ప్రియసన్నిధి

ఆధునిక మానవుడు స్వభావరీత్యా Faustian. కానీ, ఆ సంక్షుభిత, సందిగ్ధ మానవుడి అంతరంగంలో ఒక lyrical మానవుడున్నాడని గొథేని చదివితేనే అర్థమవుతుంది. అందుకనే గొథే రచనలన్నీ అదృశ్యమయినా కూడా ఆయన గీతాలొక్కటీ చాలు, ఆయన్ని మహాకవిగా గుర్తించడానికి అన్నారు విమర్శకులు.

మాయగీతము

లోరెలీ జర్మన్లో రైన్ నది ఒడ్డున ఉన్న ఒక నిటారు పర్వతశిఖరం. మర్మరమంగా ధ్వనించే శిఖరం అని దాని అర్థం. ఆ కొండ పక్కన ఆ నదిలో ఎన్నో నావలు సుడిగుండంలో చిక్కుకుని మునిగిపోయాయి. ఆ కొండమీద ఒక సుందరి ఉండి పాటలు పాడుతూ ఉంటుందనీ, పడవనడిపే వాళ్ళు ఆ పాట వింటూ దారితప్పి మరణిస్తుంటారనీ స్థానిక కథనం.

రసగుళికలు

ఈ కవిత్వాన్ని ఏదో ఒక గాటన కట్టి ఉపయోగం లేదు. ఆ 'నువ్వు' ఎవరు అని శోధించీ ప్రయోజనం లేదు. ఒక్కటి మాత్రం చెప్పగలను. ఇది ప్రేమ కవిత్వం కాదు, ధ్యాన కవిత్వం. ఇది వసుధారాణికి 'తెలిసి', ప్రయత్నపూర్వకంగా రాసిన కవిత్వం కాదు. ఎన్నో జన్మలనుండీ ఆమెని అంటిపెట్టుకుని వస్తున్న ఏ జననాంతర సౌహృదాల కస్తూరిపరిమళమో ఇట్లా ఒక్కసారిగా గుప్పుమంది.