అంతా స్ప్రింగ్ సీజన్ గురించి మాట్లాడతారు. కాని మాఘమాసం చెట్లు నెమ్మదిగా నిద్రమేల్కొనే మాసం. ఫాల్గుణం వాటి ప్రభాతం. ఈ రెండు మాసాల్లోనే అడవి, చెట్లు, మొగ్గలు, పువ్వులు, పక్షులు, సమస్త ప్రకృతి మేల్కొనే వేళ. అందుకే నజ్రుల్ అడుగుతున్నాడు, నా తోటలో గొంతువిప్పిన ఆ పక్షివి నువ్వేనా?నువ్వేనా?