
త్రయంబకం యజామహే
3
అవధూత గీత
గంగాద్వారం నుంచి కొద్దిగా వెనక్కి వచ్చి నేనా శిఖరాల్ని మరింత పరీక్షగా చూశాను. అవి శివుడి మూడు ముఖాల్లాగా ఉన్నాయి. ముందుకు పొడుచుకువచ్చి నల్లగా నిగనిగలాడుతున్న ఆ కొండలు అయస్కాంతాల్లాగా అనిపించాయి. సహ్యాద్రిశ్రేణిలోని ఈ శిఖరాలమీద దత్తాత్రేయుడు దర్శనమిస్తాడని అంటారు. అసలు మొత్తం మహారాష్ట్ర అంతా ఒక దత్తభూమి. దత్తాత్రేయుడు భారతదేశమంతా సాక్షాత్కరించే దైవమే అయినప్పటికీ ఆ మూర్తి మహారాష్ట్రలో పరిపూర్ణ స్వరూపంగా గోచరిస్తుంది. ఈ విషయం నాకు ఆంటోనియో రిగోపోలస్ అనే ఇటాలియన్ మేధావి రచించిన ‘దత్తాత్రేయ : ద ఇమ్మోర్టల్ గురు, యోగిన్ అండ్ అవతార’ (1998) అనే పరిశోధనాత్మక రచన చదివాక బాగా బోధపడింది. మహారాష్ట్రలో దత్తాత్రేయుడు శైవులకీ, వైష్ణవులకీ, శాక్తులకీ, యోగులకీ, తాంత్రికులకీ, నాథపంథీయులకీ, మహానుభావసంప్రదాయానికి చెందినవారికీ, బౌద్ధులకీ, జైనులకీ, చివరికి సూఫీలకు కూడా ఒక స్ఫూర్తికేంద్రంగా రూపొందాడని ఆ పరిశోధకుడు ఎంతో సవివరంగా విశదీకరించాడు.
మేం వెనక్కితిరిగి కిందకి దిగబోతుంటే మాకు ఎడంపక్కనుంచి వస్తున్న కొందరు యాత్రికులు ‘మీరు నివృత్తినాథుడి గుహ కూడా చూసి వెళ్లండి’ అన్నారు. నివృత్తినాథుడి పేరు వినగానే నాకు నివృత్తినాథుడి, జ్ఞానేశ్వరుడి కథంతా గుర్తొచ్చింది. మాకప్పటికే ఓపిక అయిపోయింది. అయినా కాళ్లు కూడదీసుకుంటూ నివృత్తినాథుడి గుహకి వెళ్లాం. ఏడువందల ఏళ్ల మరాఠీసాహిత్యాన్ని మాత్రమేకాక, ఉత్తరభారతదేశపు భక్తి ఉద్యమాల్ని కూడా గాఢాతిగాఢంగా ప్రభావితం చేసిన జ్ఞానేశ్వరుడి పాదస్పర్శతో పునీతమైన ప్రాంతంలో తిరుగుతున్నాననగానే నాకు చెప్పలేనంత సంతోషం కలిగి ఒళ్లంతా రోమాంచితమైంది. మరాఠీ సాహిత్యంలో, భారతీయ ఆధ్యాత్మికసాధుపరంపరలో జ్ఞానదేవుడు ఒక అద్భుతం. ఆయన జీవితమే ఒక అద్భుతం.
