నా ఇంగ్లాండ్ యాత్ర-14

23

ఇంగ్లీష్ పేషంట్

‘ఇంగ్లీష్ పేషంట్’ సినిమా తొమ్మిది ఆస్కార్లు గెలుచుకుందని తెలిసినప్పుడు ‘కార్నర్ హౌస్’కు పోయి ఆ సినిమా చూసాను. ఆస్కార్ చరిత్రలో తొమ్మిది అవార్డులు గెలుచుకున్న సినిమాల్లో ‘బెన్‌హర్’ (1959), ‘లాస్ట్ ఎంపరర్’ (1988), తర్వాత ‘ఇంగ్లీష్ పేషెంట్’ మూడవది. అవార్డులు ప్రకటించినపుడు చిత్ర దర్శకుడు ఆంథోని మింగేలా ఆనందం పట్టలేకపోయాడు. ఈ అవార్డుల్ని పొందడం తనకి చిన్ననాడు స్కూల్లో స్పోర్ట్స్ బహుమతులు పొందినంత ఉల్లాసాన్నీ, ఉత్తేజాన్నీ గుర్తుకు తెచ్చిందన్నాడు.

ఒకవిధంగా బ్రిటిష్ చలనచిత్ర పరిశ్రమకి కూడా ఇది సంతోషవార్త. ఫిల్మ్ ఇండస్ట్రీ నేడు బ్రిటన్‌లో ఎన్నడూ ఎరగని సంక్షోభంలో కూరుకుపోయివుంది. 1995లో 73 చిత్రాల్ని 1996లో 121 చిత్రాల్ని నిర్మించినా అందులో 46 శాతం చిత్రాలు ఇంతదాకా విడుదలకి నోచుకోకపోయాయి. విడుదల అయిన వాటిలో కూడా 22 శాతం పరిమితమైన విడుదలకే నోచుకున్నాయి. 90-94 మధ్యకాలంలో విడుదల అయిన చిత్రాల్లో కేవలం 2 మాత్రమే నిర్మాణవ్యయాన్ని తిరిగి రాబట్టుకోగలిగాయి. చలనచిత్ర ప్రేక్షకుల సంఖ్యకూడా ఒక్క 90-91లో తప్ప తక్కిన సంవత్సరాల్లో అత్యంత నిరాశాజనకంగా ఉంది.

సినిమాతో పోలిస్తే ఇతర కళా రూపాలు, నాటకాలు, ఒపేరాలు, బాలేలు, నృత్యాలకు అత్యధిక జనాదరణ ఉండటం సర్వేల్లో ధ్రువపడింది, ముఖ్యంగా నాటకాలు. ఆస్కార్ అవార్డులు ప్రకటించిన రోజు ‘ఇంగ్లీష్ పేషంట్’ చిత్రానికి వచ్చిన ప్రేక్షకులకన్నా ‘ఫౌస్ట్’ నాటకానికి ఎక్కువమంది ప్రేక్షకులు హాజరుకావడం నేను కళ్ళారా చూశాను. అత్యద్భుతమైన సాంకేతికపరిజ్ఞానంతో నిర్మించబడుతున్న చిత్రాలు జనాదరణ కోల్పోవడం వెనుక బ్రిటిష్ సమాజపు మనః స్థితి ఎటువంటిది? బ్రిటిష్ ప్రేక్షకుడికి సినిమాలోని ఇంపెర్సనల్ స్ప్లెండర్ కన్నా రూపకంలోని పర్సనల్ టచ్ ఎక్కువ ఓదార్పు కలిగిస్తోందా?

