ఉభయ గోదావరి జిల్లాల కవులు, రచయితలు ఈ నెల 25 న భీమవరంలో ఒక సాహిత్య ఉత్సవం నిర్వహించారు. ఆ సందర్భంగా తాము రాసిన కవితల్నీ, కథల్నీ 'గోదారి అలలు: కవితలు కథలు' పేరిట ఒక సంపుటిగా విడుదల చేసారు. నేను ఆ ఉత్సవంలో పాల్గొనలేకపోయానుగాని, ఆ పుస్తకంలో మాత్రం నా కవితకీ, కథకీ చోటు లభించింది.
