డా.రవీంద్రకుమార శర్మగారితో 2010 లో అదిలాబాదులో కళాశ్రమంలో చేపట్టిన సంభాషణల్ని ధారావాహికంగా నా బ్లాగులో మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఆ సంభాషణల్ని ఇలా పుస్తక రూపంలో ఈ గురుపూర్ణిమ శుభదినాన మీతో పంచుకుంటున్నాను. 416 పేజీల ఈ పుస్తకం డిజిటల్ ప్రతిని ఇక్కణ్ణుంచి డౌనులోడు చేసుకోవచ్చు.
ప్రియమైన శాఫో
ఈ నెలరోజులుగా ప్రాచీన గ్రీకు కవయిత్రి శాఫో కి రాస్తూ వచ్చిన ఉత్తరాల్లో మీరు కూడా co-correspondents గా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఆ ఉత్తరాల్ని ఇలా ఈ బుక్ గా మీ చేతుల్లో పెడుతున్నాను. స్వీకరించండి.
The Song Arrives
కోకిల ప్రవేశించే కాలం (2009) నా నాలుగో కవితా సంపుటి. అందులోంచి 41 కవితలు ఎంపికచేసి ఇంగ్లిషులోకి అనువదించి ఇలా The Song Arrives పేరిట వెలువరిస్తున్నాను. మా అమ్మమ్మ శ్రీమతి సన్యాసమ్మ మా అమ్మ పసితనంలోనే స్వర్గస్థులయ్యారు. ఆమెని మేమెప్పుడూ చూడలేదు. వారి స్మృతికి ఈ సంపుటి సమర్పిస్తున్నాను. ఇది నా 78 వ పుస్తకం. దీన్నిక్కణ్ణుంచి డౌనులోడు చేసుకోవచ్చు.