సృజన ఎప్పుడూ ఇంటరాక్షన్ వల్లనే బలపడుతుంది. పెరుగుతున్న జనాదరణవల్ల నాటకరంగం రోజురోజుకీ మరింత సృజనాత్మకంగా బలపడుతోంది. దేశమంతటా స్క్రిప్ట్ రైటింగ్ వర్క్‌ షాప్‌లు విరివిగా నిర్వహిస్తున్నారు.  నాటకబృందాల్లో సినిమానటులు కూడా వచ్చి చేరుతున్నారు. ఒకప్పుడు ఎంతో వైభవాన్ని చవిచూసిన బ్రిటిష్ సినిమాని నేడు ఆవహించిన స్తబ్ధతలో ‘ఇంగ్లీష్ పేషెంట్’ విజయం ముఖ్య సంఘటన. కాని దీన్నుండి అద్భుతాలేవో సంభవిస్తాయని ఎదురు చూడలేమని గార్డియన్ పత్రిక సమీక్షించింది. ఆ సమీక్షకుడు ఇంకా కటువయిన విశ్లేషణ చేస్తూ ‘ఇంగ్లీష్ పేషంట్’ విజయం దాని ‘అనింగ్లీష్’ చిత్రీకరణ వల్లనే సాధ్యపడిందన్నాడు. బుకర్ ప్రైజ్ పొందిన మైఖల్ ఒండాట్జి నవలని తెర కెక్కించడంలో దర్శకుని పైన అతని ఇటాలియన్ బాల్యపు ప్రభావమే ఎక్కువ పనిచేసిందనీ, మొత్తం తొమ్మిది అవార్డులలో బ్రిటిష్ చేతులకి అందినవి నాలుగు అవార్డులేనన్నది కూడా మనం గమనించాలనీ అతను రాసాడు.

మింఘేలా కూడా ‘నా అభిరుచి అన్నివేళలా ఇంగ్లీష్ సంప్రదాయపు కట్టుబాట్లకి అనుగుణంగా ఉండేది కాదు’ అని తన ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘ఇంగ్లీష్ పేషంట్’లో అత్యద్భుతమైన సినిమాటోగ్రఫిని పక్కన పెడితే, అద్భుతమనిపించే అంశాలేవీలేవు, కాని మంచి చిత్రంగా, మనల్ని హృదయాలకు తాకే కథగా అది గుర్తుండిపోతుంది. బ్రిటిష్ ప్రేక్షకుడికి జాతులకతీతమయిన మానవుణ్ణి చూసిన సంతృప్తి కలుగుతుంది. పోస్ట్ కలోనియల్ ప్రపంచంలో ఒకప్పటి ఇంపీరియల్ నేషన్ తన గతచరిత్రని నెమరువేసుకునే తీరులో కూడా విలువలు మారుతుండటాన్ని ఈ చిత్రం ద్వారా గమనించాను. ఇంపీరియల్ గతం నుంచి కంపాషనేట్ వర్తమానంలోకి నడుస్తున్న బ్రిటిష్ జీవితమే ఇక్కడా ఉన్నది.

24

హార్డ్ టైమ్స్

సంప్రదాయ నాటకరంగానికి చెందిన నాటకం కూడా ఒకటి చూడాలని గుడ్‌కంపెనీ వారి ‘హార్డ్ టైమ్స్’ పాలస్ థియేటర్‌లో చూసాను. పదేళ్ళుగా గుడ్‌కంపెనీని స్థాపించి రీజనల్ థియేటర్లలో విశిష్టమయిన కృషిచేస్తున్న స్యూ పొమేరాయ్ ఈ నాటకానికి దర్శకత్వం వహించారు, డెనిస్ సాటర్స్ నవలకి అనుసృజన చేసారు. ఇతర సాంకేతిక నిపుణులు ప్రొఫెషనల్స్, ఎన్నో నాటకాల్ని గతంలో చక్కగా ప్రదర్శించిన అనుభవం ఉన్నవాళ్ళు. మన నాటకరంగంలో ప్రొఫెషనల్స్ వలె కాక ఆ నటులు యూనివర్సిటీ నుండి థియేటర్ ఆర్ట్స్, సంబంధిత టెక్నాలజీలలో పట్టభద్రులయిన వాళ్ళు. మన ఎమెచ్యూర్, ప్రొఫెషనల్ నాటకరంగం కన్నా బ్రిటిష్ నాటకరంగం ఆధిక్యత ఇక్కడే కన్పించింది. నటులు, సాంకేతిక నిపుణులు క్వాలిఫైడ్ అయినందువల్ల నాటకరంగ పరిమితుల గురించి, నాటకరంగ ప్రయోజనం గురించి వారికి స్పష్టమయిన అవగాహన వుంది.

