అనిల్ బత్తుల మధుశాల

ఈ పొయెట్రీలో మొత్తం కవితలన్నీ కూడా చాలా స్ట్రెయిట్‌గా, సింపుల్‌గా, అనవసరమైన అలంకారాలు లేకుండా, భేషజాలు లేకుండా, "దీన్ని కవితగా మార్చాలి" అనే తాపత్రయం లేకుండా ఉన్నాయి. బహుశా నేను రాశాననుకోండి, "దీన్ని కవితగా ఎలా మార్చాలి, ఎలా చెక్కాలి" అనే తాపత్రయం ఉంటుంది. ఆ బాధలేమీ లేకుండా సూటిగా, నేరుగా అతను చెప్పడానికి ప్రయత్నం చేశాడు.