ఆ వెన్నెల రాత్రులు-25

ఒక మహావృక్షం మీద ఒక పిట్ట వచ్చి వాలి కొంతసేపు ఆ పూలసుగంధాన్నో, ఆ పిందెల కసరుదనాన్నో రుచిచూసి  ఎగిరిపోయిందనుకో, ఆ చెట్టుకి అది తెలుస్తుందా? ఎస్.విమల, బి.ఎస్.సి అనే ఆమె కొన్నాళ్ళు తమ మధ్య సంచరించిందనీ, విభ్రాంతితో అనుదినం తమనే పరికిస్తూ గడిపిందనీ, ఆ పర్వతాలకీ, ఆ అరణ్యానికీ, ఆ గగనతలం మీద సభచేసుకునే నక్షత్రాలకీ గుర్తుంటుందా? అసలు అటువంటి ఒక మనిషి అక్కడికి వచ్చివెళ్ళిందని వాటికి తెలుసా?