ఆ ఊరేగింపులో ఉన్న నమ్మాళ్వారు ఉత్సవ మూర్తిని చూస్తూ నేను నా మనసులో ఇట్లా ప్రార్థించుకున్నాను: 'స్వామీ, నువ్వు తమిళవేదాన్ని అనుగ్రహించావని చెప్తారు. నేనొక తమిళ గ్రంథాన్ని వెతుక్కుంటూ నీ ఊరు వచ్చాను. తమిళభాషకు అంత దివ్యయశస్సును అనుగ్రహించిన నీకు నా కష్టం తెలియదా? తెలిసి కూడా నా పనుల్లో నాకు జయం కలగటంలేదంటే అది నీకు ఉచితమేనా? '.