కాని నాకు అర్థమయినంతవరకూ ఒకటి మాత్రం నిశ్చయంగా చెప్పగలను. కొంత సూర్యరశ్మి, కొంత చంద్రకాంతి, కొంత నక్షత్రధూళి- ఇవన్నీ కలిస్తేనే, ఈ రాయీ, రప్పా, చెట్టూ, చేమా, నువ్వూ నేనూ అందరం ఏర్పడ్డాం. మనందరిలో ఉన్న ధూళి ఒకటే, జీవం ఒకటే. అందుకనే మనకి ఒకరి పట్ల ఒకరికి ఇంత ఆసక్తి.