ఆ వెన్నెల రాత్రులు-20

ఆ వేసవికాలపు తెల్లవారుజాముల్లో గాలుల్లో తెల్లదనం, చల్లదనం కలిసి ఉండేవి. ఆ అరుగుల మీద ఇంత చాపనో, బొంతనో పరుచుకుని పడుకున్న మా మీద రాత్రంతా రాలిన రాధామనోహరాల పూల గాలి తియ్యదనం పోగుపడి ఉండేది. తెల్లవారినా ఇంకా దుప్పటి ముసుగుదన్ని పడుకున్న మమ్మల్ని కోకిల లేపేసేది. మామీంచి దుప్పటి లాగేసేది.