ఆ వెన్నెల రాత్రులు-18

చెట్ల మొదటగా చిగురు తొడిగేది బంగారాన్ని అని ఒక కవి చెప్పగా విన్నాను. ఆ ఋతువంతటా అక్కడ చెట్లమీద నేను చూసింది బంగారం కూడా కాదు, అసలు ఆ రంగు, ఆ వర్ణశోభ మనకు తెలిసిన ఏ మూలకానికీ లేదని చెప్పగలను. అది ఆకాశానిదీ, భూమిదీ కూడా కాదు. అదొక కాలానిది. ఆ ఋతువుకి మాత్రమే సాధ్యమైన రసవిద్య అది.