నా ఇంగ్లాండ్ యాత్ర-13

21

మురికి నగరం

1992లో రియోడిజనీరోలో జరిగిన ఎర్త్ సమ్మిట్‌లో రూపొందించిన ఎజెండా 21 ప్రకారం మాంచెస్టర్ కూడా తన లోకల్ ఎజెండాని రూపొందించుకుంది. నగరాభివృద్ధిని సస్టెయిన్‌బుల్‌గా ఉంచుకోవడం ప్రధాన ఆశయంగా విద్య, వాణిజ్యం, పౌరసంఘాలు, నివాసితసంఘాలు, కన్సర్వేషన్ గ్రూప్స్, వైద్యం, స్థానిక పాలన, ఇతర పబ్లిక్ సంస్థలు, పౌరసేవా సంఘాలు, ట్రేడ్ యూనియన్స్, స్త్రీలు, యువకులు అన్న అంశాలపైన తదుపరి కార్యక్రమం కోసం ఏడు కార్యాచరణ సంఘాల్ని రూపొందించింది. ఆయా అంశాలపైన వైద్యం, పర్యావరణ, ఇంధనం, రవాణా, కాలుష్యం, ఆర్థిక వ్యవస్థ, విద్యలపై కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నది. సాధారణంగా విదేశీనగరాలు చూసివచ్చిన మన దేశీయులు అక్కడి రోడ్ల గురించీ, పరిశుభ్రత గురించీ ఘనంగా చెప్పడం నేను ఎన్నోసార్లు విన్నాను.

కానీ మాంచెస్టర్ గురించి నేను ఆ మాట చెప్పలేను. అక్కడ రోడ్లు అపరిశుభ్రంగా వుండటమేకాదు, ఆ అపరిశుభ్రత పట్ల ప్రభుత్వానికి తప్ప మరెవరికీ బాధ్యత లేదన్న ధోరణికూడా ఉంది. పబ్లిక్ టాయిలెట్లు ఎక్కడా పనిచేయవు. నగర మధ్యంలోని పిక్కడిల్లీలో పబ్లిక్ టాయిలెట్లు సాయంకాలం ఏడు గంటలకి మూసేస్తారు. పాలిశుద్ధ్యపనివారికీ, పౌరులకీ మధ్య జరిగిన తగాదా పర్యవసానమది. రోడ్లు సాధారణంగా శుభ్రంగా ఉంటాయి, కానీ ఆ శుభ్రతకి సమశీతోష్ణ వాతావరణమే ఎక్కువ కారణమనిపించింది. మన దేశంలాంటి ఉష్ణదేశాల్లో సంవత్సరానికి తొమ్మిదినెలలు దుమ్ము రేగుతుండే నగరాల్లో శుభ్రతని నిజంగా పాటించగలమా? నా ప్రశ్న ఏమిటంటే పారిశుద్ధ్యానికి, అభివృద్ధికీ నిజంగా సంబంధం ఉందా? పారిశుద్ధ్యమనేది పౌరసంస్కారం. అభివృద్ధి వల్ల మరింత కాలుష్యం పెరగవచ్చు గాని పారిశుద్ధ్యం సాధ్యపడుతుందనుకోను.

పారిశ్రామిక విప్లవం ఉధృతంగా ఉన్న రోజుల్లో ప్రకటించిన ఒక రిపోర్టు (1840) లో జాన్ రాబర్ట్‌ సన్ అనే వైద్యుడు మాంచెస్టర్ గురించి ఇలా రాశాడు: ‘మాంచెస్టర్‌లో పబ్లిక్ పార్క్స్‌ గానీ, ప్రజలు సాయంకాలం పూట నడిచి చక్కని గాలి పీల్చడానికి అనువయిన మైదానాలు గాని లేవు. కొత్త వీథులు అన్నిదిక్కులా ఎంతగా వృద్ధి చెందాయంటే, నగరం ఎంత తొందరగా పెరిగిపోతోందో ఎక్కువ సమ్మర్దంగా ఉండేచోట నివసించే ప్రజలకి ప్రకృతి తాలూకు ఆకుపచ్చనిదనాన్ని చూసే ఆశ ఇంకెంత మాత్రం ఉండదు. ఈ అంశంలో మాంచెస్టర్ లోపభూయిష్టంగా ఉండటంమే కాదు, సామ్రాజ్యం మొత్తంలోనే ఇంత సిగ్గుమాలిన నగరం మరొకటి ఉండబోదు’.

ఇప్పుడు నూటయాభై ఏళ్ళ తర్వాత మాంచెస్టర్ సిటీ కౌన్సిల్ ప్రచురించిన ఎజెండా 21లో (1996) ఇలా పేర్కొన్నారు: ‘మాంచెస్టర్ని మురికి నగరంగా భావించడంలో అస్పష్టత ఏమీలేదు. నగరంలోని మూడవవంతు జనాభాకి పీల్చేగాలి, చెత్తా, చెదారం చాలా పెద్ద సమస్యలు నేడు. పబ్లిక్ ట్రాన్స్‌ పోర్టు చాలకపోవడం, దొరకకపోవడం, దానిమీద పెట్టాల్సిన ఖర్చు కూడా సమస్యలే. పెరిగిపోతున్న ట్రాఫిక్, చప్పుళ్ళు, పాడుపడ్డ భవనాలు, పనికిరాని జాగా, నేరాలు, నిరాశ్రయత్వం, హాస్పటళ్ళ సమస్యలు ఇవన్నీకూడా నగరపౌరుల్ని బాధించేవే’.

కాబట్టి ఏ నగరాన్నైనా దాని ఆర్థికాభివృద్ధివల్ల, నగరంలో కాయకష్టంమీద ఆధారపడ్డ పౌరుల ఆరోగ్యం మెరుగు పడదు సరికదా మరింత క్షీణిస్తుంది. పారిశ్రామికాభివృద్ధి నమూనాలోని అనౌచిత్యం ఇక్కడ కన్పించినంత స్పష్టంగా మరెక్కడా కన్పించదనుకుంటాను.

22

జాన్ రైలాండ్స్ లైబ్రరీ

ఒకరోజు మాంచెస్టర్ టౌన్‌హాల్, సిటీ లైబ్రరీ, జాన్ రైలాండ్స్ లైబ్రరీల్ని చుట్టి వచ్చాను. వాటన్నిటిలో చెప్పుకోదగ్గది జాన్ రైలాండ్స్ లైబ్రరీ. ఆ గ్రంథాలయభవనం యూరోప్‌లోని ఆధునిక గోతిక్ వాస్తువైభవానికి సజీవప్రతీక. మాంచెస్టర్‌కి చెందిన ప్రముఖవ్యాపారి జాన్ రైలాండ్స్ స్మారకార్థం 1890 నుండి పదేళ్ళపాటు నిర్మించిన ఆ భవనానికి ఆక్స్‌ఫర్డ్‌కి చెందిన వాస్తుశిల్పి బసిల్ చాంపెనీస్ రూపకల్పన చేసాడు. 1972 వరకు స్వతంత్రంగా ఉండిన గ్రంథాలయం నేడు మాంచెస్టర్ యూనివర్శిటీ లైబ్రరీలో భాగంగా ఉంది. అంతర్జాతీయంగా పేరుపొందిన పురాపత్రసేకరణగా ఆ లైబ్రరీ ఇంగ్లాండ్‌లోని అకడమిక్ లైబ్రరీలలో మూడవస్థానంలో నిలిచి వుంది. ప్రాచ్య, పశ్చిమాలకు చెందిన ప్రాచీనపత్రాలు సుమారు ఏభైలక్షల వరకు ఆ లైబ్రరీ సేకరించింది. వాటిలో సుమారు మూడవవంతు జాన్ రైలాండ్స్ లైబ్రరీలో ఉన్నాయి.

