడవడంచూసి చాలాకాలమే అయింది.
శివరాత్రి రోజుల్లో శ్రీశైలం చుట్టుపక్కల కనిపించే యాత్రీకుల్లాగా ఉన్నారు వీళ్లు కూడా. శ్రీశైలానికి ఇట్లానే ఎక్కడెక్కడో కర్ణాటకనుంచి కూడా రోజులతరబడి యాత్రీకులు కాలినడకన వస్తూండడం నేను చాలాసార్లు చూశాను. షోలాపూర్ నుంచి ఉస్మానాబాద్ పోయే రోడ్డుమీద ఎడతెరపిలేకుండా ఆ యాత్రికులంతా అలా ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలనిపించింది. అస్పష్టమైన ఆ మంచుతెరల మధ్య ఆ పాదచారులను చూస్తూంటే నా నిద్రమత్తు ఎగిరిపోయింది. పిల్లల్ని భుజానకెత్తుకుని, చంకన వేలాడదీసుకుని, నెత్తిన కూర్చోబెట్టుకుని అలుపెరుగకుండా వాళ్లంతా ఎక్కడికి వెళ్తున్నట్టు? ఈ దేశంలో అత్యంత ప్రభావశీలమైన రాజకీయ నాయకుడి సమావేశానికి కూడా ప్రజలట్లా వెళ్లరు. ఆంధ్రదేశంలో ఒక సినిమా షూటింగ్ జరుగుతుంటేనో లేదా ఒక పాపులర్ సినిమాహీరో వస్తేనో కూడా జనం మూగుతారు కానీ, ఇంతింతదూరాలు ఇంత శ్రద్ధగా, ఇంత దీక్షగా నడిచిపోతారనుకోను. దూరం, చలి, మంచు, మార్గాయాసం వీటిని వేటినీ లెక్కపెట్టకుండా ఈ మనుషులంతా ఇలా నడుస్తూపోతున్నారంటే వీళ్లందర్నీ ఆకర్షిస్తున్న ఆ శక్తి ఎవరు?
నేనుండబట్టలేక బండి ఆపి దారిన పోతున్న ఒకళ్లిద్దర్ని ఆపి అడిగాను, నా వచ్చీరాని హిందీ వాళ్లకర్థంకాలేదు. వాళ్లు చెప్పిన మరాఠీ నాకూ బోధపడలేదు కానీ, వాళ్లు చెప్పిన ఊరు పేరేమిటో మా డ్రైవర్ కి అర్థమయ్యింది. మళ్లా బండి మొదలవగానే అతన్నడిగాను, ‘వాళ్లు ఎక్కడికి వెళ్తున్నారు’ అని.
‘తుల్జాపూర్’ అన్నాడతడు.
అని మళ్లా అన్నాడు, ‘భవానీని చూడ్డానికి’.
తుల్జాపూర్! ఎన్నోసార్లు విన్నానీపేరు. శివాజీకి, భ్రమరాంబాదేవి ఒక ఖడ్గం అనుగ్రహించిందని శ్రీశైలంలో చెప్తూంటారు. ఆ ఐతిహ్యం మొదటిసారి విన్నప్పుడే ఈ మాట కూడా విన్నాను. శివాజీకి తుల్జాపూర్ భవానీ కూడా ఖడ్గం అనుగ్రహించిందని. ఎప్పటికైనా తుల్జాపూర్ భవానీని చూడాలని అప్పుడే నా మనసులోపల ఎక్కడో అస్పష్టంగా ఒక సంకల్పం ఏర్పడిందనుకుంటాను. ఇన్నాళ్లికి ఆ దారిన ప్రయాణిస్తున్నాననగానే నాకేదో వివశత్వం కలిగింది. తుల్జాపూర్లో ఆగి వెళ్లామనిపించింది. ఆ మాటే అందరితో అన్నాను. అంతా తలూపారు. ప్రమోద్ కి కొత్త స్థలాలంటే ముందే సరదా. మేం తుల్జాపూర్ వెళ్లేటప్పటికే తొమ్మిది, పదిగంటలు కావొస్తోంది. ఊరి పొలిమేరల్లోనే బండి ఆపేశారు. అక్కడనుంచి గుడిదాకా నడచి వెళ్లాల్సిందేనని చెప్పారు. అప్పటికే ఊరంతా జనమయంగా కనిపిస్తోంది. మేం స్నానాలు చేసి గుడికి వెళ్తే బాగుంటుందనిపించింది. అందుకని అక్కడే ఊరి బయట ఒక గది అద్దెకు తీసుకున్నాం. ఆ హోటల్ యజమానినే దర్శనం ఏర్పాట్లు గురించి అడిగితే అతడు మాకోసం ఒక ఉపాధ్యాయుణ్ణి ఏర్పాటుచేశాడు.
