కొన్ని కలలు కొన్ని మెలకువలు-39

మన మన ఆత్మల్ని ఆ అహింసాత్మకత వైపుగా జాగృతం చెయ్యడమే అన్ని రకాల విద్యలకూ అంతిమ ధ్యేయం. గమ్యం. కర్తవ్యం. ఆ మాటని నాకై నేను మరీ మరీ తెలియచెప్పుకునే ఉద్దేశ్యంతోనే నా ఈ అనుభవాల్ని పునశ్చరణ చేసుకుంటూ మీ ముందుంచుతున్నాను.