దేవగిరి రాజధానిగా యాదవరాజు రామదేవరావు పరిపాలించే కాలంలో అలండిలో ఒక బ్రాహ్మణుడు సన్న్యాసం స్వీకరించి కొన్నాళ్లకు సన్న్యాసం వదలిపెట్టి మళ్లా గృహస్థజీవితం స్వీకరించాడు. అతడికి నలుగురు పిల్లలు పుట్టారు. మొదటివాడు నివృత్తినాథుడు, రెండవవాడు జ్ఞానదేవుడు, మూడవవాడు సోపానదేవుడు, నాల్గవ సంతానం బాలిక, ముక్తాబాయి. సన్న్యాస ఆశ్రమం వదలి గృహస్థాశ్రమం స్వీకరించినందుకు ఆ బ్రాహ్మణుణ్ణి ఆనాటి సమాజం క్షమించకపోగా చాలా హింసించింది. చివరికి అతడికి మరణమే ప్రాయశ్చిత్తమని తీర్మానించింది. దాంతో ఆ భార్యాభర్తలిద్దరూ తమ పిల్లల్ని వదలిపెట్టి ప్రయాగలో గంగలో మునిగిపోయారు. కాని వాళ్ల సంతానం మహారాష్ట్ర సంస్కారాన్నే మార్చేసింది.
ఆ తల్లిదండ్రులు జీవించి ఉండగా ఒకరోజు పిల్లల్ని తీసుకుని త్రయంబకం వెళ్లారు. వాళ్లు కొండ ఎక్కుతుండగా దగ్గరలో పెద్దపులి అరుపు వినిపించింది. అంతా భయంతో తలోదిక్కుకీ చెదరిపోయారు. పెద్దపిల్లవాడు నివృత్తి పదకొండేళ్లవాడు. అతడు ఆ భయంలో ఇప్పుడు నివృత్తినాథ గుహగా పిలవబడుతున్న గుహలోకి పారిపోయి తలదాచుకున్నాడు. అక్కడ అతడికి గోరఖ్ నాథ్ సంప్రదాయానికి చెందిన గురువు గహినీనాథుడి దర్శనం అయింది. ఆ గురువు ఆ పిల్లవాడికోసమే ఎన్నో యుగాలనుంచి ఎదురుచూస్తున్నట్లుగా తక్షణమే ఆ పిల్లవాడికి ఉపదేశాన్నిచ్చాడు. అది ఆ మొత్తం కుటుంబానికే వరప్రసాదంగా పరిణమించింది. ఆ గుహనుంచి బయటికి వచ్చిన నివృత్తినాథుణ్ణి అతడి తమ్ముడు జ్ఞానదేవ్ తన గురువుగా స్వీకరించాడు. ఆ గురువు కటాక్షమెటువంటిదో కాని ఇరవైఒక్క ఏళ్ల వయసు వచ్చేలోపే జ్ఞానదేవ్ భగవద్గీతకు ‘భావార్థదీపిక’ పేరిట వ్యాఖ్యానం రాశాడు. ఉపనిషత్తుల సారాంశాన్ని నింపుకున్న భగవద్గీతకు మహారాష్ట్రీ ప్రాకృతభాషలో వ్యాఖ్యానం రాయటం మామూలువిషయం కాదు. అది వేదాంతాన్ని ప్రజాస్వామికం చేయటం. ఒకప్పుడు జ్ఞానదేవ్ ఒక దున్నపోతుతో వేదం పలికించాడని ఒక కథ చెప్తారు. ఇది ఒక అత్యున్నత రూపకాలంకారం. నివృత్తినాథుడి ఆశీర్వచనం వల్ల కాశ్మీరుశివాద్వైతాన్ని అతడు అనుభవంలోకి తెచ్చుకుని ‘అనుభవామృత’మనే మరొక తాత్త్వికకావ్యం రాశాడు. తమ తమ్ముడు సోపాన దేవుడు, చెల్లెలు ముక్తాబాయిలతో కలిసి ఆ అన్నదమ్ములిద్దరూ మహారాష్ట్ర సీమను ఒక సత్సంగంగా మార్చేశారు. నామదేవుడు, చోకామేళుడు, గోరాకుంభార్, విశోబాకేచార్ మొదలైన భక్తికవులతో వాళ్లు మహారాష్ట్రను ఒక భక్తిసాహిత్యసీమగా మార్చేశారు.
నివృత్తినాథుడి గుహ ఎదుట రాతిగోడకు ఆనుకుని నేను ఆ ముగ్గురు అన్నదమ్ముల్నీ, వాళ్ల చెల్లెల్నీ తలచుకున్నాను. పిల్లల్ని వదలిపెట్టి ఆత్మత్యాగం చేసిన ఆ తల్లిదండ్రుల్ని గుర్తు చేసుకున్నాను. లోకానికి ఇంత వెలుగు పంచిపెట్టిన ఆ కుటుంబం ఎంత విషాదాన్ని అనుభవించిందో ఊహించడానికి ప్రయత్నించాను. కాని ‘జ్ఞానేశ్వరి’లో కాని, ‘అనుభవామృతం’లో కాని ఒక్క చీకటిరేక కూడా కనిపించదు. అంతా వెలుగు. ఆ వెలుగుకి జ్ఞానదేవుడు పదేపదే తన అన్న, తన గురువు నివృత్తినాథుడికే నమస్సులు సమర్పిస్తూ ఉంటాడు. జ్ఞానేశ్వరిలో ఒకచోట తన గురువు గురించి చెప్తూ ఇలా అంటాడు:
‘నా గురువు తన శిష్యులందరికీ తల్లివంటివాడే కానీ ఆయన నాకొక్కడికే తల్లి అన్నంతగా నా సేవల్ని అంగీకరించమని ఆయన్ని వత్తిడి చేస్తాను. గురువు నా మీద చూపించే ప్రేమవానలో నేను మట్టిలాగా తడిసి ముద్దవుతాను. నేనతడి ఇంటిగా మారతాను. ఆ ఇంటిలో పరిచారకుణ్ణవుతాను. గురువు ఇంటిలోంచి బయటకు వెళ్లేటప్పుడూ, మళ్లా లోపలికి వెళ్లేటప్పుడు దాటివెళ్లే గుమ్మానవుతాను, ఆ గుమ్మానికి తలుపునవుతాను, ఆ తలుపుకి కావలి కాసేవాణ్ణి కూడా నేనే. నేనతడికి పాదరక్షలుగా అమరుతాను. ఆ పాదరక్షల్ని అతడికి తొడిగేదీ నేనే. నేనతడికి ఒక గొడుగునవుతాను. ఆ గొడుగు పట్టేవాణ్ణి కూడా నేనే’.
జ్ఞానేశ్వరుడు తన గురువు గురించి చేసిన ఈ కీర్తన దత్తాత్రేయుడి అవధూతగీతకు అనుగుణంగానే ఉంది. అసలు మహారాష్ట్ర సంత్సంప్రదాయమంతా అవధూతగీతకు సజీవవ్యాఖ్యానంగా చెప్పుకోవచ్చేమో. దత్తాత్రేయుడి పేరిట ప్రసిద్ధిచెందిన అవధూతగీత గురించి వివేకానందులు ఇలా అన్నారట:
‘ఈ గీతాన్ని రచించిన రచయిత వంటి మనుషులే ధర్మాన్ని సజీవంగా నిలపగలిగేవాళ్లు. వాళ్లు నిజంగా సాక్షాత్కారం పొందినవాళ్లు. దేన్నీ పట్టించుకోని వాళ్లు. తమ శరీరానికి ఏం జరిగినా దిగులు చెందనివాళ్లు. శీతోష్ణాలను సమానంగా చూసేవాళ్లు. వాళ్లు నిశ్చలంగా ఆత్మానందాన్ని ఆస్వాదిస్తూఉంటారు. కణకణలాడే నిప్పులు దేహాన్ని దహిస్తూండనివ్వండి, కాని కించిత్ కూడా చలించరు’.