ఒక ఉదాహరణ చెప్పాలంటే రంగస్థలంపై ఒక దృశ్యం నుండి మరొక దృశ్యానికి మారే వ్యవధిని వారు నిర్వహించిన తీరు. అదే మన రంగస్థలంపైన ఒకటి రెండు నిమిషాల ఆ చీకటి వ్యవధిలో ఎంతో తొట్రుపాటు, కన్‌ఫ్యూజన్ కనబడతాయి మనకి. ఆ వ్యవధి తీసుకోవాల్సి వచ్చినందుకు మన దర్శకులు ఎంతో దిగాలు పడిపోతారు, సినిమాలో లాగా ఆ వ్యవధిలేకుండా దృశ్యం వెనుక దృశ్యాన్ని తక్షణమే అందివ్వలేకపోతున్నందుకు సిగ్గుపడతారు. కాని బ్రిటిష్ రంగస్థలం పైన అటువంటి ఆతృత ఏదీ కన్పించలేదు నాకు. వారి దృష్టిలో దృశ్యానికీ దృశ్యానికీ మధ్యఉండే ఆ వ్యవధి తప్పనిసరి అంశం. ఆ తప్పనిసరితనాన్ని ప్రేక్షకులు అంగీకరించారనే వాళ్ళు భావిస్తారు.

నాటకమంటే తెంపులేని దృశ్యపరంపర అని వాళ్ళు మనల్ని నమ్మించాలనుకోరు. వివిధ దృశ్యాల్ని వీలువెంబడి మనముందు ఆవిష్కరించే ప్రదర్శనగానే వాళ్ళు నాటకాన్ని అర్థం చేసుకున్నారు. ఇందువల్ల ప్రేక్షకుడి ఏకాగ్రత భంగపడే అవకాశం ఏదీ ఉండదు. ఇప్పుడు టి.విలో ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమంలోనూ అడ్వర్టైజ్మెంట్స్ ని కూడా చూడవలసి వస్తుంది, అందువల్ల ప్రేక్షకుడి ఏకాగ్రతకి భంగమయినట్టు కాదు కదా. నాటకరంగంలోని ప్రొఫెషనలిజం ఇంకా ఇతర అంశాల్లో, ముఖ్యంగా లైటింగ్, మేకప్, సంగీతం, మాడ్యులేషన్, స్టేజి మూవ్‌మెంట్స్ వంటి ఎన్నో అంశాల్లో, స్పష్టంగా కనబడుతుంది. అయితే లోపాలు లేవనికాదు. ‘హార్డ్ టైమ్స్’ నాటకం చూసినప్పటికన్నా నవల చదివినప్పుడే ఎక్కువ ఇన్వాల్వ్ కాగలుగుతాం. తప్పకుండా డికెన్స్ ‘గుడ్‌కంపెనీ’ కన్నా ఎక్కువకాలం బతుకుతాడు. ఆ మాటకొస్తే డికెన్స్ పట్ల మనకున్న ప్రేమవల్లనే, ఆసక్తి వల్లనే మనం ‘గుడ్ కంపెనీ’ని సృష్టించుకోవాల్సి వచ్చింది. నాకు నచ్చిందేమిటంటే తమ ప్రయత్నంలోని ఈ పరిమితిపట్ల మనందరికన్నా ఎక్కువ అవగాహన ‘గుడ్‌కంపెనీ’కి ఉండటమే.

‘హార్డ్ టైమ్స్’ పారిశ్రామికయుగపు పితృస్వామ్యం పైన డికెన్స్ ఇచ్చిన నిర్దాక్షిణ్యమైన తీర్పు. పితృస్వామ్యం గొప్పగా చెప్పుకునే మూడు బాధ్యతలూ – చదువు, ఉపాధి, వివాహం – ఏవిధంగా విషాదకరంగా, హాస్యాస్పదంగా పరిణమిస్తాయో, పెట్టుబడిదారీ సమాజంలో అవి మనుషులపట్ల ఎటువంటి అసమానతల్ని సృష్టిస్తాయో, దానివల్ల సమాజం ఎంత డీహ్యూమనైజ్ కాగలదో, ఎంత డీమోరలైజ్ కాగలదో డికెన్స్ విస్పష్టంగా చూపిస్తాడు తన రచనలో.


23

The English Patient

Learning that The English Patient had captured nine Academy Awards, I went to Cornerhouse to watch the film. In the history of the Oscars, it stood alongside Ben-Hur (1959) and The Last Emperor (1987) as only the third film to secure a nine-statue haul. When the honors were announced, the director, Anthony Minghella, could scarcely contain his joy, remarking that sweeping these awards brought back the sheer exhilaration of winning sports day prizes in his schoolboy years.

In a sense, this was heartening news for the British film industry, which currently finds itself mired in an unprecedented crisis. Though 73 feature films were produced in 1995 and 121 in 1996, nearly 46 percent failed to secure theatrical distribution. Even of the films that reached the cinemas, 22 percent were restricted to limited, peripheral releases. Among the British films released between 1990 and 1994, barely two managed to recover their production budgets. Cinema attendances, save for a brief blip in 1990–91, have remained dismally low.

