అయితేనేం, ఆ అశ్వం ఒక క్షణం నన్ను ఆశ్వికుణ్ణి చేసింది.
పువ్వుల్లానే రోజులు కూడా
నువ్వొక భ్రమరానివి కాగలిగితే, రోజూ నీకోసమొక పుష్పం సంసిద్ధం.
ఇంకా సంగీత కచేరీ మొదలుకాకముందు
ఇంకా సంగీత కచేరీ మొదలుకాకముందు దొంతర్లుగా పేర్చిన కుర్చీల్లాగా మబ్బులమీద మబ్బులు, సంగీత వాద్యాలు శ్రుతి చేసుకునేటప్పుడు అలముకునే నిశ్శబ్దం.