అవధూతగీతాకర్త సంగనిస్సంగాలకు అతీతంగా రాగత్యాగాలకు ఆవలిసీమ చేరినవాడని మనకి బోధపడుతోంది. ఎనిమిది అధ్యాయాల అవధూతగీత అద్వైతసంప్రదాయానికి చెందిందని భావించడం పైపై అభిప్రాయం మాత్రమేననీ, నిజానికి అది నాథపంథీయుల సంప్రదాయంలోంచి వచ్చిన విశిష్టరచన అని శంకర్ మోకాశి పుణేకర్ అభిప్రాయపడ్డాడు. ఏమైనప్పటికీ అవధూతగీత భారతదేశంలో అత్యున్నత ఆధ్యాత్మికస్థితిని అందుకున్న మానవుల అనుభవానికి గుర్తుగానూ, అటువంటి అత్యున్నత ఆధ్యాత్మికమానవులు అవధూతగీతకు సజీవవ్యాఖ్యానాలుగానూ కొనసాగుతూనే ఉన్నారు.
నేను బ్రహ్మగిరి కొండలమీదుగా పరచుకొని ఉన్న ఆకాశాన్ని చూస్తూ ఉన్నప్పుడు ‘జ్ఞానామృతమ్, సమరసమ్, గగనోపమోహమ్’ (నేను జ్ఞానామృతాన్ని, సామరస్యాన్ని, ఆకాశం లాంటివాణ్ణి) అని అవధూతగీతాకారుడు గొంతెత్తి ప్రకటిస్తున్నట్టే ఉంది. ఆయనింకా ఇలా అంటున్నాడు:
వేదా న లోకా న సురా న యజ్ఞావర్ణాశ్రమో నైవ కులమ్ న జాతిః
న ధూమమార్గో న చ దీప్తమార్గో బ్రహ్మైకరూపమ్ పరమార్థతత్వమ్
(వేదాలు లేవు, లోకాలు లేవు, దేవతలు లేరు, యజ్ఞాలు లేవు, వర్ణాశ్రమ ధర్మాలు లేవు, కులంలేదు, జాతి లేదు. పొగచూరిన దారులూ లేవు, వెలుగుచిమ్ముతున్న తోవలూ లేవు. ఉన్నదంతా ఒకేఒక్క పరమార్థతత్త్వం, అది కూడా బ్రహ్మైక రూపం.)
కాంతారమందిరమ్ ఇదమ్ హి కథమ్ వదామి
సంసిద్ధ సంశయమిదమ్ హి కథమ్ వదామి
ఏవమ్ నిరంతరసమమ్ హి నిరాకులమ్ వై
జ్ఞానామృతమ్ సమరసమ్ గగనోపమోహమ్
(నేను ఇది అడవి అనిగానీ లేదా ఇది మందిరమని గానీ ఎలా చెప్పగలను? ఇది నిశ్చయమనిగానీ, ఇది సంశయమనిగానీ ఎలా చెప్పగలను? ఉన్నదంతా నిరంతరంగా కొనసాగుతూ వస్తున్న ఒకేఒక్క ప్రశాంత అస్తిత్వం. నేను జ్ఞానామృతాన్ని, సామరస్యాన్ని, ఆకాశం లాంటివాణ్ణి.)
ముంచ ముంచ హి సంసారమ్ త్యాగం ముంచ హి సర్వథా
త్యాగాత్యాగవిషమ్ శుద్ధమమృతమ్ సహజమ్ ధ్రువమ్
(ఈ ప్రపంచాన్ని ప్రతి ఒక్క దారిలోనూ వదిలిపెట్టు. అసలు ప్రతిఒక్క రీతిలోనూ వదలిపెట్టడాన్నే వదిలిపెట్టు. వదలిపెట్టడం, వదలిపెట్టకపోవడం అనే రెండింటి విషాన్నీ వదలిపెట్టు. ఉన్నదల్లా పరిశుద్దమైందీ, అమృతమైందీ, సహజమైందీ, నిశ్చయమైందీను.)
