కావ్యాత్మక వాస్తవికత-2

అంటే మనిషి తన ఇచ్ఛ ప్రకారం, సంకల్పం ప్రకారం బాహ్య వాస్తవాన్ని మార్చలేకపోవచ్చు. కాని అంతమాత్రాన అతడు ఓడిపోయినట్టు కాదు, నిస్సహాయుడైపోయినట్టు కాదు, తాను జీవించడానికి అర్థం లేకుండా పోయినట్టు కాదు. మారిన పరిస్థితుల ఎదట కూడా అతడు తన మానవీయ గౌరవాన్ని కోల్పోకుండా, నిబ్బరంగా నిలబడవచ్చు. రైన్‌హార్డ్, ఎలిసబెత్ ల ద్వారా, ముఖ్యంగా రైన్‌హార్డ్ ద్వారా స్టార్మ్ అటువంటి ఒక జీవితాదర్శాన్ని, అటువంటి ఒక సగౌరవ ప్రత్యామ్నాయాన్ని చూపించాడు.