నా ఇంగ్లాండ్ యాత్ర-11

నాటకశాలలో నన్ను బాగా ఆకర్షించింది, ఆ నిర్మాణంలో మనకు గోచరించే ఆత్మీయ సాన్నిహిత్యం. ప్రదర్శన జరుగుతున్నంతసేపూ రంగస్థలానికీ, ప్రేక్షక శ్రేణికీ మధ్య ఆత్మీయ సామీప్యం నటుణ్ణి ప్రేక్షకుణ్ణి మిత్రుల్ని చేస్తుంది. తమ మధ్యనుంచే తమ మిత్రులు కొద్దిమంది తమకోసం ప్రదర్శనకి పూనుకున్నారేమోననే ఆత్మీయతాభ్రాంతికి ప్రేక్షకుడు లోనవుతాడు. ఈ ఆత్మీయతాభ్రాంతిలోనే నాటకం విజయం ఉంది, సినిమాకన్నా నాటకానికి సాధ్యమయ్యే సమ్మోహరహస్యం ఉంది.