చాలా రోజులుగా

చాలా రోజులుగా మనసులో
ఒక వాక్యం మెదుల్తోంది-
ఈ లోకం ఒక నీడ అని.

అందుకనే కాబోలు
అది నన్ను చేరదీసుకున్నా
నేను దాని చెంతకు చేరినా
ఇట్టే జారిపోతుంది.

చూడవలసిందీ
చేరవలసిందీ
వెలుగుని-
నీడని కాదు.


Featured image: Photography by Jay Brand via pexels.com

26-11-2025

11 Replies to “చాలా రోజులుగా”

  1. కాంతికిఎదురుగ ఉన్నప్పుడు మన నీడ అయినా మనకు కనిపించదుగా? కాంతి కి దూరంగా జరిగినప్పుడు మాత్రమే మన నీడ మనకు కనిపిస్తుంది .నీడకు స్వతః సిద్ధమైన ఉనికి లేదు . అంటే మీరు వెలుగు లో ఉన్నారనే కదా అర్థం.
    ( దీని మీద ఒక కథ రాసేసాను సర్. బహుమతి కూడా అందుకున్నాను. )
    సర్. మీరే ఒక వెలుగు. ఇది నిజం.

    1. మీ హృదయాన్నీ, నా హృదయాన్నీ కలిపేది. మీరూ, నేనూ ఒకరినొకరు చూసుకోక పోయినా, కలుసుకోకపోయినా, ఒకరికొకరు గుర్తు రాగానే మన హృదయంలో కదిలే మెదిలే ఒక సాత్విక సుకుమార భావన. అది ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. కానీ అది లేకుండా మనుషులు కలుసుకున్నా, చూసుకున్నా ఉపయోగం లేదు.

      1. ఎంత బాగా చెప్పారు. సాత్విక సుకుమార భావన. సర్. నమోనమః

Leave a Reply