ఒద్దిగ్గా గీసే చిత్రకళ

కవిత్వంలోలానే చిత్రలేఖనంలో కూడా meticulous style, freehand style రెండూ ఉన్నాయి. ఆధునిక కవిత్వంలానే ఆధునిక చిత్రకళ కూడా spontaneity నే ముఖ్యంగా భావిస్తూ వచ్చింది. కానీ అలా అలవోకగా బొమ్మలు గీసిన ఆధునిక చిత్రకారులు చాలా నిర్దుష్టంగా బొమ్మలు గీయడంతో మొదలుపెట్టినవాళ్ళే.

నాలాగా పునాది శిక్షణ లేకుండా చిత్రకళలోకి ప్రవేశించినవాడు బొమ్మలు వెయ్యడమంటే, ఛందస్సు తెలియకుండానే, నేరుగా వచనకవితలు రాయడం మొదలుపెట్టినట్టు. రాయొచ్చు. గొప్ప వచన కవిత్వం రాయడానికి ఛందస్సు తెలిసి ఉండక్కరలేదు. కానీ, ఛందస్సు కూడా తెలిసి ఉంటే, cadence అంటే ఏమిటో, caesura అంటే ఏమిటో తెలిసి ఉంటే, పద్యపాదానికి తగ్గట్టుగా భావప్రవాహాన్ని ఎలా నియంత్రించుకోవాలో తెలిసి ఉంటే, అప్పుడు ఆ వచనకవిత మరింత నిర్దుష్టంగా, మరింత ప్రగాఢంగా ఉంటుంది.

అందుకే ఇప్పటికీ చీనా చిత్రకళలో meticulous painting అంటే ఒద్దిగా బొమ్మలు గీసే కళనే ప్రధానస్రవంతి చిత్రకళగా ఉంటున్నది. ఏమో, అరవై ఏళ్ళు దాటాక, చిత్రకళలో ఓనమాలు నేర్చుకోడం కష్టమేగాని, meticulous గా కొన్ని పండ్లు చిత్రిద్దామని ఇలా ప్రయత్నించాను.

28-5-2026

13 Replies to “ఒద్దిగ్గా గీసే చిత్రకళ”

  1. ఈ వారమంతా రోజుకొకటి గీశారా! చీనా కవిత్వమూ, చిత్రలేఖనమూ.. చీనీ పళ్ళు… (మిగతావి కూడా)

    అన్ని బొమ్మలూ బాగున్నాయ్ ❤️

  2. పొద్దున్నే రెండు యాపిల్లు తినేసాను
    అయినాకూడా ఈ పళ్ళు చేస్తుంటే తినబుద్ధి అయ్యేంత ఫ్రెష్ అందంగా
    ఉన్నాయి సర్ 🙏 💐

  3. చాలా బాగా వచ్చాయి సర్ మీ పెయింటింగ్స్.. తరువాత అందమైన ప్రకృతి , చెట్లు, జలపాతాలు, అడవులు కూడా ప్రయత్నించండి సర్. థ్యాంక్స్..

  4. అద్భుతంగా వున్నాయి ఈ నీటిరంగుల చిత్రాలు. ‘చేయి’ తిరిగిన కళాకారుడి సృజనను తలపిస్తున్నాయి. ఆ పళ్ళ తాజాతనం  స్ఫుటంగా తెలిపే  రంగుల ఎంపిక , అది నేర్చుకుంటే వచ్చేది కాదు,అనుభవం ఉండాలి. ఇంటి నుంచే ఒక చిత్ర కళా ప్రదర్శన చూపిస్తున్న మీకు ధన్యవాదాలు.   
     

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading