నేను తిరిగిన దారులు-11

అరుణగిరి దర్శనం

1

అత్యాశ్రమి

తిరువణ్ణామలై వెళ్దామని కోరిక ఇప్పటిది కాదు. చాలా చిన్నప్పుడు మా అక్క చలం గారి గురించి చెప్తూ, ‘ఆయన ఇప్పుడు తిరువణ్ణామలైలో ఉంటున్నారు’ అంది. ఈ మాట బహుశా 70ల మొదట్లో వినుంటాను. కొన్ని పేర్లలో ఏదో మహత్యముంటుంది. ఇదీ అని స్పష్టంగా చెప్పలేని ఆకర్షణ ఉంటుంది. తిరువణ్ణామలై అన్న పేరు నేను మొదటిసారి విన్నప్పుడు నాకా పేరులో అటువంటి ఆకర్షణే కనిపించింది.

చాలా ఏళ్ల తరువాత రమణమహర్షి జీవితం గురించి చదువుతున్నప్పుడు ఆయనకి మొదటిసారి తిరువణ్ణామలై అనే పేరు వినగానే చెప్పలేని మానసిక సంచలనం కలిగిందని చదివాను. ఆయనకు మధురైలో 17వ ఏట (1896) పినతండ్రి ఇంట్లో ఒంటరిగా కూర్చున్నప్పుడు ఒక్కసారిగా మరణభయం కలిగిందనీ, ఆ మరణభయం ఆయనని తక్షణమే అంతర్ముఖుణ్ణి చేసిందనీ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. దానికి కొద్దిరోజుల ముందర (1895) పొద్దున్న పదిగంటల వేళ బడికి పోతున్నప్పుడు దారిలో దూరపు బంధువు ఒకాయన ఎదురుపడ్డాడు. ఆయనను చూడగానే శ్రీ వేంకటరామన్ ఆయనని పలకరించి ‘ఎక్కడినుంచి వస్తున్నారు?’ అని అడిగారు. దానికాయన ‘అరుణాచలం నుంచి’ అని బదులిచ్చాడు. ‘అరుణాచలమా? అదెక్కడవుంది?’ అని వేంకటరామన్ అడిగితే, ‘ఏరా, తిరువణ్ణామలై పేరు వినలేదా? అదే అరుణాచలమంటే’ అని ఆ బంధువు జవాబిచ్చాడు. ఆ మాట వినగానే హృదయపు లోతుల్లో ఏదో అనిర్వచనీయమైన ప్రేమ పొంగిందనీ, ఆయన తదితర జీవితాన్ని ఆ ఘట్టమే మార్చేసిందనీ కూడా అందరికీ తెలిసిన విషయమే.

నేను ఇంటర్మీడియట్ రోజుల నుంచి ఓ పదేళ్లపాటు చలం సాహిత్యం ఒక్క అక్షరం కూడా వదలకుండా పదే పదే చదువుతూ గడిపాను. అందువల్ల ఆ కాలమంతా నేను కూడా చలంగారితో పాటు తిరువణ్ణామలై వస్తూ పోతూ, రమణమహర్షిని చూస్తూ గడిపినట్లే అనుకోవచ్చు. నాకు ఇంటర్మీడియట్‌లో తెలుగు బోధించిన ఉపాధ్యాయుడు ఒకరోజు క్లాసులో ‘చలం సంగతే చూడండి. మొదట్లో ఎలా రాశాడు. తరువాత తరువాత రమణమహర్షి దగ్గరికి వెళ్లాక భగవాన్ పాదాల ముందు దివాన్ అయిపోయాడు’ అన్నాడు. ఆ మాటల్లో ఎంతో వ్యంగ్యం ధ్వనించింది. నాకు చలం మార్గాన్నీ, చలం నడిచిన దారినీ అర్థం చేసుకోవడం మొదట్లో అంత సులభంగా అనిపించలేదు.

చలంగారు తిరువణ్ణామలై వెళ్లకముందు జీవించిన జీవితం గురించి, రాసిన సాహిత్యం గురించి ఆ తరువాత ఆయనలో వచ్చిన మార్పు గురించి ఆ రోజుల్లో తెలుగు రచయితల మధ్య వాదోపవాదాలు ఒక ఫ్యాషన్. చలం మారిపోయాడనీ, ఆయన ముందురాసిన వాటికి విరుద్ధంగా తరువాత జీవించాడనీ, తన అభిమానుల్నీ, పాఠకుల్నీ ఒంటరివాళ్లని చేసేసాడనీ అంటుండేవారు. కానీ భమిడిపాటి జగన్నాథరావుగారు, ఇస్మాయిల్‌గారు వంటి వాళ్లు చలంగారి పూర్వ జీవితానికి, తరువాత జీవితానికి మధ్య వ్యత్యాసం  ఏమీ లేదనీ, ఆయన మొదటినుంచీ సత్యాన్వేషకుడిగానే ఉంటూ వచ్చాడనీ చెప్తూ ఉండేవారు. వారు చూపించిన దారిలోనే తర్వాతి రోజుల్లో మా అక్క చలంగారి సాహిత్యం మీద పరిశోధన చేసి ‘సత్యాన్వేషి చలం’ అని ఒక పుస్తకం కూడా రాసింది.

నేను రాజమండ్రిలో ఉంటున్న కాలంలో చలంగారి ఉత్తరాలు, ముఖ్యంగా దీక్షితులుగారికి రాసిన ఉత్తరాలు, చిన్నారావుగారికి రాసిన ఉత్తరాలు పదేపదే చదివేవాణ్ణి. చలంగారి ఉత్తరాల్లో ‘ప్రేమలేఖలు’ నుంచి ‘మహాస్థాన్’ దాకా ఒక క్రమపరిణామం కనబడుతుంది. ముఖ్యంగా ‘మహాస్థాన్’ ఉత్తరాల్లో (1960) ఆయన ఆధ్యాత్మిక భూమిక స్పష్టంగా గోచరిస్తుంది. అందుకే ఆ ఉత్తరాలకు పరిచయం రాస్తూ సంజీవ్ దేవ్ ఇలా అన్నారు:

వీటిలోని ప్రత్యేకత ఏమిటంటే, చలంగారి జీవితంలోని సంధియుగాన్ని ఇవి సుందరంగా వ్యక్తపరుస్తాయి. అంతటితో ఆగక ఆయన పరిపక్వ జీవితాన్ని, తరువాతి జీవితంలోని స్థిరసంకల్పాల్ని, ఉన్నత జీవన సిద్ధాంతాల్ని, అందుకోబోతున్న తురీయావస్థనీ, అన్నిటినీ ఈ ఉత్తరాలు సూక్ష్మంగా వ్యక్తపరుస్తాయి… కవి ముదిరి మిస్టిక్ అయినవారి అనుభూతులు శబ్దరూపంలో వ్యక్తమైతే ఇలాగే ఉంటాయి. మానవుడు మానవాతీతుడుగా మారటం మానవత్వంపు చరమలక్ష్యమై ఉంది స్మరణాతీత కాలంనుంచీ.

ఇక్కడ సంజీవ్‌దేవ్ చాలా విలువైన వాక్యమొకటి రాశారు:

చలంగారిలో సాహిత్య కళాకారుడి స్థానంలో ఆధ్యాత్మికాన్వేషకుడు బలపడుతూ ఉండడం 30ల మధ్యనుంచే మొదలయ్యింది. ఆయన తిరువణ్ణామలై వెళ్లిన తరువాత దాదాపుగా ఆధ్యాత్మిక భూమికలోనే జీవించడం మొదలుపెట్టాడు. అందుకే ఆయన సాహిత్యకళతో మాత్రమే పరిచయమున్న రచయితలకీ, పాఠకులకీ ఆయన ఆధ్యాత్మిక భూమిక కొత్తగానూ, గందరగోళంగానూ కనిపించింది. చలంగారు రాసిన ఉత్తరాలు, ఆయన చేసిన అనువాదాలు చదవకుండా కేవలం ఆయన కాల్పనిక సాహిత్యం మాత్రమే చదివేవాళ్లకి ఈ సమస్య తప్పనిసరి. చలాన్ని నేను ఎంతో కొంత అర్థం చేసుకోగలగడానికి కారణం, నేనాయన ఉత్తరాల్ని ఎన్నోసార్లు పారాయణం చేయటమే. ఆ ఉత్తరాలు చదివేకొద్దీ నాకు రమణమహర్షి గురించి తెలుసుకోవాలనీ, రమణమహర్షి సాధన గురించి, సాక్షాత్కారం గురించి మరింత బోధపరుచుకోవాలనీ అనిపించేది.

ఒకరోజు నేను మల్లంపల్లి శరభయ్యగారికి ‘మహాస్థాన్’ ఉత్తరాలు చదవమని ఇచ్చాను. శరభయ్యగారు విశ్వనాథ సత్యనారాయణను జీవితం పొడుగుతా ఆరాధించిన వ్యక్తి. ఆయన చలంగారి పేరు చెప్తే విసుక్కుంటారని అంటూండేవారు. కానీ నాకెందుకో ఆయన చలం రమణాశ్రమం నుంచి రాసిన లేఖలు చదివితే బాగుంటుందనిపించింది. అందుకని ఒకరోజు బెరుగ్గానే ఆ లేఖలు ఆయన చేతిలో పెట్టాను. మూడునాలుగు రోజుల తర్వాత ఒకరోజు ఆయన నన్ను కూర్చోబెట్టి ఆ లేఖల గురించి రెండుమూడు గంటలపాటు మాట్లాడారు. అదొక అద్భుతమైన ప్రసంగం. చలంగారిమీదా, ఆయన ఆధ్యాత్మిక సాధనమీదా అటువంటి ప్రసంగం నేనింతదాకా మళ్లీ ఎవరినోటి వెంటా వినలేదు. ఆ రోజు చలం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖమంతా ఎర్రబడి ఏదో విద్యుదావేశానికి లోనైనవాడిలాగా కనిపించారు. ఎవరైనా గొప్ప కవి గురించి మాట్లాడుతున్నప్పుడో, కావ్యంగూర్చి మాట్లాడుతున్నప్పుడో ఆయనలో ఒక స్థిమితం, సంతోషం కనిపించేవి. కానీ శివకవుల గురించి మాట్లాడేటప్పుడు మాత్రం ఆయన ముఖంలో ఒక ఉద్విగ్నత తాండవించేది. చివరికి ఆయనకు అత్యంత ప్రీతిపాత్రుడైన కాళిదాసు గురించి మాట్లాడేటప్పుడు కూడా, మేఘసందేశం, శాకుంతలాల కాళిదాసు గురించి మాట్లాడేటప్పుడు ఎంతో సౌమనస్యంతో కనిపించే ఆ మనిషే కుమారసంభవం గురించి మాట్లాడేటప్పుడు ఉద్విగ్నభరితుడుగా మారిపోయేవారు. అటువంటి ఉద్విగ్నతనే ఆరోజు ఆయన ముఖంలో చూశాను. చలాన్ని ఒక శివకవిగా భావించారా ఆయన?

‘మనోనాశనం’ అన్నారాయన.

‘మనోనాశనం, ఆ ఉత్తరాలంతా కనపడుతున్నది చలం తన మనోనాశనం కోసం చేసిన పోరాటమేనయ్యా’ అన్నారాయన. ‘చలం ఒక ఫైర్. మా గురువుగారి (విశ్వనాథ సత్యనారాయణ) గురించి ఆమాట అనలేను’ అనికూడా అన్నారు.

