నా నిద్రలేమి, నా మెలకువ

'సిరియాకి చెందిన ప్రతి ఒక్కటీ వదిలిపెట్టేసాను, చివరికి ఆ భాష, ఆ ఆహారంతో సహా ' అని చెప్పుకుందామె ఒక ఇంటర్వ్యూలో. కాని, ఆమె కవిత్వం చదివితే, సిరియా ఆమెని వదిలిపెట్టలేదనీ, ఆమె ఊపిరిలో ఊపిరిగా మారిపోయిందనీ అర్థమవుతుంది.