మేం స్నానాలు చేసి తయారై కిందకు వచ్చేటప్పటికి పదిన్నర దాటింది. శరత్కాలపు ఎండలో చల్లదనం పోయి చురుక్కుమంటోంది. మేం అక్కడనుంచి కాలినడకన గుడిదాకా వెళ్లాం. చుట్టూ పండగ వాతావరణం, రకరకాల దుకాణాలు. నవ్వు ముఖాల్తో, సంతోషాలతో కనిపిస్తున్న అసంఖ్యాక గ్రామీణులు. నుదుటున పెద్ద కుంకుమబొట్టుతో, మహారాష్ట్ర దేశపు చీరకట్టుతో, కడియాలతో కనిపిస్తున్న స్త్రీలు. మేం గుడిదగ్గరకు చేరేటప్పటికి అక్కడ కెరటాల్లాగా ఎగిసిపడుతున్న జనసందోహాన్ని చూసి ఉత్సాహం, నీరసం ఒక్కసారిగా ఆవరించాయి. ఇంతమంది జనంలో దర్శనం మాట అలాఉంచి, అసలు గుడిలోకి అడుగుపెట్టగలమా అనిపించింది. మాతోవచ్చిన పూజారి మాకోసం ప్రత్యేకంగా పూజ చేయిస్తాననీ, ఎలాగైనా గుళ్లోకి తీసుకెళ్తాననీ చెప్పాడు. మమ్మల్ని ఒకచోట ఉండమని చెప్పి తను గుళ్లోకి వెళ్లాడు. మేమతడికోసం నిరీక్షిస్తూ కొద్దిసేపు అక్కడే నిలబడ్డాం.
ఆ కొంతసేపూ ఆ ప్రాచీన పుణ్యక్షేత్రం వివిధపార్శ్వాలతో నా కళ్లముందు దర్శనమిస్తూ కనబడింది. ఈ దేశంలో ప్రతియుగంలోనూ ఎన్నో కొత్త ఆకర్షణలు, ఎన్నో కొత్త ప్రలోభాలు, ఎన్నో సరదాలు. ఒకప్పుడు అఖాడాలు, ఆ తరువాత నాటకశాలలు. ఇప్పుడు సినిమా థియేటర్లు, క్రికెట్ మైదానాలు. కాని ఇన్ని శతాబ్దాలుగానూ, ఈ దేవాలయాల ఆకర్షణ మాత్రం చెక్కుచెదరకుండా ఇలా నిలబడుతూనే ఉంది. ఇంకా చెప్పాలంటే రోజురోజుకీ మరింత బలపడుతూ ఉంది. ఎందుకొస్తున్నారు ఇంతమంది ఇక్కడికి? కేవలం తమ మొక్కులు తీర్చుకోవడం కోసమేనా? ఏదో భయంతోనా? లేదా ఏ అపరాధం నుంచో బయటపడ్డంకోసమా? నాముందు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న జనసమూహంలో ఏ ఒక్కరి ముఖంలోనూ వ్యగ్రతకానీ, ఆందోళన కానీ, ఏ అపరాధం నుంచో బయటపడాలన్న ఆత్రుతగానీ కనిపించలేదు. వాళ్లందరి ముఖాల్లోనూ ఒక వేడుక చూస్తున్న సంతోషం. ఒక విందులో పాల్గొంటున్న తృప్తి. ఏదైనా ఒక పెళ్లి పందిట్లో ఆ పెళ్లికి వచ్చిన అతిథుల ముఖాల్లో ఎటుపంటి ఆత్మీయత కనిపిస్తుందో అటువంటి ఆత్మీయతే అక్కడ ప్రతి ఒక్కరిలోనూ నాకు గోచరించింది. అక్కడకు రావడమే, ఆరోజు అక్కడ ఉండటమే, ఆ సంరంభంలో, ఆ తొక్కిడిలో, ఆ రాపిడిలో ఒకరినొకరు ఒరుసుకుంటూ అట్లా కదులుతుండడమే, దానికోసమే వాళ్లంతదూరం నడిచివచ్చారనిపించింది.