మనోనాశనమంటే ఏమిటో నాకు ఛాయగా తెలుస్తూనే ఉందికానీ దాని గురించి శరభయ్యగారిని అడగలేకపోయాను. ఆయన వాగ్ధారకు అడ్డుపడలేకా, అడ్డుపడితే అదెక్కడ ఆగిపోతుందోనన్న భయంతోనూ నేనారోజు మౌనంగా ఉండిపోయాను. కానీ నాకు ఆ సమయంలో ఆర్.ఎస్. సుదర్శనంగారింట్లో గోడమీద బుద్ధుడు, రమణమహర్షి, జిడ్డు కృష్ణమూర్తుల బొమ్మలుంటాయని గుర్తొచ్చింది. అందుకే సుదర్శనంగారి దగ్గరికిపోయి రమణమహర్షి గురించి చెప్పమని అడిగాను. ఆ రోజూ, ఆ తరువాతా చాలాసార్లు సుదర్శనంగారు రమణమహర్షి గురించి చాలా విషయాలు చెప్పారు.

సుదర్శనంగారు ఆ రోజుల్లోనే చలంగారిపైన సాహిత్య అకాడమీ కోసం ఒక మోనోగ్రాఫ్ రాసే పనిలో ఉన్నారు. అందువల్ల ఆయన చలంగారి రమణాశ్రమ జీవితం గురించీ, అక్కడాయన అనుభవాల గురించీ, ఆయన అన్వేషణ గురించీ తాను తెలుసుకుంటున్న విషయాలు ఎప్పటికప్పుడు నాకు కూడా చెప్తూండేవారు. మాస్టారు చలం లేఖల్లో మనోనాశనం కనబడుతోందన్నారని ఆయనతో అంటే, ‘అవును. చలం సమస్య అదే. చిట్టచివర ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ‘ఈ చలం ఒకడు నన్ను వదలకుండా ఉన్నాడు’ అని చలమే చలం పట్ల విసుక్కున్నాడు’ అన్నారు.

ఆరోజుల్లో సుదర్శనంగారు ప్రాక్పశ్చిమ తత్త్వశాస్త్రాలకు మాకొక కూడలిలాగా కనిపించేవారు. అప్పట్లో మా చుట్టూ సమాజం కమ్యూనిజం, మార్క్సిజం గురించి మాట్లాడుతుండేది. కొద్దిమంది నా రాజమండ్రి మిత్రులు అస్తిత్వవాదం గురించి కూడా చర్చిస్తుండేవారు. ముఖ్యంగా కవులూరి గోపీచంద్. గోపీచంద్ వాళ్ల నాన్నగారు కవులూరి వేంకటేశ్వరరావుగారు కమ్యూనిస్టుగా జీవితం మొదలుపెట్టి రాయిస్టుగా పరిణమించారు. గోపీచంద్ కమ్యూనిజాన్నీ, రాయిజాన్నీ కూడా చదివినప్పటికీ అస్తిత్వవాదిగా ఎదుగుతున్న రోజులు. వీటన్నిటి గురించీ మాకు సాధికారికంగా చెప్పడానికీ, మా సందేహాలు తీర్చడానికీ మాకున్న ఏకైక ఆధారం సుదర్శనంగారే. కానీ ఆయన పూర్తి వేదాంతి. అదీకూడా, అద్వైతి. సత్యాన్వేషణలో ఆధునిక భౌతికశాస్త్రానికీ, వేదాంతానికీ మధ్య సరిహద్దులు చెరిగిపోతున్నాయని చెప్పేవారాయన. నేనప్పటికే ఉపనిషత్తులూ, భగవద్గీతా, కొన్ని వేదాంత రచనలూ చదివినప్పటికీ నాకు ఆ వేదాంతచింతన పరిభాషగా మాత్రమే వినిపించేది. నేను నిలువెల్లా ఒక రొమాంటిసిస్టుగా ఊపిరిపీలుస్తున్న రోజులు. నేను నా భావుకత్వపు మత్తులోంచి సుదర్శనంగారు మాట్లాడే అద్వైతాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాణ్ణి. ‘అద్వైతం మానవానుభవంలోకి వస్తుందనడానికి మనకి తెలిసిన అతి సమీప ఉదాహరణ రమణమహర్షి’ అని ఆయన అనేవారు.