నేనా లైబ్రరీ గురించి వినడం కూడా అటువంటి పత్రాల సందర్భంగానే. ‘విండోస్ ఆన్ చైనా’ పేరిట లైబ్రరీ ఏర్పాటుచేసిన ప్రత్యేకప్రదర్శన గురించి ప్రకటన చదివి ఆ లైబ్రరీని వెతుక్కుంటూ వెళ్లాను. గ్రేయిష్ కల్గిన పింక్ రంగు శిలతో నిర్మించిన ఆ శతాబ్దిభవనం మొదటి చూపులోనే నన్ను ఆకట్టుకుంది. మెయిన్‌హాల్‌లో ప్రవేశించగానే ఎదురపడే ప్రతిమని సరిగ్గాచూడకపోతే మేరీమాత ప్రతిమగా భ్రమపడే అవకాశం ఉంది. యథార్థానికి ఆ ప్రతిమ థియాలజీకి మూర్తిరూపం. ఆమెకి అటూ ఇటూ ఉండే రెండు ప్రతిమలు ఆర్ట్ నీ, సైన్స్‌ నీ సూచిస్తాయి. అటూ ఇటూ మెట్లు ఎక్కి పైకి వెళ్తుంటే ఎత్తయిన ఆర్చీలు, పాలిష్‌తో రూపొందించిన ప్యానెల్స్, షాండ్లియర్స్ మనని సంతోషపూర్వకంగా ఆహ్వానిస్తాయి. పైన అద్దాల మీద దాదాపు అరవైమంది యూరపియన్ ప్రముఖుల చిత్రాలు చిత్రించబడ్డాయి, వారిలో ఎక్కువమంది కవులే. రాతిపని ప్రధానంగా పురాతన గోథిక్ వాస్తునే తలపిస్తున్నప్పటికీ దీపాల ఏర్పాట్లు, స్విచ్ ఓవర్లు, తలుపులు, రేడియేటర్ గ్రిల్స్, కంచుతో చేయబడటంతో ఆ భవనానికి గాంభీర్యం, రాజసం చేకూరాయి. ఒక్క భవనమేకాదు, అందులో పనిచేసే ఉద్యోగులుకూడా నన్ను ఆకట్టుకున్నారు. ఇంగ్లాండ్‌లో తక్కినచోట ఎదురయిన సౌహార్దమే ఇక్కడా ఎదురయింది. ‘గోథిక్ వాస్తురీతిని ఫోటో తీసుకోవచ్చా’ అని అడిగితే అసిస్టెంట్ లైబ్రేరియన్ ‘ఇక్కణ్ణుంచికన్నా పైనుంచి తీసుకుంటే ఫోటోలు బాగా వస్తాయి’ అని నన్ను స్టెయిర్‌కేస్ మీంచి బాల్కనీలోకి తీసుకువెళ్ళి నేను ఫోటోలు తీసుకునేదాకా మర్యాదగా, స్నేహపూర్వకంగా నాకోసం నిలబడివుంది.

రైలాండ్స్ లైబ్రరీలో మెయిన్‌హాల్‌లో అరుదయిన చారిత్రకపత్రాల, పుస్తకాల ప్రదర్శన ఉంది. రైలాండ్స్ సేకరణలోని అత్యుత్తమపత్రాల్ని ప్రదర్శన కోసం ఎంపిక చెయ్యడానికి యూనివర్సిటీకి చెందిన మహాపండితులు కృషిచేసి ఏరికూర్చిన ప్రదర్శన అది. గ్లాస్ షోకేస్‌లో అమర్చిన ప్రతి పత్రం పక్కనా ఎవరో ప్రసిద్ధ యూనివర్శిటి పండితుడు తాను అనేక పత్రాల్లో ఆ పత్రాన్నే ప్రదర్శనకు ఎందుకు ఎంపిక చేసిందీ వివరించే నోట్ కూడా ఉంది. ఆ పత్రం వల్ల ఆ నోట్, ఆ నోట్ వల్ల ఆ పత్రం మరింత ఆసక్తికరంగా కన్పించాయి. ఉదాహరణకు రైస్ డేవిస్ సేకరించిన బౌద్ధతాళపత్ర గ్రంథాల్ని ప్రదర్శనకి ఎంపిక చేసిన ప్రొఫెసర్ ఇలా రాసాడు:

ప్రదర్శనలోని ముఖ్యమయిన ఇతర పత్రాల్లో పన్నెండవశతాబ్ది రాతప్రతి (రైలాండ్స్ లాటిన్ ఎం. ఎస్. 420), స్పానిష్ న్యూటెస్టమెంట్ (1543), అట్లాస్ మేజర్ (1662), ఎ వర్క్ ఆఫ్ మైనింగ్ (1556), మొట్టమొదటి వుడ్‌కట్ ఇలస్ట్రేటెడ్ బుక్ (1462) ఉన్నాయి. 1797 నాటి క్రికెట్  యాన్యుయల్ రికార్డ్స్‌తోపాటు మాక్స్ ముల్లర్ ప్రచురించిన ‘సేక్రెడ్ బుక్స్ ఆఫ్ ద ఈస్ట్’ మొదటి ప్రతులు (1883) దాకా ఆ ప్రదర్శనలో ఎన్నో ఆసక్తికరమైన పత్రాలున్నాయి. కాని వాటన్నింటిలోనూ తలమానికంగా చెప్పవలసిన పత్రం ప్రదర్శనలో లేనేలేదు. అది జాన్ గూటెన్‌బర్గ్ ముద్రించిన ప్రపంచపు మొట్టమొదటి ముద్రితగ్రంథం ‘ది బైబిల్’ (1455). ఆ పుస్తకం రైలాండ్స్ సేకరణలో ఉందని తెలిసినప్పుడు దాన్ని చూసే అవకాశం వుందన్న వూహే నన్ను ఉద్వేగభరితుణ్ణి చేసింది.