ఆ పూజారి బయటకి వచ్చి మమ్మల్ని ఆ మనుషుల మధ్యనుంచి రెక్కపట్టుకు లాక్కుపోయినట్లుగా లోపలికి తీసుకువెళ్లాడు. లోపల మనుషులు మరింత దట్టంగా చుట్టుముట్టి ఉన్నారు. ఆ గుడి పీష్వాలకాలపు వాస్తుతో కనిపిస్తోంది. మేం గుడిలోకి ‘దిగాం’ అనాలి. ఎందుకంటే గర్భగుడి నేలకన్నా కొద్దిగా లోతున ఉంది. అక్కడినుంచి చూస్తే పైనంతా ఆకాశం ఒక మూతలాగా బోర్లించి కనబడుతోంది. నాలుగువైపులా గోడలమీంచి పెద్దపెద్ద చెట్ల కొమ్మలు, వాటి నీడల మధ్య పొడలు పొడలుగా పడుతున్న ఎండ. ఆ పూజారి మమ్మల్నొక దేవత సన్నిధిలోకి తీసుకువెళ్లి మీరు సంకల్పం చెప్పుకుని ‘మీ పూజ ఇక్కడే కానివ్వండి’ అన్నాడు. ‘అమ్మవారి దగ్గర మీకు నిలబడే సమయం దొరకదు. ఇక్కడ సంకల్పం చెప్పుకుంటే అక్కడ అమ్మవారికి పూజ చేసినట్టే’ అన్నాడు. మేం అతను చెప్పినట్టే చేశాం.
అక్కడనుంచి అతడు మమ్మల్ని గర్భగుడిలోకి తీసుకెళ్లాడు. అక్కడ మనుషులు ఒకళ్లమీద ఒకళ్లు నిలబడ్డట్టటుగా ఉన్నారు, అల్లుకుపోయి ఉన్నారు. లోపల గంట మోగుతోంది. ఎవరో మంత్రాలు చదువుతున్నారు. భక్తులు లెంపలు వాయించుకుంటున్నారు. ఎవరో ‘జై భవానీ’ అని అరుస్తున్నారు. ఆ సమ్మర్దం మధ్య మాతో వచ్చిన పూజారి ‘అదిగో చూడండి భవానీని’ అని అరిచాడు. నేను కళ్లెత్తి చూశాను. నా ఎదురుగా అసంఖ్యాకులైన సందర్శకుల తలలు తప్ప మరేమీ కనిపించలేదు. ‘ఎక్కడ?’ అని అడిగాను. ‘అదిగో చూడండి’ అన్నాడు. పాదాలు పైకెత్తి బొటనవేలు నేలన ఆన్చి మళ్లా చూపు సారించాను. దూరంగా ఏదో ఒక కాంతిరేఖ లాగా తళుక్కున కనిపించి ఇట్టే అదృశ్యమైనట్టు కనిపించింది.
‘ఆమేనా భవాని?’.
నేను భవానిని చూశానా, చూశాననీ చెప్పలేను, చూడలేదనీ చెప్పలేను.