సుదర్శనంగారితో చర్చల్లో నాకో విషయం బోధపడింది. అదేమంటే ఒక మనిషి ముక్తి పొందడమనేది జీవితపు చివరి క్షణాల్లో సంభవించే విషయం కాదనీ, ఒక మనిషి ముక్తుడయిన తర్వాతకూడా జీవితం జీవించవచ్చనీ, అలా జీవించే ముక్తులకి రమణమహర్షి ఒక ఉదాహరణ అనిన్నీ. రమణమహర్షి తననుతాను ‘అత్యాశ్రమి’ అని చెప్పుకునేవారని, అటువంటి అత్యాశ్రమికి సామాన్య ప్రపంచపు కట్టుబాట్లు వర్తించవని కూడా ఆయన చెప్పారు.

పంతొమ్మిది ఇరవై ఏళ్ల వయసులో ఉన్న ఒక యువకుడికి ఇటువంటి చర్చలూ, ఆలోచనలూ సహజంగానే ఒక గొప్ప జీవితాదర్శాన్ని కళ్లముందు నిలబెడుతూ ఉండేవి. ఆత్మ గురించీ, ఆత్మవిచారం గురించీ, సాక్షాత్కారం గురించీ సుదర్శనంగారు మాట్లాడే మాటలు నన్ను ఎప్పటికప్పుడు చాలా ప్రభావితం చేశాయి. కానీ ఆ రోజు నామీద ఉండే బాధ్యతలవల్ల నాకూ ఆ ఆదర్శాలకూ మధ్య సముద్రమంత ఎడముందనిపించేది. కానీ ఆ సముద్రానికి అవతల ఏదో ఒక ప్రకాశవంతమైన సీమ ఉందనీ, అక్కడికి ఎప్పటికైనా చేరుకోవాలనీ ఆశగా ఉండేది. దాన్ని పొందడానికి ఆత్మవిచారం ఒక్కటే మార్గమని సుదర్శనంగారు పదేపదే అంటూండేవారు. రమణమహర్షి ‘నేనెవరు’ అనే విచారణ సాగించమని చెప్పడమేకాక, చివరికి ఆ ప్రశ్నను కూడా ఆ విచారాగ్నిలో దగ్ధం చేసేయాలని చెప్పారని ఆయన నాతో పదేపదే చెప్పేవారు. ఆ మాట రమణమహర్షి శివప్రకాశం పిళ్లై అనే జిజ్ఞాసువుకి రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానాల్లో (1902లో) మాట. మనసు అణిగేదేట్లా అని ఆ సాధకుడు అడిగిన ప్రశ్నకు రమణులు ఇలా జవాబిచ్చారు:

నా రాజమండ్రి రోజుల తరువాత కూడా నేను చలంగారినీ, రమణమహర్షిని చదువుతూనే ఉన్నాను. ముఖ్యంగా చలం రాసిన ‘భగవాన్ స్మృతులు’, రమణానంద సరస్వతి ‘శ్రీరమణ భాషణములు’, ‘సూరినాగమ్మ లేఖలు’, కృష్ణభిక్షు ‘రమణలీల’ లతో పాటు పాల్‌బ్రంటన్, ఓస్బోర్న్ వంటి పాశ్చాత్య సాధకుల రచనలు కూడా చదివాను. ఇవన్నీ రమణమహర్షి చలంగారి రమణస్థాన్ జీవితంపట్లా, పట్లా నాకొక గొప్ప కుతూహలాన్ని రేకెత్తిస్తూనే ఉండేవి. ఎప్పటికైనా ఒకసారి తిరువణ్ణామలై వెళ్లీ చూడాలనుకునేవాణ్ణి.


Beholding the Arunachala

1

The One Beyond the Stages of Life

The longing to visit Tiruvannamalai was not born yesterday. Long ago, when I was very young, my elder sister spoke of Gudipati Venkata Chalam and remarked, “He is living in Tiruvannamalai now.” I must have heard those words in the early 1970s. Certain names possess a mystic potency—an indefinable magnetism. When I first heard the name Tiruvannamalai, it held precisely that kind of charm for me.

Many years later, reading about the life of Ramana Maharshi, I discovered that the mere mention of Tiruvannamalai had stirred a tempest of emotion within him as well. Everyone knows the celebrated episode in Madurai when, at seventeen (1896), sitting alone in his uncle’s house, an abrupt fear of death seized him—a sudden reckoning that turned him irrevocably inward. Just a short while earlier, in November 1895, around ten in the morning on his way to school, an elderly distant relative crossed his path. Venkataraman greeted him and asked, “Where are you coming from?”

“From Arunachalam,” the relative replied.

“Arunachalam? Where is that?” asked Venkataraman.

“What, don’t you know Tiruvannamalai? That is Arunachalam,” the elder rejoined.

Hearing those words, an ineffable love welled up from the depths of his being—a turning point that altered the course of his entire life.

From my Intermediate college days, for nearly a decade, I pored over Chalam’s writings, reading every word again and again. In a sense, throughout that decade, I too traveled back and forth to Tiruvannamalai alongside Chalam, gazing upon Ramana Maharshi through his eyes. One day, the lecturer who taught us Telugu remarked in class with biting sarcasm: “Look at Chalam! Look at how he wrote in the beginning. Later, after going to Ramana Maharshi, he ended up as a diwan prostrate at Bhagavan’s feet!” In those days, understanding Chalam’s path and the road he traveled did not come easily to me.

Debating Chalam’s life and literature before his arrival at Tiruvannamalai, and the dramatic transformation that overtook him afterward, was a fashionable pastime among Telugu writers of the era. Many argued that Chalam had betrayed himself, that his later life contradicted his early revolutionary writings, and that he had deserted his admirers and readers. But writers like Bhamidipati Jagannatha Rao and the poet Ismail always maintained that there was no fundamental rupture between Chalam’s early and later phases; he had remained, from the very beginning, an uncompromising seeker of truth. Following their lead, my elder sister pursued research on Chalam’s literature in later years and wrote a book titled Satyanweshi Chalam (Chalam: The Truth-Seeker).

During my days in Rajahmundry, I read Chalam’s letters obsessively, especially those addressed to Chinta Deekshitulu and Kodavatiganti Channarao. In Chalam’s letters, one traces an unbroken evolution—from Prema Lekhalu (Love Letters) to Mahasthan (1960). In the Mahasthan letters in particular, his spiritual ground becomes clear. Introducing that collection, the writer and artist Sanjiva Dev observed:

“What is unique about these letters is the exquisite beauty with which they mirror the transitional epoch of Chalam’s life. Beyond that, they subtly delineate his mature being, the steadfast resolve of his later days, his lofty philosophy of life, and the fourth state of consciousness—the Turiya—that he was about to attain… When the experiences of a poet who has matured into a mystic find voice in words, they sound like this. For humanity to transcend itself and become the superhuman has been the ultimate goal of humankind since time immemorial.”

Here, Sanjiva Dev made a very perceptive observation:

“To an ordinary person, the thoughts and behavior of an artist—be it a poet, singer, actor, or painter—appear eccentric. To the artist, the world of the mystic appears just as baffling.”

The spiritual seeker had begun eclipsing the literary artist in Chalam from the mid-1930s onward. Once he moved to Tiruvannamalai, he lived almost entirely in the spiritual dimension. Thus, to writers and readers acquainted solely with his literary craft, his spiritual inwardness appeared foreign and disorienting. Anyone who reads only his imaginative fiction, bypassing his letters and translations, inevitably runs into this impasse. If I could understand Chalam to any degree, it was only because I treated his letters as sacred texts, chanting them in repeated study. The more I read those letters, the deeper grew my urge to comprehend Ramana Maharshi—to fathom his sadhana and his awakening.

