'ఓ ప్రేమికా, నువ్వు నీ ప్రేయసిగా మారు' అనే మాటలో సముద్రమంత స్ఫురణ ఉంది. కబీరు ప్రేమగీతాల్లోని విరహం, టాగోర్ ప్రేమ గీతాల్లోని వేదన మొత్తం ఒక్క వాక్యంలోకి కుదిస్తే అది 'తుమ్ రాధే బనో శ్యామ్ ..'అనడమే అవుతుంది.
ఉసిరికాయలు
మనిషికి కావలసింది ఆరడుగుల నేలనో లేదా చిన్నపాటి సుక్షేత్రమో కాదు. అతడికి మొత్తం భూగోళం అవసరం కావాలి, మొత్తం ప్రకృతి కావాలి, తనలోని స్వేచ్ఛాజీవి తన కౌశల్యాల్ని, అద్వితీయతల్ని మొత్తం బయటకు తేవడానికి అవసరమైన అవిరళ ఆకాశం కావాలి
అద్వితీయ జయగాథలు
ప్రతి జయగాథా ముందు ఒక మనిషి తన పరిస్థితుల మీద విజయం సాధించిన నాయకత్వ గాథ. social entrepreneur గా మారితే తప్ప ఏ రైతూ బీదరికం నుంచి బయటపడడు. ఆ ప్రయాణం ప్రధానంగా అతనిదీ, అతని సహచరులదీను. ప్రభుత్వం వారికి సహాయపడి ఉండవచ్చు, ఉండకపోవచ్చు, అది వేరే కథ.