మహారాష్ట్రలో దేవాలయాల చుట్టూ అల్లుకున్న స్థలపురాణాల గురించి రాస్తూ, ఎమ్.ఎస్.మాటే అనే పురావస్తువేత్త తుల్జాపూర్ భవానీని ఒక ‘జాగృతదేవత’ అని వర్ణించాడు (టెంపుల్స్ అండ్ లెజెండ్స్ ఆఫ్ మహరాష్ట్ర, భారతీయ విద్యాభవన్ 2001, పే.59). ఆమె రౌద్రరూపిణి అనీ, తన భక్తుల్ని బాధించేవాళ్ల మీద విరుచుకుపడే ఉగ్రదేవత అనీ ఆయన వివరించాడు. ఒకప్పుడు మొగల్ సేనాని అఫ్జల్ ఖాన్ ఈ దేవాలయం మీద దండెత్తి విగ్రహాల్ని ధ్వంసం చేశాడనీ, ఆ రోజే ఆమె అతణ్ణి తిరిగి మళ్లా మహారాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్లలేడని శపించిందని కూడా అంటారు. రెండువారాలు తిరక్కుండానే అతణ్ణి శివాజీ మట్టుపెట్టాడు. కాని నాకు భవాని ఆ రోజు గర్భగుడిలో కాక, అసలు ఆ మొత్తం తుల్జాపూర్ వీథుల్లోనే దర్శనమిచ్చిందనాలి. ఆమె నాకొక రౌద్రదేవతగాకాక, ఉల్లాసభరితురాలిగా, ఉత్సాహవంతురాలిగా కనిపించింది. అటువంటి దేవీక్షేత్రం చూడ్డానికి అసంఖ్యాకంగా చేరుకున్న ఆ మనుషులందరిలోనూ వాళ్ల వాళ్ల తాత్కాలిక బాధలూ, సమస్యలూ పక్కకుపోయి వారందరిలోనూ ఆత్మసంబంధమైన శక్తి ఏదో అక్కడ జాగృతమైందనిపించింది. బహుశా ఆ దేవి ఒక జాగృతరూపిణి అంటే ఆమె జాగృతంగా ఉంటుందనే కాదేమో, బహుశా ఆమె మనలోని ఆత్మికశక్తిని జాగృతపరుస్తుందనేమో. ఆ అర్థంలో చూస్తే ఆ తెల్లవారుఝామునుంచి ఆమె నాలో ఏదో అనిర్వచనీయమైన ఆత్మానందాన్ని మేల్కొల్పుతూనే ఉంది. ఈ రోజు ఇన్నాళ్లు గడచిన తరువాత, మళ్లా ఈ దసరా రోజు, ఆమెను తలుచుకుంటూ ఉంటే, నా కళ్లముందు కనిపిస్తున్నది ఆ వెలుతురు, ఆ సందోహం, ఆ ఎండ పొడ, ఆ పండగ, ఆ ఆత్మీయతా మాత్రమే.
A Pilgrimage to Trimbakeshwar
1
The Living Goddess
Our Tavera had just crossed Sholapur. Though it was only an autumn dawn, the mist lay thick and cold as if in the dead of winter. In that pale, breaking light, countless pilgrims appeared on foot all along the road we were traveling. They were poor rural folk belonging to numerous villages across Maharashtra—men, women, the elderly, and the infirm. It had been a very long time since I had witnessed such a vast concourse of pilgrims walking together on foot.
They resembled the throngs of pilgrims seen around Srisailam during the days of Mahashivaratri. I had often seen pilgrims trekking for days on end to Srisailam in just this manner, walking all the way from distant corners of Karnataka. Looking at that unbroken stream of humanity along the highway from Sholapur to Osmanabad, I felt a deep urge to know where they were all headed. Watching those wayfarers through the dim veils of mist, all traces of sleep vanished from my eyes. Carrying small children upon their shoulders, perched on their hips, or balanced atop their heads, where were they all trudging with such untiring perseverance? Not even for a rally of the most influential political leader in the country would people turn out like this. In the Telugu country, crowds might surge if a film shooting takes place or a popular movie star appears, but I could hardly imagine them walking such staggering distances with such devotion, with such steadfast resolve. Heeding neither distance nor cold, neither fog nor the sheer weariness of the road, if all these people were pressing forward like this, who was the power drawing them together?
Unable to restrain my curiosity, I had the vehicle stopped and called out to a person or two passing by on the road. My broken Hindi made little sense to them, nor could I comprehend the Marathi they spoke; however, our driver caught the name of the town they mentioned. As the car started forward again, I asked him, “Where are they going?”
“Tuljapur,” he said.
Then he added, “To behold Mother Bhavani.”
Tuljapur! I had heard this name countless times. At Srisailam, they often say that Mother Bhramaramba bestowed a divine sword upon Shivaji. It was when I first heard that legend that I also learned another: that Tuljapur Bhavani too had blessed Shivaji with a sword. It was back then, I suppose, that a quiet, indistinct resolve had formed somewhere deep within my mind to behold Tuljapur Bhavani one day. The sudden realization that after all these years I was traveling on that very road filled me with an inexplicable surrender. I felt we must make a stop at Tuljapur. I voiced the thought to everyone in the car, and they all nodded in agreement; Pramod, especially, is always fond of exploring new places.