Audience surveys confirm that compared to cinema, traditional performing arts—theatre, opera, ballet, and dance—command vastly superior public patronage. Theatre, in particular, reigns supreme. On the very day the Academy Awards were announced, I witnessed with my own eyes that the audience assembled for the experimental staging of Faust far outnumbered the crowd gathered for The English Patient.

What underlying psychological condition explains why cinematic spectacles mounted with cutting-edge technical wizardry are losing their hold over British audiences? Does the contemporary British spectator find greater solace in the warm, immediate human touch of live stagecraft than in the cold, impersonal splendor of the screen?

Artistic vitality is perpetually sustained by live human interaction. Nourished by expanding audiences, the British stage is growing more vibrant with each passing day. Playwriting workshops are mushrooming across the country, while established screen actors are gravitating back toward repertory theatre companies.

Amidst the prolonged torpor hanging over a British cinema that once tasted global glory, the triumph of The English Patient stands as a milestone. Yet, reviewing the film, The Guardian cautioned against expecting any structural miracle, offering the biting observation that the film succeeded precisely because of its “un-English” sensibility. The critic noted that in adapting Michael Ondaatje’s Booker Prize-winning novel, the director drew heavily upon his continental, Italian-immigrant sensibility, pointedly reminding readers that of the nine Academy Awards won, only four actually found their way into British hands.

Minghella himself conceded in an interview: “My artistic temperament has never aligned easily with the formal boundaries of the English tradition.”

Setting aside its breathtaking cinematography, The English Patient offers little that is truly miraculous; yet it endures as a fine film—a narrative that touches the chambers of the heart. The British viewer tastes the satisfaction of encountering a human consciousness that transcends narrow national boundaries. Through this film, I observed how, in a post-colonial world, a erstwhile imperial nation is re-evaluating its own imperial history with fundamentally altered values: British life journeying away from an arrogant imperial past toward a compassionate, humane present.

24

Hard Times

Longing to experience a production from the traditional theatrical repertoire, I went to the Palace Theatre to see Hard Times, staged by the Good Company. Founded a decade ago, the Good Company has accomplished pioneering work across regional theatres under the direction of Sue Pomeroy, who directed this production, based on Denis Salter’s stage adaptation of Charles Dickens’s novel.

The technical crew were seasoned professionals with extensive experience in mounting complex productions. Unlike many practitioners in our own theatrical circles, these actors were university graduates trained in theatre arts and stage technologies. It was precisely here that the superiority of British theatre over both our amateur and commercial stages made itself evident. Because the cast and crew were formally trained, they possessed an uncompromising grasp of the constraints of the stage, as well as its ultimate artistic purpose.

Consider, for instance, the way they handled the transitions between scenes. On our stages, the one or two minutes of darkness between scenes are invariably fraught with frantic rustling and visible disorientation. Our directors seem burdened with anxiety over these interludes, almost ashamed that they cannot dissolve instantly from one sequence into the next as in cinema. On the British stage, however, I witnessed no such nervous agitation. To their minds, the interval between scenes is an organic, necessary condition of the medium—a convention they trust the audience to accept without question.

They make no false claim that theatre must mimic an unbroken, cinematic continuum. They approach drama as a staged presentation that unfolds diverse visual and emotional tableaux before us as practical realities permit. Consequently, the audience’s concentration never wavers. When watching a television program today, one is obliged to sit through commercial interruptions, yet no one claims this fatally disrupts the viewer’s focus.

This deep theatrical professionalism showed itself plainly across every facet of the production—especially in lighting design, makeup, acoustic scoring, vocal modulation, and stage choreography.

This is not to say the production was without limitations. One remains far more profoundly engaged reading the novel Hard Times than watching it staged. Dickens will outlive the Good Company; indeed, it is our enduring devotion to Dickens that brought the Good Company into being in the first place. What I admired most was that the Good Company understood the natural limits of their endeavor far better than any critic in the stalls.

Hard Times is Dickens’s unsparing indictment of the patriarchy of the industrial age. He lays bare how the three celebrated pillars of patriarchal responsibility—education, employment, and marriage—lapse into tragedy and bitter farce. With penetrating clarity, he demonstrates how capitalist society breeds grotesque inequalities, showing how thoroughly it can dehumanize and demoralize human communal life.

25-10-2026

Leave a Reply