బాధలన్నీ పాతగాథలై

ఎందుకంటే, పరుగుపరుగున రైల్వేస్టేషన్ చేరుకుని ఊపిరి ఎగబీలుస్తూ కంపార్ట్ మెంట్లో చొరబడి, మన సీటు ఎక్కడుందో వెతుక్కుని సూట్ కేసో, బాగో పైకో, కిందకో నెట్టేసి, అప్పుడు, సరిగ్గా అప్పుడే ఒక్కక్షణం మనం గాఢంగా ఊపిరి పీలుస్తాం చూడండి, అట్లాంటి క్షణమే కవిత్వం.