SMALL KIDS, THOSE EYES

ఒక్కొక్కప్పుడు కవిత సాధారణ ఉపమనీ, రూపకాలంకారాన్ని దాటి ఒక నైరూప్య భావనలోకి ప్రవేశిస్తుంది. ఆ క్షణాలు నిజంగా విలువైనవి కవికి. పూర్వకాలంలో ఆముక్తమాల్యదలో అట్లాంటి భావనలు కనిపిస్తాయి. బహుశా వాటిని దర్శించడం ఆయన పెద్దననుంచి నేర్చుకుని ఉంటాడు.
ఆధునిక పాశ్చాత్య కవిత్వంలో రిల్క ఈ విద్యలో పండితుడు. ఆయన ఒక భావనని ఒక నైరూప్యశిల్పంస్థాయికి తీసుకుపోతాడు. అప్పటికి నేను రిల్కని చదవకపోయినప్పటికీ, ఈ కవిత ఆ స్థాయి కవిత అని అనుకుంటున్నాను. ఇది పసిపిల్లల మీద రాసింది కాదు, వాళ్ళు వాళ్ళ అమ్మకోసం వేచి ఉండటం మీదా రాసింది కాదు, ఆ తల్లి యుద్ధమైదానాల్లోకి వెతుక్కుంటూవెళ్ళిపోయిన వీరుడి మీద రాసిందీ కాదు. ఇది ఆ కళ్ళ మీద రాసింది. ‘ఆమె ఉన్నత వక్షం మీద అలవోకగా జారిన జడపాయల్ని తాకుతూండగా’ ఆమె చూసిన చూపుల కళ్ళ గురించి రాసింది.
 
ఈ కవితతో ‘ఒంటరిచేల మధ్య ఒక్కత్తే మన అమ్మ ‘ పుస్తకం పక్కన పెడుతున్నాను.
 
 

పసిపిల్లలు ఆ కళ్ళు

 
ఆమె ఉన్నత వక్షం మీంచి అలవోకగా జారిన
జడపాయల్ని తాకుతుండగా
పురాతనమైన పిలుపు ఏదో తాకింది వేళ్ళని.
 
ఆ కళ్ళకేసి చూసాను.
అమాయికమైన పసిపాపలు
ఇంటిగడప చెంతనే
తల్లికోసం కాచుకున్నట్టు వున్నాయవి.
 
అశ్వాన్నెక్కి యుద్ధం వైపుగా
మైదానాల్లోకి సాగిపోయిన
ఏ వీరుడి కోసం
వెతుక్కుంటూ పోయిందామె?
 
అన్ని తెరలూ దింపెయ్యి.
ఆ చీకట్లో
ఒకే ఒక్క దీపాన్ని వెలిగించి
వెతుకులాడు.
 
పసిపిల్లలు ఆ కళ్ళు
దిగులుగా ఎదురుచూస్తూనే వున్నాయి.
 
1991
 

SMALL KIDS, THOSE EYES

 
As I caressed her long hair,
Spread over her ripe breasts,
My fingers felt an ancient call.
 
When I saw those eyes,
They looked like small kids
Waiting for their mother.
 
Where did she go?
Where did her eyes go
Following her hero on a steed
On a battlefield?
 
Close all the curtains.
Grope in the darkness
With only a small lamp in hand.
 
Still waiting are the small kids,
A pair of forlorn eyes.
 
24-8-2022

Leave a Reply

%d bloggers like this: