ఆ వెన్నెల రాత్రులు-5

మనిషి ఎక్కడికి వెళ్ళినా తనదంటూ ఒక చిన్న ప్రపంచాన్ని తన వెంటపెట్టుకునే వెళతాడు. ఆ ప్రపంచాన్ని తాను పోగొట్టుకున్నాడని అనుకుండుగానీ అది ఎక్కడికీ పోదు. అతనిలోనే ఉంటుంది. ఆ మనిషిగానీ ఒక కవినో, గాయకుడో చిత్రకారుడో అయితే ఇక తాను ఎవరిని కలిస్తే వాళ్ళకి కూడా ఆ ప్రపంచాన్ని ఇంత తుంచి వాళ్ళకి కూడా పంచుతాడు.