ప్రియమైన శాఫో-8

ఇక పిల్లల కోసం రాసిన కవిత్వం ఏదేనా ఉందా అని ఆలోచించాను. అంటే బాలగేయాలు, బాలసాహిత్యం లాంటి మూసలో రాసేవి కావు, పిల్లల మానసిక ప్రపంచంలోకి ప్రవేశించడం కోసం రాసే కవిత్వం. పిల్లల్తో మాట్లాడటానికి, వాళ్ళ కబుర్లు వినడానికి తమని తాము మానసికంగా అర్హుల్ని చేసుకోడానికి రాసుకునే కవితలు