ఆ వెన్నెల రాత్రులు-7

ఒక చంద్రోదయం ఒక ప్రపంచం మీద ఇంత మంత్రజాలం చెయ్యగలదని నాకెప్పుడూ తట్టలేదు. ఆ క్షణాన నేనేమి చూసాను? నాకేమి జరిగింది? చెప్పలేను. కాని ఆ రోజు నేను దేవగంగాస్నానం చేసాను. నేను అంతకు ముందు ఎప్పుడూ అంత నిర్మలమైన జలాల్లో నిలువెల్లా మునిగిందిలేదు, ఆ తర్వాత, ఇప్పటిదాకా, కూడా లేదు.