By the time we reached Tuljapur, it was approaching nine or ten in the morning. Vehicles were stopped right at the outskirts of the town, and we were informed that from there on, one could only reach the temple on foot. Even by then, the whole town looked thoroughly flooded with people. We felt it would be proper to bathe before going for darshan, so we rented a room right outside the town. When we enquired with the hotel owner about arrangements for the visit, he arranged an upadhyaya—a local temple priest—for us.
By the time we finished our bath, dressed, and came downstairs, it was past ten-thirty. The chill had melted away from the autumn sun, leaving it sharp and stinging. From there, we walked up to the temple. All around, a festive air buzzed amidst an array of varied shops. Countless village folk walked with smiling, happy faces. Women appeared adorned in the traditional Maharashtrian drape, their foreheads marked with broad rounds of vermilion, their wrists lined with heavy bangles. As we approached the temple, beholding that vast ocean of humanity surging like rolling waves, a sudden rush of exhilaration and exhaustion seized me all at once. In the middle of such an immense crowd, let alone having darshan, I wondered whether we could set foot inside the temple at all.
The priest accompanying us assured us that he would arrange a special worship for us and guide us inside the sanctum somehow. Asking us to wait at a particular spot, he went ahead into the temple. We stood there for a while, waiting for his return.
During those few moments, that ancient sacred sanctuary revealed itself before my eyes in its myriad dimensions. In this land, every epoch has brought forth so many new attractions, so many fresh allurements, so many amusements. Once there were wrestling arenas (akhadas), and later theatrical stages. Today there are cinema halls and cricket stadiums. Yet, across all these centuries, the magnetic pull of these temples has stood unshaken and intact. In truth, with every passing day, it only grows more formidable.
Why do so many come here? Merely to fulfill their vows? Out of some lingering fear? Or to seek deliverance from some sense of guilt? Looking at the sea of humanity surging before me, I saw neither distress nor anxiety, nor any desperate haste to expiate guilt upon a single face. On every countenance rested the sheer delight of beholding a grand celebration, the fulfillment of partaking in a shared feast. In every single person there, I perceived that very same tender warmth and kinship that lights up the faces of guests gathered beneath a wedding canopy. To arrive here, to simply be present here on this day, to move together rubbing shoulders in that festive commotion, that press, that friction of bodies—it felt as though it was solely for this that they had walked all that immense distance.
The priest re-emerged from the crowd and led us inside, virtually clutching our arms and pulling us through the dense crush of people. Inside, the throng was even thicker, closely encircling us from all sides. The temple reflected the distinctive architectural idiom of the Peshwa era. In truth, one should say we “descended” into the temple, for the sanctum sanctorum sits sunken slightly below ground level. Looking up from there, the entire open sky arched above like an upturned lid. Large tree branches leaned over the perimeter walls on all four sides, casting dapples of sunlight through their shifting canopy of shade.
The priest led us before a subordinate goddess and said, “Make your sankalpa and complete your worship right here. You will get no time to linger or stand before the Mother inside. Making your vow here is the very same as offering your puja directly to Her.” We followed his instructions.
From there, he guided us into the sanctum sanctorum. People were packed so densely it felt as though they were standing atop one another, entwined in an unbroken human mass. Inside, a bell clanged incessantly. Voices chanted sacred mantras. Devotees struck their cheeks in penitence and prayer. Cries of “Jai Bhavani!” rang out over the din. Amidst that churning fervor, the priest accompanying us shouted, “Look there! Behold Bhavani!”
I lifted my eyes and looked. Right before me, I could see nothing save a sea of heads belonging to countless pilgrims.
“Where?” I asked.
“Look right there!” he urged.
Rising onto my tiptoes, balancing on my big toes, I cast my gaze once again. Far in the distance, a streak of light flashed—glimmering for an instant like a quick beam of radiance—and vanished in a flash.
Was that Bhavani?
Did I behold Bhavani? I cannot truly say I saw Her, nor can I say I did not.
