
నిన్నటి సంగతి తెలీదు, రేపటి గురించి చెప్పలేను
ఈ రోజుకి మాత్రం మానవుడు గెలిచింది నిశ్చయం.
తెల్లవారుతూనే బుల్బుల్ గొంతెత్తి పాడుతున్న పాటతో
ఈ ప్రభాతాన నా గుండె గులాబితోటగా మారింది.
ఇంతదాకా నడిచిన ప్రపంచయుద్ధాలు రెండేనా?
ఇప్పుడు ప్రతి ఒక్కడూ యుద్ధక్షేత్రంలో నిలబడ్డవాడే
దగ్ధప్రపంచంలో నేడు ప్రతి ఒక్కడూ క్షతగాత్రుడే.
యుద్ధం ఎక్కడ జరిగినా దేశాలన్నీ నెత్తుటిమయమే.
ఎవరూ ఎవరికీ ఓదార్పునివ్వలేని గాఢాంధకారంలో
వాళ్ళు నిన్నరాత్రి తమ వట్టిచేతుల్తో కలిసికట్టుగా
బాంబుల వర్షానికి ఎదురేగారే అప్పుడు మటుకే
తాము బతికి ఈ ప్రపంచమంతటినీ బతికించారు.
8-4-2026


ఎంత బాగుందో మాటల్లో చెప్పలేను. Love this poem Sir.
ధన్యవాదాలు సార్!
తాము బతికి, ప్రపంచాన్ని బతికించారు.
అవును సార్
పిచ్చి వాళ్ళ నోట ప్రియ వాక్కు వినిపించె ,
నేటి విరమణ మరునాటి వ్రణమొ ?
నమ్మకాలు లేవు నయగారమే గాని
శాంతి మంత మైన చర్చ లేవి ?
దగ్ధప్రపంచంలో నేడు ప్రతి ఒక్కడూ క్షతగాత్రుడే.
యుద్ధం ఎక్కడ జరిగినా దేశాలన్నీ నెత్తుటిమయమే.
ఈ విరామం నిజంగా శుభపరిణామమే…
మానవుడు గెలిచాడు నేడు.
నమస్సులు మాష్టారూ 🙏
ధన్యవాదాలు సోదరీ!
బలిపశువుల చూసి భయపడిన యుద్ధం!
అవును సార్!