ఆ వెన్నెల రాత్రులు-22

ఒక గంటసేపు ప్రయాణం నడిచేటప్పటికి ఆకాశంలో పాలపుంత అడవిమీదకు ఒరిగిపోయిందా అనిపించింది. అడవికీ, అడవికీ మధ్య ఖాళీగా ఉన్న ప్రదేశాలు వచ్చినప్పుడల్లా, దూరంగా కనిపిస్తున్న కొండల్ని తెల్లటి నిశ్శబ్దం ఆవరించింది. మరికొంతసేపటికి ఆకాశం ఈమూలనుంచి ఆమూలకి ఎవరో పాలకావడి మోసుకుపోతున్నట్టుగానూ, ఆ కావడి నడిచిన దారిపొడుగునా పాలపుంతకి చిల్లుపడి కారిపోతున్నట్టుగానూ ఉంది.