తిరిగి మళ్ళా పైకి వెళ్ళి ఆ పుస్తకం చూపించగలరా అని లైబ్రరీ అధికారుల్ని అడిగాను. అందుకు మొదట వాళ్ళు నన్ను యూనివెర్సిటి నుండి అనుమతి తెచ్చుకోమన్నారు. నేను ఇండియా నుండి వచ్చాననీ, నా పాస్‌పోర్ట్ పరిశీలించవచ్చుననీ, నేనా పుస్తకాన్ని కనీసం ముట్టుకోననీ, దూరం నుంచే చూసి సంతోషపడగలననీ విన్నవించిన మీదట లోపల రక్షణలోఉన్న పుస్తకాన్ని బయటకు తీసుకువచ్చి బల్లమీదపెట్టి ఒక్కొక్క పేజీ తిప్పి చూపించారు. మెకానికల్ కాలిగ్రాఫిక్ వర్క్‌ గా ఉన్న ఆ మొదటి ప్రింట్ పుస్తకాన్ని కళ్ళప్పగించి చూసి, మొదటి ప్రింట్ పుస్తకాన్ని కళ్ళతో చూడగలిగానని నాకు నేను చెప్పుకున్నాను.

రైలాండ్స్ లైబ్రరీని చూసినపుడు నాకు రాజమండ్రిలోని గౌతమీగ్రంథాలయం గుర్తొచ్చింది. పదేళ్ళకిందట ఆ లైబ్రరీని తెలుగుయూనివర్శిటిలో విలీనం చెయ్యడానికి ప్రభుత్వం చేసిన హడావిడీ, దానిపైన పౌరసంఘాలు ప్రకటించిన అసమ్మతీ గుర్తొచ్చాయి. విలీనం సంగతి సరే, కాని మాంచెస్టర్ యూనివర్శిటి పండితుల వలె మన యూనివర్శిటి పండితులెవరయినా ఈ పదేళ్ళలో ఒక్కరయినా గ్రంథాలయంలోని ఏ ఒక్క పుస్తకాన్నయినా పబ్లిక్ కోసం రికమెండ్ చేశారా? అసలు విలువైన పురాతన పుస్తకాల్ని అలా ప్రదర్శించవచ్చునని ఏ పండితుడికైనా, ఏ వైస్‌ఛాన్సలర్‌కైనా ఇంతవరకూ స్ఫురించిందా?


21

A Dirty City

In accordance with Agenda 21, adopted at the 1992 Earth Summit in Rio de Janeiro, Manchester formulated its own Local Agenda 21. With sustainable urban development as its guiding objective, it constituted seven action committees spanning education, commerce, civic groups, residents’ associations, conservation bodies, healthcare, local administration, public institutions, trade unions, women, and youth to design future frameworks. These committees were tasked with drafting action plans across health, environment, energy, transit, pollution control, the economy, and education.

I have frequently heard compatriots returning from abroad speak glowingly of the immaculate highways and pristine cleanliness of Western cities. Yet I cannot say the same for Manchester. Not only are the streets visibly grimy, but there prevails an attitude that public sanitation is strictly the government’s problem, absolving the citizen of any personal responsibility.

Public conveniences are virtually non-existent; in Piccadilly, at the very heart of the city, public toilets are locked shut by seven in the evening—the lingering fallout of a dispute between municipal sanitation workers and civic authorities. While the avenues often appear orderly, that surface cleanliness seemed attributable primarily to the temperate climate. In a tropical land like ours, where dust swirls relentlessly for nine months of the year, can equivalent municipal cleanliness ever be realistically achieved?

My question is fundamental: does economic development truly correlate with civic sanitation? Cleanliness is an interior civic culture (poura-samskaram). Industrial expansion may multiply pollutants, but I doubt it ever fosters genuine civic hygiene.

In an 1840 report published when the Industrial Revolution was raging at its zenith, Dr. John Robertson wrote of Manchester:

A century and a half later, in the Local Agenda 21 document (1996) published by the Manchester City Council, they conceded:

Economic expansion does not necessarily enhance the well-being of the working citizen; on the contrary, it often deepens his physical decline. Nowhere does the structural incongruity of the industrial growth paradigm lay itself bare with such unsparing clarity as it does here.

