ఆ వెన్నెల రాత్రులు-1

ప్రేమ, స్నేహం రెండు పదాలు అనుకుంటే, ఆ రెండింటికీ మధ్య పోలిక తెస్తే, ఏది ఎక్కువనో నేను తేల్చి చెప్పలేను. కాని స్నేహంలో అనంతమైన బాధ్యత ఉంటుంది. ప్రేమలో ఆ బాధ్యత ఉందా? లేక ప్రేమ ఈ లోకవ్యవహారంలో మనకు తెలిసిన పదాల ద్వారా తెలుసుకోగలిగే భావన కానే కాదా?