అయితే పైన చెప్పిన వాళ్ళల్లో మొదటి తరహా ఉద్యోగులు కొందర్ని ఆ భగవతృపకి సాక్షులుగా గుర్తుపెట్టుకుంటాను. అందుకనే సీతారామమూర్తిగార్నీ, సత్యానందరావుగార్నీ, అటువంటి మరికొందరు మహానీయులైన సహచరుల్నీ తలుచుకుంటే నాకు భగవంతుడి అనుగ్రహాన్ని తలుచుకున్నట్టే ఉంటుంది.
ఆళ్ళ గురుప్రసాదరావు
ఒకసారి కోసలరాజు ప్రసేనజిత్తు బుద్ధుడితో అన్నాడట, మీ శిష్యుల జీవితవిధానాన్ని చూసేకనే మీ మహత్వం నాకు అర్థమయ్యింది అని. గురుప్రసాదరావుగారిని చూసాక నాకు చలంగారి మహత్వం మరింత బోధపడింది.
సి.వి.కృష్ణారావు శతజయంతి
కేవలంసౌజన్యం వల్ల మాత్రమే ఆ వినయశీలి తన ఆధిక్యాన్ని ఉగ్గడించుకోలేదని తెలిసిన తర్వాత కూడా, ఆయన ప్రాపకంవల్లా, ఆశీస్సులవల్లా, నాబోటి వాళ్ళు విస్తృత ప్రపంచానికి పరిచయమై ఉండి కూడా ఆ ఉదారచరితుడి గురించి సమాజానికి తెలియవలసినంతగా తెలియలేదంటే, అది ఆయన లోపం కాదు. నాబోటి వాళ్ళ దోషం. ..
