మొదటి పని గంట

‘మొదటి పని గంట’ (2000) కథ రాసి పాతికేళ్ళు దాటినా ఎందుకనో ఎక్కువమంది దృష్టికి వెళ్ళలేదనిపిస్తూ ఉండింది. తెలుగులో కాఫ్కా పేరు చాలామంది ప్రస్తావిస్తుంటారుగాని, ఆయన కథల్లోనూ, నవలల్లోనూ కనిపించే bureaucratic labyrinth ల గురించి తెలుగు పాఠకులకి ఎక్కువ అవగాహన లేకపోవడం కూడా ఒక కారణమనుకుంటాను. ఇన్నాళ్ళకి ఈ కథని ఒకాయన ఎంచుకుని వినిపించడం నాక్కొంత ఆశ్చర్యం కలిగించింది. ఈ కథాస్రవంతి శీర్షిక నడుపుతున్న పప్పు భోగారావుగారు కమర్షియల్ టాక్స్ డిపార్ట్ మెంట్లో ఉన్నతాధికారిగా పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి. నీతిపరుడైన అధికారి. బహుశా అందువల్లనే ఈ కథ ఆయన్ని ఆకర్షించి ఉండవచ్చు. మీరు కూడా వింటారని ఆ లింకు ఇక్కడ పొందుపరుస్తున్నాను.

ఈ లింకు నాతో పంచుకున్న బి.ఎస్.ఎన్.మూర్తిగారికి ధన్యవాదాలు.

5-8-2026

2 Replies to “మొదటి పని గంట”

  1. మీరు రాసిన ‘మొదటి పనిగంట’ కథ శ్రీ పప్పుభోగారావుగారి రసోచిత గళంలో విన్నాను. కథకు ముందు మీ సమగ్ర పరిచయం చేయడం బాగుంది. సగటు కార్యాలయాల్లో కొందరు ‘క’లను దృష్టిలో ఉంచుకుని వాస్తవాన్ని వ్యంగ్యంలో పండించారు. కిందినుండి పైదాకా కార్యాలయ క్రమానుగత కార్యగతి విశ్లేషణ అనుభవశీలమైనది.
    ఇలాంటి కీలక కీచక కార్యాసురుల వల్ల ప్రగతి కుంటుపడుతుందని చెప్పక చెప్పిన కథ. అభినందనలు సర్.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading