ఆ వెన్నెల రాత్రులు-8

నిజానికి నేను అటువంటి ఒక తావుకు చేరుకోవాలనే ఎన్నాళ్ళుగానో అనుకుంటున్నాననీ, ఎట్టకేలకు ఆ తావుకి చేరుకున్నాననీ అప్పుడే తెలుసుకున్నాను. నువ్వు చేరుకోవలసిన తావుకి చేరుకున్నట్లు తెలియడానికి గుర్తు అదే: మాటలు ముగిసిపోయి, మౌనం మొదలుకావడం.