ఈ కథాస్రవంతి శీర్షిక నడుపుతున్న పప్పు భోగారావుగారు కమర్షియల్ టాక్స్ డిపార్ట్ మెంట్లో ఉన్నతాధికారిగా పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి. నీతిపరుడైన అధికారి. బహుశా అందువల్లనే ఈ కథ ఆయన్ని ఆకర్షించి ఉండవచ్చు. మీరు కూడా వింటారని ఆ లింకు ఇక్కడ పొందుపరుస్తున్నాను.
అకథలు-2
అకథ అంటే కథగానిది. కాని దానిలో ఒక కథాస్ఫురణ ఉంటుంది. అలాగని దాన్ని మనం కథగా మారిస్తే దానిలోని కథ అదృశ్యమైపోయి అది నిజంగానే అకథగా మిగిలిపోతుంది.
నలుగురు పాండవులు
ఈ విచ్ఛిత్తిలో ఒక క్రియాశీలత్వం కూడా వుంది. విగ్రహాల్ని ధ్వంసం చెయ్యడం లాంటి విచ్ఛిన్నం కాదిది. గుడ్డుని విచ్ఛిన్నం చేసుకుని ప్రాణి బయటపడటం లాంటి విచ్ఛిన్నత. ఇది ఏకకాలంలో విధ్వంసకం, సృజనాత్మకం కూడా.