22

The John Rylands Library

One afternoon, I set out to explore Manchester Town Hall, the Central Library, and the John Rylands Library. Among these, the John Rylands Library stands peerless. The building is a living monument to modern Gothic architectural grandeur in Europe. Commissioned in 1890 as a memorial to the prominent Manchester textile merchant John Rylands and taking a decade to complete, it was designed by the Oxford architect Basil Champneys. An independent foundation until 1972, it is today an integral part of the Manchester University Library.

As a world-renowned repository of rare manuscripts and incunabula, it ranks third among the great academic libraries of Britain. The institution has assembled nearly five million historic manuscripts spanning the Orient and the Occident, with approximately one-third housed within the John Rylands Library itself.

My first encounter with the library’s fame was through its archival treasures. Drawn by an announcement for a special exhibition titled Windows on China, I sought out the library. Built of a soft, grey-pink Cumbria sandstone, the century-old edifice arrested my gaze at first sight.

Entering the main historic reading hall, one encounters a marble statue that a casual glance might easily mistake for the Virgin Mary. In truth, the figure is an allegorical personification of Theology, flanked on either side by figures representing Art and Science. Ascending the stone staircases, soaring pointed arches, polished timber paneling, and wrought chandeliers extend a solemn, magnificent welcome. Stained-glass windows along the upper clerestory depict some sixty eminent European luminaries, the majority of them poets.

While the stonework summons the austere dignity of medieval Gothic architecture, the bronze fittings, light fixtures, switchboards, heavy doors, and radiator grilles lend the interior an imperial gravitas.

It was not merely the stone architecture that won my admiration, but the grace of the staff within. The unforced warmth I had encountered elsewhere in England greeted me here as well. When I inquired whether I might photograph the Gothic interiors, the Assistant Librarian said:

“You will get far better angles from the upper gallery than from here.”

She guided me up the staircase to the balcony and waited with patient, courteous warmth until I had framed my photographs.

In the main reading hall of the Rylands Library, an exhibition of rare manuscripts and historic printed works was on display. Eminent scholars of the university had laboriously combed through the collection to curate this presentation. Beside each manuscript rested an interpretive card by a distinguished academic explaining why, from among millions of folios, this specific document had been selected for display. The note illuminated the document, and the document deepened the note.

For instance, the professor who selected the collection of Buddhist palm-leaf manuscripts assembled by T. W. Rhys Davids had written:

Among the other monumental exhibits were a twelfth-century illuminated manuscript (Rylands Latin MS 420), a Spanish New Testament (1543), an edition of Joan Blaeu’s Atlas Major (1662), Georgius Agricola’s treatise on mining, De Re Metallica (1556), and an early woodcut-illustrated block-book (1462). The cases contained curiosities ranging from a 1797 cricket annual to first editions of Max Müller’s monumental Sacred Books of the East (1883).

Yet the supreme jewel of the collection was absent from the display cases: the world’s very first printed book, the Gutenberg Bible (1455), printed by Johannes Gutenberg. Learning that a copy was preserved within the Rylands archives, the mere prospect of looking upon it stirred an overwhelming tremble within me.

Ascending to the administrative office, I inquired whether I might be permitted to see the volume. The curators initially instructed me to secure formal clearance from the university. When I submitted that I was a visiting scholar from India, that they were welcome to inspect my passport, and promised that I would not lay a finger upon the leaves but merely feast my eyes from a respectful distance, they relented. They retrieved the heavily protected treasure from the inner vaults, placed it upon a reading desk, and turned its leaves before my eyes, one by one.

Gazing upon that first triumph of mechanical typography—a work that preserved the majestic aesthetic discipline of monastic calligraphy—I whispered to myself in silent wonder: I have looked upon the first printed book with my own eyes.

Standing within the Rylands Library, my mind flew back to the Gautami Library in Rajahmundry. I remembered the official haste with which the government had sought to merge it into Telugu University a decade earlier, and the fierce dissent voiced by civic associations. The merger aside, have our university scholars across these past ten years recommended a single volume from its archives for public contemplation, as the scholars of Manchester did here? Has it ever occurred to an academic or a Vice-Chancellor in our state that precious, ancient books might be exhibited to educate and inspire the public mind?

25-10-2026

Leave a Reply