One day, I handed the Mahasthan letters to Mallampalli Sarabhayya, requesting him to read them. Sarabhayya had revered Viswanatha Satyanarayana all his life, and it was widely rumored that he bristled at the mere mention of Chalam’s name. Yet, for reasons I could not explain, I felt he should read these letters written from Sri Ramanasramam. Hesitantly, I placed the volume in his hands. Three or four days later, he sat me down and spoke for nearly three hours on those letters. It was a magnificent discourse. Never before or since have I heard such a luminous exposition on Chalam and his spiritual quest.

As he spoke of Chalam that day, his face flushed red, as though seized by an electric current. Whenever he spoke of great poets or classic epics, an unruffled composure and delight would grace his presence. But when speaking of the medieval Shiva poets, an intense, surging ecstasy danced upon his countenance. Even with his beloved Kalidasa, while he spoke with serene grace about the Kalidasa of Meghaduta and Abhijnana Shakuntalam, the moment the conversation turned to Kumarasambhavam, he became passionately agitated. That very same divine frenzy burned in his eyes that day. Had he come to regard Chalam as a Shaivite poet?

“Manonāśanam!” he declared.

“Manonāśanam—destruction of the mind! Everything reflected in these letters, my boy, is Chalam’s desperate, fiery struggle for the annihilation of his own mind,” he said. “Chalam is a blazing fire. I cannot say that even of my own master, Viswanatha Satyanarayana.”

I had only a vague inkling of what manonāśanam truly meant, but I could not bring myself to interrupt Sarabhayya. Reluctant to stem his torrent of speech, and fearing that an interruption might break the spell, I remained silent. But at that moment, I recalled that the portrait wall in R.S. Sudarshanam’s house displayed the likenesses of the Buddha, Ramana Maharshi, and Jiddu Krishnamurti. So I went to Sudarshanam and asked him to tell me about Ramana Maharshi. On that day, and on many subsequent occasions, Sudarshanam opened up vast horizons about the Maharshi.

Sudarshanam was then at work on a monograph on Chalam for the Sahitya Akademi. Consequently, he shared with me whatever fresh insights he gathered regarding Chalam’s life at Ramanasramam, his inner struggles, and his spiritual quest. When I told him that Master Sarabhayya saw the battle for manonāśanam throughout Chalam’s letters, he agreed: “Yes. That was Chalam’s enduring struggle. Even in his very last interview, Chalam grew exasperated with his own persistent ego, lamenting: ‘This fellow Chalam refuses to let go of me!’”

In those days, Sudarshanam appeared to us as a luminous crossroads between Eastern and Western philosophies. Society around us was absorbed in debates on Communism and Marxism. A few of my Rajahmundry friends discussed Existentialism—foremost among them Kavuluri Gopichand. Gopichand’s father, Kavuluri Venkateswara Rao, had begun as a Communist before turning into an ardent Royist. Though Gopichand had read both Communism and Roy’s Radical Humanism, he was blossoming into an existentialist. Sudarshanam was our sole authority, the only guide who could address our doubts with command. Yet at his core, he was a thorough Vedantin—and an Advaitin at that. He used to say that in the quest for truth, the boundaries between modern theoretical physics and Vedanta were quietly dissolving.

Though I had already read the Upanishads, the Bhagavad Gita, and select Vedantic treatises, that philosophy sounded to me then like mere formal vocabulary. In those years, I was breathing romanticism through every pore of my being. Wrapped in the intoxicating haze of my own poetic sensibility, I tried to grasp the Advaita that Sudarshanam articulated. “The closest living proof that Advaita can be realized in actual human experience,” he would tell me, “is Ramana Maharshi.”