Writing on the legends woven around the sacred shrines of Maharashtra, the archaeologist M.S. Mate described Tuljapur Bhavani as a jāgṛta devatā—an “awakened deity” (Temples and Legends of Maharashtra, Bharatiya Vidya Bhavan, 2001, p. 59). He portrayed Her as an awe-inspiring, fierce presence—a wrathful divinity who descends upon those who torment Her devotees. Tradition recounts that when the Mughal general Afzal Khan marched upon this temple and desecrated its sacred images, the Mother cursed him that very day, declaring he would never cross back over the borders of Maharashtra alive. Within less than two weeks, Shivaji had slain him.
Yet on that day, Bhavani revealed Herself to me not within the dim recesses of the sanctum sanctorum, but across the living streets of Tuljapur. To me She appeared not as a terrifying goddess of wrath, but as an embodiment of radiant joy, brimming with exuberant life. Among all those countless souls who had gathered to visit this sacred seat of the Mother, transient personal miseries and anxieties had receded into the background; some vital, spiritual potency within every one of them had visibly awakened there. Perhaps to call the Goddess jāgṛtarūpiṇī does not merely mean that She remains awake, but that She awakens the dormant spiritual power within ourselves. Seen in that light, from the first pale hours of that dawn, She had continually stirred an indefinable bliss of the soul within me.
Today, after the passage of so many years, remembering Her once again on this auspicious day of Dasara, what rises before my eyes is solely that light, that surging multitude, that dappled sunshine, that festival, and that tender, unspoken kinship.
12-9-2026


తుల్జాపూర్ భవానీ అమ్మవారి గురించి ఇంతవరకూ విననేలేదు.
మా అమ్మాయిని మొదటిసారి (తనకు తెలిసి) తిరుమల తీసుకెళ్లినప్పుడు, కాలినడకన తిరుమల చేరుకుని ఆ సాయంత్రమే ధర్మదర్శనం చేసుకోవచ్చని క్యూలోకి వెళ్లాం. ఇంకొంచెం ముందుకు వెళ్తే దర్శనం అయిపోతుందనగా VIP వచ్చారని ముందుకీ వెనక్కీ వెళ్లే వీలు లేకుండా గేట్లు మూసేశారు.
సరిగ్గా కూర్చోవడానికి కూడా వీలు లేకుండా, ఆ క్యూ కాంప్లెక్స్‌లో క్రిక్కిరిసిన జనం మధ్య రాత్రంతా ఉండిపోయాం. తెల్లవారుజామున దర్శనానికి గేట్లు తెరవగానే ఒక్కసారిగా తోపులాట. అతి కష్టంమీద దేవుడిని దర్శించుకుని బయటకు వచ్చాం.
బయటకు వచ్చిన తర్వాత మా అమ్మాయిని దేవుణ్ణి చూశావా? అని అడిగితే, ఆ overwhelming crowd మధ్యలో ఎక్కడ చూడాలో తెలియలేదు, నాకేమీ కనపడలేదు అన్నది. పొద్దున్నే e-ticket మీద దర్శనానికి కూడా వెళ్లలేకపోయింది.
రాత్రంతా అంత కష్టపడి, అంతసేపు వేచి ఉండి దేవుడిని దర్శించుకోలేకపోయిందే అనిపించింది.
అయితే తిరిగి వచ్చే దారిలో శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వేంకటేశ్వరస్వామిని మాత్రం దగ్గరగా, ప్రశాంతంగా దర్శించుకుని ఇల్లు చేరాం.
మీ దర్శనానుభవం చదువుతుంటే ఈ సంఘటన గుర్తుకొచ్చింది.
🙏🏽
Perhaps to call the Goddess jāgṛtarūpiṇī does not merely mean that She remains awake, but that She awakens the dormant spiritual power within ourselves.
జాగృతరూపిణి
ధన్యవాదాలు సోమశేఖర్!
మీరు రాసిందేది చదివినా దృశ్యాలతో పాటు అనుభూతుల్ని కూడా చవిచూపిస్తారు. మీరు చూసిన ప్రదేశాలు మేము చూడకపోయినా ఫరవాలేదు అన్నంతగా.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
నమస్సులు మాష్టారూ 🙏
చాలా సంతోషం! చాలాకాలం తర్వాత!