కావ్యాత్మక వాస్తవికత-1

ఆ రోజుల్లో స్టార్మ్ కూడా జర్మన్ జాతీయవాదాన్ని సమర్థిస్తూ వ్యాసాలు రాసేడు, ప్రచారం చేసాడు కానీ హుజూం నగరం ముట్టడికి గురికావడం, యుద్ధం, అణచివేతల్ని తట్టుకోలేక అతడు ప్రవాసానికి వెళ్ళిపోయేడు. ఆ తర్వాత దాదాపు పదేళ్ళ పాటు ప్రవాసిగానే గడిపాడు.

నేను తిరిగిన దారులు-11

‘మనోనాశనం, ఆ ఉత్తరాలంతా కనపడుతున్నది చలం తన మనోనాశనం కోసం చేసిన పోరాటమేనయ్యా’ అన్నారాయన. ‘చలం ఒక ఫైర్. మా గురువుగారి (విశ్వనాథ సత్యనారాయణ) గురించి ఆమాట అనలేను’ అనికూడా అన్నారు.

నీరస తథ్యాల్ని తిరస్కరించడం

ఒక మనిషి తాత్త్వికంగా సత్యాన్వేషణకు పూనుకోవడమంటే 'నీరస తథ్యాల్ని' తిరస్కరించడం. 'నిశ్చల నిశ్చితాల' ని పక్కకు నెట్టేయడం. కాబట్టే, సత్యాన్వేషణ అన్ని వేళలా సంతోషానికీ, మనశ్శాంతికీ దారితియ్యకపోగా, నిరంతర ఆత్మశోధనకీ, సంశయగ్రస్తతకీ, ఆత్మవేదనకీ దారితియ్యడం ఆశ్చర్యం కాదు. అలాగని మనం సత్యాన్వేషణని ఆపలేం. పక్కనపెట్టేయలేం. 'నిత్య నిరుత్తరపు ప్రశ్న జ్ఞానం ఇచ్చిన దానం' అని తెలిసికూడా మన వివేచనని కట్టిపెట్టలేం.