ఆ వెన్నెల రాత్రులు-24

ఆ రోజు కొండపైదాకా ఎక్కాం. అప్పుడు కూడా సాయంకాలమవుతూ ఉంది. ఆ కొండమీంచి చూస్తే దిగంతందాకా ఆకుపచ్చని సముద్రం, ఆ సముద్రం మీంచి పైకి లేస్తున్న ఊదారంగు కెరటాల్లాగా కొండలు. అంతదాకా తాను చిటికెనవేలు పట్టుకుని నడిపిస్తున్న తన బిడ్డని తండ్రి ఒక్కసారిగా తన నెత్తిమీద ఎక్కించుకుని చుట్టూ ఎలా ఉందో చూపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది నాకు ఆ రోజు ఆ కొండమీంచి అప్పటిదాకా నేను తిరుగాడిన దేశం చూస్తే.