Through those dialogues with Sudarshanam, a profound insight dawned upon me: liberation (mukti) is not something that descends only in the terminal moments of a life; a person can live fully in this world even after attaining liberation, and Ramana Maharshi stood as the living testament of such a jivanmukta. He explained that Ramana Maharshi regarded himself as an Atyāśrami—one who has transcended the four conventional stages of life (varnashrama)—and that the rigid strictures of the worldly social order do not apply to such a being.

When asked whether karma pertains even to an Atyāśrami, the Maharshi replied: “There are no shastras or prescriptive codes to dictate how they must conduct themselves” (Talks with Sri Ramana Maharshi, 5 December 1936).

For a young man of nineteen or twenty, such dialogues held up a towering ideal of life. Sudarshanam’s reflections on the Self (Atman), self-inquiry (Atmavichara), and Self-realization left an indelible mark on me. Yet, burdened by the worldly responsibilities of those early years, the gulf between myself and those exalted ideals seemed as vast as an ocean. Still, the hope lingered that across that ocean lay a radiant shore, and that someday I would reach it. Sudarshanam repeatedly insisted that self-inquiry was the only path to that shore. He reminded me time and again that the Maharshi not only enjoined the inquiry “Who am I?”, but taught that the question itself must ultimately be consumed in the sacrificial fire of that very inquiry.

That teaching was part of the written answers Ramana Maharshi gave to the seeker Sivaprakasam Pillai in 1902. When asked how the mind could be quelled, the Maharshi answered:

“The mind will subside only through the inquiry ‘Who am I?’. The thought ‘Who am I?’, destroying all other thoughts, will itself finally be burnt away, just like the stick used for stirring the funeral pyre. Only then does Self-realization dawn.”

Long after my Rajahmundry days, I continued reading both Chalam and Ramana Maharshi. Along with Chalam’s Bhagavan Smritulu, Swami Ramanananda Saraswathi’s Talks with Sri Ramana Maharshi, Suri Nagamma’s Letters from Sri Ramanasramam, and Krishna Bhikshu’s Sri Ramana Leela, I also read the accounts of Western seekers like Paul Brunton and Arthur Osborne. All these works constantly rekindled my fascination with Ramana Maharshi and Chalam’s life at Ramanasthan. A persistent yearning stayed with me: to visit Tiruvannamalai in person, at least once in my lifetime.

2-9-2026

2 Replies to “నేను తిరిగిన దారులు-11”

  1. మనోనాశనం అన్న శరభయ్య మాష్టారు గారూ!

    ఒక మనిషి ముక్తి పొందడమనేది జీవితపు చివరి క్షణాల్లో సంభవించే విషయం కాదనీ, ఒక మనిషి ముక్తుడయిన తర్వాతకూడా జీవితం జీవించవచ్చనీ,…
    అత్యాశ్రమి అని చెప్పిన సుదర్శనం గారూ!

    ఆ అరుణగిరి దర్శనం కోసం నేను అరుణాచలం ఎప్పుడు వెళతానో…

    రమణాశ్రమం, చలం సమాధి ఎప్పుడు చూస్తానో…

  2. మాకు దగ్గర్లోనే ఉన్నా ఇంతవరకు తిరువణ్ణామలై వెళ్లలేదు. I hope to go there sometime.

    రమణ మహర్షి, చలం గారు, తిరువణ్ణామలై, ఒకరిని తలుచుకుంటే మిగిలిన వారి గురించి అనుకోకుండా వుండలేము.

    చలంగారి ఆధ్యాత్మిక అన్వేషణ గురించి మీ మాస్టారు గారు “చలం లేఖల్లో మనోనాశనం కనిపిస్తోంది” అని చెప్పడం, దాని గురించి సుదర్శనం గారితో జరిగిన చర్చ, explanation, రమణ మహర్షి తనను తాను “అత్యాశ్రమి”గా చెప్పుకున్న విషయం, అంటే ఏమిటని!!
    చాలా మంచి విషయాలు చెప్పారు సర్. 🙏🏽

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading