ఆ వెన్నెల రాత్రులు-19

ఆమె తన హృదయావేదన అంతా ఆ పాటలో కుక్కిపెట్టి తన శిష్యురాలికి నేర్పి ఉంటుంది. ఎక్కడో ఏదో పండు చిట్లి ఒక విత్తనం ఏ పక్షి రెక్కలకో తగులుకుని ఎంతో దూరం ప్రయాణించేక ఏ ఏటి ఒడ్డునో సారవంతమైన నేలలో రాలిపడ్డట్టు ఆ పాట ఇన్నాళ్ళకు ఇక్కడ ఈ హృదయాల్లోకి వచ్చిపడింది. ఆ కవి వేదనా, ఆ మ్యూజిక్ టీచర్ వేదనా కలిసి ఆ గొంతులో భద్రంగా అంతదూరం ప్రయాణించేయన్నమాట.