జ్ఞానేశ్వరి బోధపడటం సులువేకాని అనుభవామృతాన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. అనుభవామృతానికి దిలీప్ చిత్రే చేసిన ఇంగ్లీషుఅనువాదాన్ని నేను చాలా ఏళ్లే పఠిస్తూ గడిపాను. అనుభవామృతానికి కన్హయ్యాజోషి చేసిన మరొక అనువాదం ‘ద అల్టిమేట్ సతోరి’ (1996) కూడా చదివాను. దానికి దిలీప్ చిత్రే ముందుమాట రాస్తూ, ‘అనుభవామృతానికి ఏ ఒక్క అనువాదం కూడా పూర్తి న్యాయం చేయలేదని’ రాశాడు. ఈ రెండు అనువాదాల కన్నా ప్రదీప్ గోపాల్ దేశ్ పాండే చేసిన అనువాదం నాకు మరింత సరళంగా అనిపించింది. అందులోంచి రెండుమూడు గాథలు చూడండి:
భక్తుడు ఎటు అడుగువేస్తే
అటే ఒక శివతీర్థం
అందుకనే భక్తుడు ఏ యాత్ర చేసినా
ఎక్కడికీ వెళ్లనట్టే
భక్తుడు ఎప్పుడైనా, ఎటైనా
చూపు సారించనివ్వు
ఎప్పుడైనా, ఎటైనా చూసేదతడు
శివసంతోషమే.
నేను మొదటే నీవాణ్ణి,
మళ్లా నీవాడనంటున్నావు
ఈ దివ్య పునరుక్తి, శివా,
నీకొక్కడికే తగింది
అర్ధనారీ నటేశ్వరులు
ఒకర్నొకరు కబళిస్తున్న
ఈ క్రీడ అనంతకాలంగా
కొనసాగుతోంది.
అనుభవామృతాన్నీ, అవధూతగీతనీ పోల్చి చదివితే శంకర్ మోకాశి పూణేకర్ అభిప్రాయాలు సమంజసంగానే కనిపిస్తాయి. ‘భక్తుడు ఎటు అడుగువేస్తే అటే ఒక శివతీర్థం’ అనే భావన భక్తికవులందరిలోనూ కనిపిస్తుంది. ‘నువ్వు ఎక్కడుంటే అక్కడే ఒక ప్రవేశద్వారం’ అని కబీర్ కూడా అన్నాడు. ఇటువంటి అర్థాన్నిచ్చే వాక్యమే నాకు రూమిలో కూడా కనిపించింది. రూమి ఈ వాక్యాన్ని నేరుగా కొరాన్ నుంచి తీసుకున్నాడు. ఈ వాక్యాలన్నిటి సారాంశంగా అవధూతగీతలో ఈ శ్లోకం కనిపిస్తోంది:
త్వధ్యాత్రయా వ్యాపకతా హతా తే
ధ్యానేన చేతః పరతా హతా తే
స్మృత్యా మయా వాక్పరతా హతా తే
క్షమస్వ నిత్యమ్ త్రివిధాపరాధాన్
(నిన్ను వెతుక్కుంటూ యాత్ర చేయడంవల్ల నేను నీ సర్వవ్యాపకత్వాన్ని భంగపరిచాను. నిన్ను స్మరిస్తూ ధ్యానం చేయడంవల్ల నువ్వు మానసాతీతుడవన్న సత్యాన్ని భంగపరిచాను. నిన్ను కీర్తించడం ద్వారా నువ్వు వాగతీతుడవన్న సత్యాన్ని భంగపరిచాను. ఈ మూడు అపరాధాలకీ నన్ను సదా క్షమించు.)
