బైరాగి

ఈ నెల అయిదవ తేదీ బైరాగి 98 వ పుట్టినరోజు. ఈ రోజు ఆయన వర్థంతి. మరో రెండేళ్ళలో ఆయన శతజయంతి. కాని ఆయన కవిత్వం తెలుగు జాతికి ఇంకా పూర్తిగా పట్టుబడనే లేదు. ఒక భాష ఏళ్ళ తరబడి, శతాబ్దాల తరబడి చేసిన తపస్సు వల్ల బైరాగి వంటి కవి పుడతాడు. ఒకసారి ఈ మాట మా మాష్టారు పోతన్న గురించి అన్నారు. నేను బైరాగి గురించి అంటున్నాను. బహుశా బమ్మెర పోతన ఇరవై శతాబ్దంలో పుట్టి ఉంటే బైరాగి లాగా కవిత్వం రాసి ఉండేవాడు.