ఆ వెన్నెల రాత్రులు-10

ఆ పంటచేలని వెతుక్కుంటూ ఒక పాట చేరుకున్న ఆ క్షణానికి పరిపక్వత పరిపూర్ణమైదనిపించింది. ఆ కోసికుప్పపోసిన ఆ ధాన్యపు కంకుల్ని చూస్తే ప్రకృతి అన్ని నెలలుగా, అన్ని దివారాత్రాలు, ఆ సాఫల్యసంతోషం కోసమే వేచి ఉందా అనిపించింది. బహుశా, రాత్రి కోవెల్లో పవళింపు సేవ ముగిసాక, దేవుడు ఎవరికీ తెలియకుండా పెరటిదోవన ఆ పొలాల్లోకి వచ్చేస్తాడని కూడా అనిపించింది.