ఈ చైత్రమంతా ఇళ్ళు, వీథులు, భవనాలు చివరికి గోడలమీద కూడా ఆకుపచ్చ వెలుగు మరొకవైపు నా నిద్రలో, మెలకువలో రంపాలు మనిషి మనిషిని వధిస్తున్న దృశ్యాలు, వార్తలు.
ఈ రోజుకి మాత్రం
నిన్నటి సంగతి తెలీదు, రేపటి గురించి చెప్పలేను ఈ రోజుకి మాత్రం మానవుడు గెలిచింది నిశ్చయం. తెల్లవారుతూనే బుల్బుల్ గొంతెత్తి పాడుతున్న పాటతో ఈ వసంతాన నా గుండె గులాబితోటగా మారింది.
చైత్రచంద్రబింబం
ఎండచల్లబడుతూనే మామిడిచెట్లగుబుర్లలో వాద్యాలు శ్రుతి పెడుతున్న సంగీతకారులు. కొమ్మలకి కొత్త తోరణాలు కట్టుకున్న కోవిదార, కరవీర, దేవగన్నేరు. ..
