సంతోషంతో ఓపిక పట్టడం

ఆ కేంద్రానికి వెళ్ళి చూసాను. ఆ భవనసముదాయం, అక్కడి పరిశుభ్రత, ఆ నిబద్ధత నన్నెంతో ఆకట్టుకున్నాయి. 'నాకు తెలిసి కొంత మంది ఎంతో పెద్ద మనసుతో వృద్ధాశ్రమాలు మొదలుపెట్టి నడపలేక చేతులెత్తేసారు. మీరు నడపగలుగుతున్నారు ఏమిటి కారణం?' అనడిగాను అతణ్ణి.