జ్ఞానేశ్వరుడి కవిత్వం వెనక మరొక రెండు గాఢమైనప్రభావాలున్నాయని మనం గుర్తు పట్టవచ్చు. ఒకటి, మరాఠీసాహిత్యంలో ఆయనకన్నా ముందు రచనలు చేసిన మహానుభావ సంప్రదాయానికి చెందిన మహిమభట్టు, కేశోబాస్ వంటి రచయితల రచనలు. ఇక రెండవప్రభావం మహారాష్ట్రిగా పిలవబడ్డ ప్రాకృతసాహిత్యమే. జ్ఞానదేవుడు రచించిన అభంగాలకు ముఖ్యంగా విరహిణి గీతాలకు స్ఫూర్తి ప్రాకృతసాహిత్యమేనని మనం సులువుగా గుర్తుపట్టవచ్చు. ఈ కవిత చూడండి:
మలయపవనాన్ని
గుడ్డలో వడకట్టలేం
పూలపరిమళాన్ని
మాలగా గుదిగుచ్చలేం
ఆయన అన్నిచోట్లా ఇలాగే
ఉన్నాడని తెలుసుకో
చిన్నవాడనలేం, పెద్దవాడనలేం
అతడెలా ఉంటాడో ఎవరికీ తెలీదు
ముత్యాలశోభను కుండలో దాచలేం
ఆకాశాన్ని గుడ్డసంచీలో మూటకట్టలేం
కర్పూరాన్ని పిండిచేసి సారం రాబట్టలేం
చక్కెరలో తీయదనాన్ని విడిగా జల్లించలేం
కంటినుంచి కనుపాపను వేరుచేయలేవు
నీ మిత్రురాలికి బదులు ఆమెనీడను ప్రేమించలేవు
విఠలుడూ, రుక్మాయీజగడమాడితే
వాళ్ల తగువు తీర్చగలిగేదెవరు?
The Pilgrimage to Trimbakeshwar
3
Avadhuta Gita
Stepping back a little from Gangadwaram, I observed those summits with closer scrutiny. They appeared like the three faces of Lord Shiva. Jutting forward, dark and gleaming, those peaks felt like living magnets. It is said that Lord Dattatreya reveals Himself upon these very heights of the Sahyadri range. Indeed, the whole of Maharashtra is a consecrated land of Datta (Datta-bhumi). Though Dattatreya manifests as a deity across the length and breadth of India, that divine form reveals itself in its absolute fullness in Maharashtra. This truth dawned on me deeply after reading the scholarly work by the Italian thinker Antonio Rigopoulos, Dattatreya: The Immortal Guru, Yogin, and Avatara (1998). The author elucidates with great depth how Dattatreya became a fountainhead of spiritual inspiration for Shaivites, Vaishnavites, Shaktas, Yogis, Tantrics, the Nath Panthis, adherents of the Mahanubhava tradition, Buddhists, Jains, and even Sufis.
As we turned to begin our descent, a few pilgrims walking past on our left suggested, “Visit the cave of Nivruttinath as well before you go down.” The moment I heard the name of Nivruttinath, the entire saga of Nivruttinath and Jnaneshwar flashed into my mind. Our physical energy was already depleted. Yet, gathering our weary legs, we made our way toward Nivruttinath’s cave. The realization that I was treading ground sanctified by the lotus feet of Jnaneshwar—who profoundly shaped not merely seven centuries of Marathi literature, but the vast Bhakti movements of North India as well—thrilled my whole being with unspeakable joy and goosebumps. In Marathi literature, and across the spiritual lineage of Indian saints, Jnanadeva is an absolute wonder. His very life is a miracle.
During the reign of the Yadava king Ramadevarao with Devagiri as his capital, a Brahmin in Alandi took the vows of sannyasa, but after some time renounced monastic life and returned to the stage of a householder. Four children were born to him: the eldest was Nivruttinath, the second was Jnanadeva, the third was Sopanadeva, and the fourth child was a daughter, Muktabai. Far from forgiving a Brahmin who had forsaken the ascetic order to re-enter domestic life, contemporary society subjected him to ruthless torment. Ultimately, it decreed that death alone was his proper atonement. Resigned to the verdict, the husband and wife abandoned their young children and drowned themselves in the sacred waters of the Ganga at Prayag. Yet their progeny went on to transform the spiritual consciousness of Maharashtra.
While the parents were still alive, they had brought their children to Trimbakeshwar one day. As they were climbing the mountain, the roar of a tiger echoed nearby. Terrified, everyone scattered in different directions. The eldest boy, Nivruttinath, then eleven years old, fled in fear and took refuge inside the cavern now known as Nivruttinath’s cave. There, he came face to face with Gahininath, a revered master of the Gorakhnath lineage. As though waiting across the eons for this very boy, the Guru initiated him into sacred knowledge on the spot. That moment turned into a supreme boon for the entire family.
