ఆ వెన్నెల రాత్రులు-15

ప్రతి మనిషీ తన జీవితంలో ఒకసారేనా, కనీసం ఒక రోజేనా ఒక కొండ పక్కనుంచి నడిచి వెళ్ళకుండా ఉండడు. ఒక కొండకింద పల్లెలోనో, పట్టణంలోనో బసచెయ్యకుండా ఉండడు. కానీ జీవితంలో ఒకసారేనా, కనీసం ఒక గంటపాటేనా ఫాల్గుణమాసపు అడవి దారిన నడిచే అవకాశం దొరికినవాళ్ళ భాగ్యమే భాగ్యమని చెప్పగలను.