ఆ వెన్నెల రాత్రులు-14

నువ్వు మాట్లాడే మనుషులు రోజువారీ చిన్న చిన్న విషయాల్ని దాటి మరేదో ప్రగాఢమైన విషయం వైపు నీ దృష్టి మరల్చాలనీ, నువ్వు చూడలేకపోతున్న అందాల్ని చూపించాలనీ, కొత్త పాటలు, కొత్త మాటలు వినిపించాలనీ- మనలో ప్రతి ఒక్కరికీ తెలియకుండానే లోపల్లోపల ఒక బలమైన కోరిక ఉంటుందని ఆ వారం రోజుల్లో నాకు పూర్తిగా తెలిసొచ్చింది