అందుకే ఇప్పటికీ చీనా చిత్రకళలో meticulous painting అంటే ఒద్దిగా బొమ్మలు గీసే కళనే ప్రధానస్రవంతి చిత్రకళగా ఉంటున్నది. ఏమో, అరవై ఏళ్ళు దాటాక, చిత్రకళలో ఓనమాలు నేర్చుకోడం కష్టమేగాని, meticulous గా కొన్ని పండ్లు చిత్రిద్దామని ఇలా ప్రయత్నించాను.
నాలుగు ఋతువులు, నాలుగు దృశ్యాలు
ఎవరేనా కవి లేదా రచయిత తన పుస్తకం మీద మాట్లాడమనో లేదా సమీక్ష చెయ్యమనో అడిగిన తొలిరోజుల్లో ఎలాంటి ఆత్మ విశ్వాసం కలిగేదో, ఆయన నన్ను బొమ్మలు వేసిమ్మని అడిగినప్పుడు కూడా అటువంటి ఎక్సైట్ మెంట్ నే కలిగింది.
శీతవేళ
ఫిబ్రవరిలో మహబూబ్ నగర్ లో అడవికి వెళ్ళినప్పటి దృశ్యాల్లో ఒకటి. నిన్న విన్సర్ అండ్ న్యూటన్ రంగులు తెచ్చుకున్నాను. వాటితో ఈ రోజంతా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాను. అందులో ఇదొకటి.