Emerging from that cave, Nivruttinath was accepted by his younger brother, Jnanadev, as his spiritual master. Such was the grace of that Guru that before reaching twenty-one years of age, Jnanadev composed his monumental commentary on the Bhagavad Gita titled Bhavartha Dipika (the Jnaneshwari). Writing a commentary on the Bhagavad Gita—the quintessence of the Upanishads—in the popular Maharashtri Prakrit tongue was no ordinary feat; it was nothing less than the democratization of Vedanta. Tradition recounts that Jnanadev once made a male buffalo chant the Vedas—a supreme poetic metaphor. Through the blessings of Nivruttinath, he absorbed Kashmir Shaiva Advaita into direct living experience and composed another philosophical masterpiece, the Amritanubhava. Joined by their younger brother Sopanadeva and their sister Muktabai, the two brothers transformed the soil of Maharashtra into an enduring satsanga. Alongside saint-poets like Namdev, Chokhamela, Gora Kumbhar, and Visoba Khechar, they turned Maharashtra into a luminous realm of devotional literature.
Leaning against the stone wall before Nivruttinath’s cave, I reflected upon those three brothers and their sister. I remembered those parents who had offered their lives in self-sacrifice, leaving their children behind. I tried to fathom the immense tragedy endured by that family, which had bestowed such radiant light upon the world. Yet neither in the Jnaneshwari nor in the Amritanubhava does one find even the faintest shadow of darkness. All is pure illumination. And for that light, Jnanadeva repeatedly offers humble prostrations to his elder brother and spiritual guide, Nivruttinath.
Describing his Guru in the Jnaneshwari, he sings:
“My master is indeed a mother to all his disciples; yet I shall insist that he accept my services as though he were a mother to me alone. In the downpour of love showered upon me by my Guru, I shall be soaked and dissolved like clay. I will become his home; I will be the attendant serving in that home. When my Guru steps out of the house or returns within, I will become the threshold he crosses; I will be the door upon that threshold, and the watchman guarding that door. I will become the sandals for his feet, and the hands that slip them upon him. I will become his umbrella, and the devoted one who holds it aloft over him.”
Jnaneshwar’s hymn of adoration to his Guru resonates in complete harmony with Dattatreya’s Avadhuta Gita. In truth, one could view the entire Sant tradition of Maharashtra as a living commentary on the Avadhuta Gita.
Swami Vivekananda is recorded as remarking on the Avadhuta Gita, attributed to Dattatreya:
“Men like the one who wrote this Song keep religion alive. They have actually realized; they care for nothing, feel nothing, done to the body, care not for heat and cold or anything. They blissfully enjoy the being in themselves. They are calm, cool, and while on the hot coals they are looking, not a flick will be there.”
It becomes evident to us that the author of the Avadhuta Gita has transcended both attachment and non-attachment, reaching that far shore lying beyond desire and renunciation alike. Shankar Mokashi Punekar observed that considering the eight chapters of the Avadhuta Gita as belonging strictly to the Advaita tradition is only a surface-level impression; in reality, it is a peerless work emerging from the lineage of the Nath Panthis. In any case, the Avadhuta Gita stands as an enduring testament to the realization of beings who have attained the supreme spiritual pinnacle in India—and such exalted spiritual souls continue to live as embodied expositions of the Avadhuta Gita.
Looking upon the open sky arched across the hills of Brahmagiri, it felt as though the author of the Avadhuta Gita was raising his voice to declare:
Jñānāmṛtaṃ samarasam gaganopamoham
(I am the nectar of knowledge, all-pervading harmony, boundless like the sky.)
He proclaims further:
Vedā na lokā na surā na yajñā
Varṇāśramo naiva kulaṃ na jātiḥ
Na dhūmamārgo na ca dīptamārgo
Brahmaikarūpam paramārthatattvam
No Vedas, no worlds, no gods, no rites;
neither stage nor caste, no clan, no race.
Neither path of smoke nor path of light—
the supreme reality is Brahman alone.
Kāntāramandiram idaṃ hi kathaṃ vadāmi
Saṃsiddhasaṃśayam idaṃ hi kathaṃ vadāmi
Evaṃ nirantarasamaṃ hi nirākulaṃ vai
Jñānāmṛtaṃ samarasam gaganopamoham
How call this a forest or a temple?
How speak of it as certainty or doubt?
All is one unbroken, serene existence—
I am nectar, all harmony, and skylike.
Muñca muñca hi saṃsāram tyāgaṃ muñca hi sarvathā
Tyāgātyāgaviṣam śuddham amṛtam sahajam dhruvam
Renounce the world in every way;
renounce even the impulse to renounce!
Discard the venom of renouncing and clinging—
pure, deathless, spontaneous, and sure.
Grasping the Jnaneshwari may be relatively accessible, but penetrating the depths of the Amritanubhava is far less simple. For many years, I immersed myself in Dilip Chitre’s English translation of the Amritanubhava. I also read Kanhaiyalal Joshi’s translation, titled The Ultimate Satori (1996). In his foreword to that edition, Dilip Chitre noted that no single translation could ever do complete justice to the Amritanubhava.
Yet, compared to both of those works, the translation rendered by Pradip Gopal Deshpande felt far more lucid and natural to me. Consider these few verses from his rendering:
Wherever the devotee sets foot,
there itself is a sacred pool of Shiva;
hence, whatever pilgrimage he undertakes,
he has truly gone nowhere.
Whenever and wherever
the devotee casts his gaze,
all he beholds, at every moment and in all directions,
is the blissful sport of Shiva.
I was already Thine from the very beginning,
yet Thou claimest once more: “Thou art Mine.”
This divine tautology, O Shiva,
befits none other than Thee!
The game wherein the Divine Pair—
the half-female, half-male Ardhanarishwara—
devour each other in eternal communion,
continues through timeless eternity.
Reading the Amritanubhava alongside the Avadhuta Gita, Shankar Mokashi Punekar’s observations appear eminently justified. The vision that “wherever the devotee sets foot, there itself is a sacred pool of Shiva” echoes across all the mystic Bhakti poets. Kabir too declared: “Wherever you stand, right there is the doorway.” A sentiment bearing this very essence met me in Rumi as well—a vision Rumi drew directly from the Quran. Crystallizing the core of all these utterances, this verse shines forth in the Avadhuta Gita:
Tvad-yātrayā vyāpakatā hatā te
Dhyānena cetaḥ-paratā hatā te
Smṛtyā mayā vāk-paratā hatā te
Kṣamasva nityam trividhāparādhān
(By setting forth on a pilgrimage seeking Thee, I have denied Thy omnipresence;
By meditating upon Thee in thought, I have compromised the truth that Thou transcendest all mind;
By praising Thee in song and word, I have undermined the truth that Thou art beyond all speech.
Forgive me forever for these threefold transgressions!)
Behind Jnaneshwar’s poetic vision, one can trace two other profound influences. One is the literature of the Mahanubhava tradition that preceded him in Marathi letters, pioneered by writers like Mahimbhatta and Keshobas. The second is the very Prakrit literature known as Maharashtri. We can easily discern that the inspiration for Jnanadev’s abhangas—particularly his songs of yearning separation (virahini lyrics)—lies in that ancient Prakrit poetry.
Consider this poem:
The southern breeze
cannot be strained through cloth;
The perfume of flowers
cannot be strung in a garland.
Know that He abides
everywhere just so.
Call Him neither small nor great;
none knows His likeness.
A pearl’s luster cannot be hid in a pot;
the sky cannot be bound in a sack.
Crushed camphor yields no separate core;
no sieve parts sweetness from sugar.
You cannot tear the pupil from the eye;
you cannot love a friend’s shadow in her place.
When Vithala and Rukmayi fall out,
who could ever settle their strife?
15-9-2026

