ఆ సూర్యకాంతి మరికొంచెం

దూషించడమూ, ద్వేషించడమూ తీరికసమయపు వ్యాపకాలుగా మారిపోతున్న కాలంలో మీలాంటి ఇద్దరు మిత్రులు నా రచనల గురించి మాట్లాడుకుంటూ ఉంటారన్న మాట నాకెంత బలాన్నిచ్చిందో చెప్పలేను. అది నాకు చెప్పలేనంత బాధ్యతని కూడా అప్పగించింది.