
ఐదవ భాగం
1
4000 అడుగుల ఎత్తున
పాడేరు గిరిజన ప్రాంతం సముద్రమట్టానికి దాదాపు నాలుగువేల అడుగుల ఎత్తున ఉండే ప్రాంతం. దానికి ఒకవైపు ఒకప్పటి మధ్యప్రదేశ్, ఇప్పటి ఛత్తీస్‌గడ్, మరొకవైపు ఒరిస్సా గిరిజన ప్రాంతాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఇంకొకవైపు తూర్పుగోదావరి, ఖమ్మం, విజయనగరం జిల్లాల గిరిజన ప్రాంతాలు సరిహద్దులు.
విస్తీర్ణం రీత్యా జిల్లాలో దాదాపు యాభై ఆరుశాతం గిరిజన ప్రాంతం. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 33 గిరిజన తెగలు ఉండగా ఒక్క పాడేరులోనే దాదాపు 11 తెగలు ఉన్నాయి. ఏ విధంగా చూసినా దాన్నొక ఆదిమజాతుల ప్రదర్శనశాల అనవచ్చు.
గిరిజన ప్రాంతం లోని 11 మండలాలకూ సాంస్కృతిక విభజన ఒకటుంది. దాన్ని డా.పి.శివరామకృష్ణ తన ‘తెలుగు గిరిజనుల జానపదగీతాలు’ పుస్తకంలో చాలా చక్కగా వివరించాడు. దాదాపుగా ఆ విభజనను అనుసరించి ఆధునిక జీవితానికి తగ్గట్టుగా సవరించి చూస్తే గిరిజన ప్రాంతమంతా నాలుగు ముఖ్య ప్రాంతాలుగా కనిపిస్తుంది.
అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగూడ మండలాలు ఒక ప్రాంతంగా కనబడ తాయి. ఇక్కడి పరిస్థితులు దాదాపుగా విజయనగరం గిరిజన ప్రాంతాల్లోని సాలూరు, పాచిపెంట మండలాల్లో పరిస్థితుల వంటివే. ఇక హుకుంపేట, పాడేరు, గంగరాజు మాడుగుల ఒక ప్రాంతంకాగా, పెదబయలు, ముంచింగిపుట్టు మండలాల్ని మరొక ప్రాంతంగా చెప్పవచ్చు. అక్కడ దాదాపుగా ఒరిస్సా గిరిజన ప్రాంతాల సంస్కృతిని మనం చూడవచ్చు.
ఇంక కొయ్యూరు, గూడెం కొత్తవీధి, చింతపల్లి మండలాల సంస్కృతి వేరు. అక్కడ దాదాపుగా గోదావరి జిల్లాల మన్యసంస్కృతి కనవస్తుంది. ప్రఖ్యాతి చెందిన అల్లూరి సీతారామరాజు తిరుగుబాటుకి ఈ ప్రాంతమే కేంద్రస్ధానం.
ఈ మండలాలన్నింటిలో కొయ్యూరు, కొద్దిగా చింతపల్లి మినహా తక్కిన ప్రాంతాలన్నీ విద్యావిషయకంగా చాలా వెనకబడినవే. మరీ ముఖ్యంగా డుంబ్రిగూడ, ముంచింగిపుట్టు మండలాల పరిస్ధితుల్ని మనం బాగా వెనకబడిన ఆఫ్రికా దేశాలతో పోల్చవచ్చు.
శిశుమరణాల సంఖ్యలోగాని, ప్రసూతి మరణాల సంఖ్యలోగాని, స్త్రీ నిరక్ష రాస్యతలోగాని, ఆహార అభద్రతలో గాని ఆ మండలాల్లో నెలకొని ఉన్న పరిస్థితులు, రాష్ట్రంలో చెంచు ప్రాంతంలో తప్ప మరెక్కడా మనకి కనిపించవు.
అయితే సమస్య మనకి కేవలం వెనకబాటుతనంతో మాత్రమే కాదు. తక్కిన గిరిజన ప్రాంతాలు ముఖ్యంగా ఆదిలాబాద్‌లో, లేదా చెంచు, యానాది ప్రాంతాల్లో గాని జీవిస్తున్న గిరిజనులకు నాలుగువైపులా గిరిజనేతరప్రాంతాలు కూడా ఉన్నందువల్ల అక్కడ తొలినుంచీ సాంస్కృతిక వినిమయం, చైతన్యం సాధ్యమవుతూ వచ్చాయి. గిరిజనులకి బయటి ప్రపంచంతో అనుసంధానం సాధ్యపడుతూ వచ్చింది.
పాడేరు ప్రాంతం అలాకాదు. ఇక్కడ కొయ్యూరు, చింతపల్లి మండలాలు మినహా తక్కిన ప్రాంతమంతా గిరిజనేతర ప్రాంతానికి దూరంగా ఉన్నందువల్ల గిరిజనులకు వేరే సంస్కృతులతో ఎటువంటి ఆదానప్రదానానికి అవకాశాలు లేకపోయాయి. దానివల్ల వారిలో చెప్పుకోదగ్గ సామాజిక – సాంస్కృతిక ఉద్యమాలకు గాని, గణనీయమైన సంస్కరణలకుగాని తావులేకపోయింది.
కొయ్యూరు, చింతపల్లి ప్రాంతాల్లో 1922-24 మధ్య కాలంలో సంభవించిన మన్యం తిరుగుబాటు ప్రధానంగా స్వపరిపాలన అంశంగా సాగిన పోరాటం. సీతారామరాజు తొలిరోజులకు చెందిన గాంధేయవాది కావడం వల్ల, సహాయనిరాకరణ మీద పెట్టినంతగా తన దృష్టిని విద్యారంగం మీద పెట్టలేదు.
బ్రిటిష్ రెవిన్యూ పాలన స్ధానంలో గిరిజన స్వపరిపాలన, కోర్టుల స్ధానంలో పంచాయతీ పాలన ప్రవేశపెట్టాలని అతడు తపించినంతగా, పాఠశాలల గురించి గాని, అక్షరాస్యత గురించి గాని ఆలోచించినట్టు కనిపించదు.అదీకాక, ఆ ఉద్యమ ప్రభావం గోదావరి జిల్లాల మన్యప్రాంతం మీద ఉన్నంతగా పాడేరు కొండలమీద మనకు కనబడదు.
ఏ విధంగా చూసినా పాడేరు వాతావరణం ఆధునిక జీవితానికి, ఆధునిక సంస్ధల విస్తరణకూ అంతగా అనువైన ప్రాంతం కాదనే చెప్పవలసి ఉంటుంది. అందుకు ఉదాహరణ దాదాపు మూడువేల పై చిలుకు జనావాసాలున్న ఆ ప్రాంతంలో నేటికి కూడా దాదాపు 1300 జనావాసాల్లో కనీస పాఠశాల సౌకర్యం లేకపోవడాన్ని చెప్పవచ్చు.
దానికి కారణం, ఆ జనావాసాలన్నిటిలో ఏ ఒక్కదానిలో కూడా అయిదారుగురు మించి బడి ఈడు పిల్లలు లేకపోవడం. అక్కడొక ఆధునిక పాఠశాల నడవాలంటే కనీసం ఇరవైమంది పిల్లలేనా ఉండాలి. లేదా కనీసం పదిమంది పిల్లలున్నా ఏదో ప్రత్యామ్నాయ ఏర్పాటుని చూడవచ్చు. అయిదారుగురు పిల్లలతో ఎక్కడో కొండల మీద అక్కడక్కడా అడవుల్లో ఆహారాన్ని వెతుక్కుంటూ జీవించే ఆదిమగిరిజన సమూహాలకు విద్యనెట్లా ఇవ్వాలో విద్యా ప్రణాళికావేత్తల దగ్గర సమాధానం లేదు.
అంతేకాక, సముద్ర ఉపరితలానికి బాగా ఎత్తులో ఉన్నందువల్లా, దట్టమైన మహారణ్యాల మధ్యలో ఉన్నందువల్లా ఆ ప్రాంత వాతావరణానికీ, కింది వాతావరణానికీ మధ్య గణనీయమైన తేడా ఉంటుంది. విపరీతమైన వర్షాకాలం, విపరీతమైన చలి దాదాపుగా ఏడాదికి పదినెలలపాటు ఆ వాతావరణాన్ని చుట్టుముట్టే ఉంటాయి. అందువల్ల మలేరియా, ఇతర వ్యాధులు ఎప్పటికప్ప్పుడు ప్రబలంగా వ్యాపిస్తూనే ఉంటాయి.
అటువంటి వాతావరణ పరిస్ధితుల్లో ఆశ్రమపాఠశాలని మామూలుగా నడపడమే చాలా కష్టసాధ్యమైన పని. ఉదాహరణకు, అక్కడ చాలా పాఠశాలల్లో హాస్టలు వసతికి వంటచెరుకు మీద ఆధారపడవలసి ఉంటుంది. ఏడాదికి దాదాపు అయిదారు నెలలు వర్షాలు కురుస్తుండే ముంచింగిపుట్టు మండలంలో కనీసం వంట చెరకు కూడా దొరకదు. అక్కడ ప్రధానోపాధ్యాయుడికి పొద్దున్నే లేవగానే పిల్లలకు వంట ఏర్పాటు ఎలా చెయ్యాలా అన్నదే సమస్యగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో అతడికి చదువుగురించి ఆలోచించే అవకాశమే ఉండదు.
ఆర్ధికాభివృద్ధి విషయంలో కూడా అక్కడి గిరిజన ప్రాంతాల పరిస్ధితులు తక్కిన ప్రాంతాల కన్నా భిన్నం. అంత ఎత్తులో ఉన్న ప్రాంతాలు కాబట్టి అక్కడ మామూలు పండ్లతోటలు, మామిడి, జీడిమామిడి లాంటివి పెరిగే అవకాశం తక్కువ. మామూలు పంటలకన్నా అక్కడి ప్రాంతాల పంటల ఉత్పాదకతా, దిగుబడీ తక్కువ. వైవిధ్యం తక్కువ.
వీటన్నిటివల్లా అక్కడి గిరిజనులకు ఆహారభద్రత కూడా తక్కువే. సుసంపన్నమైన ప్రకృతి ఒడిలో ఉంది కాబట్టి పాడేరు గిరిజనప్రాంతానికి చాలా వనరులు అందుబాటులో ఉన్నట్టు కనిపిస్తుంది గాని, ఆ వనరులు ఆ ప్రజల జీవన ప్రమాణాల్ని పెంచలేదని జనాభాలెక్కలు ఎప్పటికప్పుడు తెలియచేస్తూనే ఉన్నాయి.
ఇటువంటి అభద్రతలో, అనిశ్చితలో ఆ ప్రజలు విద్య గురించీ, ముఖ్యంగా గుణాత్మకవిద్య గురించీ ఆలోచించాలనుకోవడం అత్యాశే అవుతుందని నాకు పాడేరు వెళ్లిన కొద్దిరోజులకే అర్ధమయింది.
Part V
1
Above 4000 Feet
Situated nearly four thousand feet above sea level, the Paderu tribal agency occupies an extraordinary high-altitude terrain. It is bounded on one side by the tribal tracts of former Madhya Pradesh (present-day Chhattisgarh) and on another by the agency areas of Odisha. Along its remaining borders lie the tribal belts of East Godavari, Khammam, and Vizianagaram districts.
Geographically, tribal territory accounts for nearly fifty-six percent of the entire Visakhapatnam district. While thirty-three distinct scheduled tribes inhabit Andhra Pradesh as a whole, eleven live within Paderu alone. Viewed from any perspective, the region resembles a vast, living ethnographic museum of aboriginal cultures.
These eleven mandals encompass distinct cultural sub-regions, an architecture perceptively documented by Dr. P. Sivaramakrishna in his seminal study, Telugu Girijanula Janapada Geethalu (Folk Songs of Telugu Tribals). Broadly adapting his classification to contemporary administrative realities, the agency divides into four primary cultural zones:Ananthagiri, Araku Valley, and Dumbriguda form a continuous belt closely mirroring the conditions of the Salur and Pachipenta agency areas in Vizianagaram. Hukumpeta, Paderu, and Gangaraju Madugula constitute a second distinct region. Pedabayalu and Munchingiputtu form a third zone, deeply influenced by the tribal culture of neighboring Odisha. Koyyuru, Gudem Kotha Veedhi, and Chintapalli represent a fourth region, reflecting the traditional Manyam culture of the Godavari districts—a land that served as the epicenter of the historic Rampa Rebellion led by Alluri Sitarama Raju.
With the exception of Koyyuru and parts of Chintapalli, all these mandals were severely backward educationally. The conditions prevailing in Dumbriguda and Munchingiputtu were particularly stark, drawing comparisons to some of the most underdeveloped regions of Sub-Saharan Africa. Whether measured by infant and maternal mortality, female illiteracy, or chronic food insecurity, the deprivation in these mandals was unmatched anywhere in the state, save for the Chenchu settlements of Nallamala.
The fundamental challenge, however, extended beyond mere economic backwardness. In other tribal regions—such as Adilabad, or the Chenchu and Yanadi tracts—Adivasi habitations were surrounded by non-tribal areas. This geographic proximity facilitated continuous cultural exchange, heightened social awareness, and sustained organic links with the wider world.
Paderu enjoyed no such advantage. Apart from Koyyuru and Chintapalli, the vast majority of the highland mandals remained geographically isolated from non-tribal society, denying the local communities opportunities for mutual exchange (Aadana-Pradana). Consequently, the region remained largely untouched by major socio-cultural movements or systemic reformations.
Even the historic Manyam uprising of 1922–24 in Koyyuru and Chintapalli was primarily an armed struggle for tribal self-governance. As an early Gandhian, Sitarama Raju focused his energies on non-cooperation and political resistance rather than institutional schooling. He fought passionately to replace British revenue administration with tribal self-rule and colonial courts with indigenous village panchayats, but spent little time on formal literacy or school networks. Furthermore, the political impact of that rebellion was felt primarily in the Godavari agency, barely penetrating the remote, high-altitude hills of Paderu.
By any measure, the physical and social climate of Paderu was inhospitable to modern institutions. Out of more than three thousand scattered habitations across the agency, over thirteen hundred lacked even a basic primary school. The primary constraint was demographic: scores of hamlets contained no more than five or six school-age children. Conventional educational planning requires at least twenty children to justify establishing a formal school, or ten for an alternative learning center. Educational planners possessed no viable model for delivering formal schooling to primitive tribal groups scattered across dense forests and ridges, surviving on foraging and subsistence gathering.
Furthermore, owing to its elevation and dense forest canopy, the highland climate differed drastically from the plains below. Torrential rains and biting cold enveloped the hills for nearly ten months a year, creating breeding grounds for endemic malaria and seasonal epidemics.
Under such severe conditions, simply maintaining an ashram school was a formidable administrative feat. For instance, welfare hostels relied entirely on dry firewood for cooking. In mandals like Munchingiputtu, where monsoon rains lashed the hills for five to six months continuously, dry firewood was impossible to secure. A headmaster waking up in the morning faced the immediate, desperate challenge of finding fuel to cook meals for the hostel boarders; under such circumstances, academic quality was understandably secondary.
The economic realities of the highlands were equally daunting. Traditional fruit crops like mango and cashew struggled to yield in the cold, high-altitude climate. Crop yields were significantly lower and less diverse than in the plains, deepening the vulnerability of local food security. Though cradled in the lap of lush, bountiful nature, official census data repeatedly confirmed that these natural surroundings had failed to translate into improved living standards.
Within a few days of arriving in Paderu, I recognized a sobering truth: expecting communities trapped in such deep insecurity and survival-level uncertainty to prioritize formal education—let alone demand qualitative learning—was asking the impossible.
Featured image: Sunrise at Minumuluru, photo taken in 2021
6-8-2026


పాడేరు గిరిజనుల geography, climate, health, ఆహార భద్రత సమస్యలు, access కష్టమైన కొండలు, అడవుల్లోని వారి జనావాసాలు, పేదరికం వంటి realities ని స్పష్టంగా చూపించారు.
“ అయిదారుగురు పిల్లలతో ఎక్కడో కొండల మీద… ఆదిమగిరిజన సమూహాలకు విద్యనెట్లా ఇవ్వాలో విద్యా ప్రణాళికావేత్తల దగ్గర సమాధానం లేదు.”
This says it all about the challenges of providing education there.
Got a good context of Paderu, Sir. This place feels like an entirely different world with its own realities and challenges.
ఇక్కడి మీ మజిలీలో మీ అనుభవాలు, మీరు చేపట్టిన కార్యక్రమాల గురించి చదవడానికి రేపటి పోస్ట్ కోసం ఎదురుచూస్తున్నాము, Sir. 🙏🏽
చాలా సంతోషం. హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ!