
ఢిల్లీ నుంచి ఉత్తరాలు
1
భగవద్విలాసంలోని ఈ మహిమోపేత చర్యకి నా మనసంతా ఎంత ఆనందంతో నిండిపోయిందంటే ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా ఈ సంగతి నీతో పంచుకోవాలనిపించింది.
అసలు భగవంతుడు అద్భుతక్రియలు ఎందుకు చెయ్యాలి? అద్భుతమనేది భగవంతుడి అత్యంత అనురాగభరిత ప్రేమచేష్ట అనుకుంటాన్నేను. చిన్న చిన్న సంగతులే, మామూలు కలయికలే, సాధారణమయిన పలకరింపులే, రోజువారీ వ్యాపకాలే- భగవంతుడు వాటి ద్వారా మనతో మాట్లాడాలనుకున్నప్పుడు మహిమోపేతాలయిపోతాయి. అది నీ దైనందిన అర్చాక్రమంలో అత్యంత సుందరపుష్పాన్ని దేవుడికర్పించడంలాంటిది. అదొక కావిలింత లాంటిది, ఒక సాధారణ చుంబనం, చిన్ని ప్రశంస లాంటిది, పొద్దున్నే ఒక ఆత్మీయుడినుంచి వచ్చే టెలిఫోన్ కాల్ లాంటిది. కానీ అద్భుతంలోని సౌందర్యమెక్కడుందంటే అది భగవదనుగ్రహం నీ మీద వర్షిస్తున్నదన్న దానికి అత్యంత విశిష్టమైన ప్రగాఢమైన నిరూపణగా నిలవడంలో ఉంది. ఏదన్నా అద్భుతం సంభవించినప్పుడు అది నిన్ను నీ హృదయపు గాఢమైన లోతుల్లోకి తీసుకుపోతుంది. దేవుడు నిన్నెంచుకున్నాడన్న సంతోషాన్నీ, ఆయన అనుగ్రహానికి పాత్రులైన అతికొద్ది మందిలో నువ్వు కూడా ఉన్నావన్న ఆనందాన్నీ నువ్వప్పుడు వేడుక చేసుకుంటావు.
2
ఈ రోజు నిన్నటి ఉత్తరాన్ని పోస్టు చేసాను. ఫోన్ కూడా చెయ్యాలనుకున్నాను గానీ ఎక్కడకని చెయ్యడం? ఈ రోజంతా మేం సైట్ సీయింగ్ లోనే గడిపేసాం. పొద్దున్న మేం కుతుబ్ మీనార్ కి వెళ్లాం. అక్కడొక కొండ మీద జైనదేవాలయమొకటి చూసాం. మధ్యాహ్నం నేషనల్ సైన్సుసెంటర్ చూసాం. ఆ తరువాత వాళ్లు గిరిజన అతిథుల్ని ఏరోడ్రోంకి తీసుకుపోయారు. సాయంకాలం మమ్మల్ని లక్ష్మీనారాయణ మందిరానికి తీసుకువెళ్లారు. అది సంధ్యాహారతి వేళ.
నాకప్పగించబడ్డ ఈ బాధ్యత నాకేమీ ఆశ్చర్యాన్ని కలిగించలేదు. అందులో ఉదాత్తమైనదేదో లేకపోలేదు. పైగా నేనో రాజ్యమర్యాదని నిర్వహిస్తున్నాను కూడా. అక్కడ ఆఫీసులో పొద్దుబుచ్చే బదులు ఇది నిస్సందేహంగా మేలయిన పనే. కానీ నేను ఆలోచిస్తున్నది అసలీ రాజ్యవ్యవహారం గురించే. ఈ దేశం గురించీ, దీని చరిత్ర గురించీ, నాగరికత గురించీ, దీని భవిష్యత్తు గురించీ నాకై నేనెన్నో ప్రశ్నలు వేసుకుంటూనే ఉన్నాను. అసలీ దేశచరిత్రలో ఎప్పుడయినా ఏ సందర్భంలోనైనా నిజంగా ఉదాత్తమైనదంటూ ఏమన్నా ఉందా? బహుశా అశోకుడి కాలం లోనూ, హర్షుడి కాలంలోనూ, గుప్తుల కాలంలోనూ కూడా పరిస్థితులు ఇలానే ఉండిఉండేవా! ఇదే రకమైన పీడన, ఇదే రకమైన ఆత్మవంచన, తమ తోటి మనుషుల పట్ల ఇదే రకమైన వైఖరి ఉండిఉంటాయేమో కదా.
తన మనుషులకి ఢిల్లీ అందిస్తున్నదేదో అది నిజంగా నిస్పృహ కలిగించేదే. అందులో నిజంగా ఉత్తేజకరమైనదేమీ లేదు. ఎక్కడెక్కడైనా గొప్ప ప్రమాణాల్తో ఏవన్నా కనిపిస్తే- అది ఉద్యానవనాలు కావచ్చు, ప్రముఖుల స్మశాన వాటికలు కావచ్చు, దేవమందిరాలు కావచ్చు, లేదా వస్తు ప్రదర్శన శాలలు కావచ్చు-అటువంటి దృశ్యాలన్నీ నాకు నిరాశ్రయులయిన లక్షలాది మందినీ, మురికి వాడల్లో నివసించే లక్షలాది మందినీ, సిటీ బస్సుల్లో ప్రయాణించే లక్షలాది మందినీ, ఆకాశహర్మ్యాల్లో అన్నిటికన్నా పై అంతస్థుల్లో నివసించవలసి వస్తున్న వేలాది కుటుంబాల్నీ గుర్తుచేస్తూనేవున్నాయి. ఒక విద్యార్థిగా నేను జాతి, జాతీయసమైక్యత లాంటి పదాలు చెవిన పడ్డప్పుడల్లా ఎంతో ఉత్తేజితుణ్ణవుతుండేవాణ్ణి. కానీ నిజంగా ఏ జాతి అయినా సెమినార్ల ద్వారా, సమావేశాల ద్వారా, ఇటువంటి పర్యాటక ప్రదర్శనల ద్వారా రూపొందుతుందా? ఈ పర్యటనలో అన్నీ ఉన్నాయి, తిండి, వసతి, సంరక్షణ, బాధ్యత, సరదా, సైట్ సీయింగ్ అన్నీ ఉన్నాయి. కానీ ఆ ఉత్తేజమేది? నాకెందుకో నన్ను నేను కోల్పోయినట్టే అనిపిస్తోంది.
వ్యక్తిగతంగా చూస్తే నాకిందులో తిరస్కరించవలసిందేమీ లేదు. ఇక్కడికి వచ్చిన ప్రతినిధులంతా కూడా బాగా వినోదిస్తున్నట్టే ఉంది. ఈ రోజు నేను బీహార్ నుంచి వచ్చిన సంతాలీ యువతితో మాట్లాడాను. ఆమెతో పాటు రాజస్థాన్ ఆరావళీ పర్వతశ్రేణి దగ్గర నుంచి వచ్చిన ఇద్దరు భిల్లులు, ఒరిస్సాలోని సుందర్ ఘర్ అడవుల నుంచి వచ్చిన ఒక ఓరవాన్ కూడా పరిచయమయ్యారు. వాళ్లు ఈ పర్యటన తమ కెంతో సంతోషాన్నిస్తున్నదనే అన్నారు.
నేషనల్ సైన్సు సెంటర్ చూసాను. అది మంచి ప్రయత్నమనిపించింది. కానీ ఏమంత గొప్పగా ఉత్తేజితుణ్ణయితే కాలేదు. కొన్ని ఎగ్జిబిట్లు మాత్రం నిజంగా బావున్నాయి. ముఖ్యంగా బొగ్గుగని గురించిన వర్కింగ్ మోడల్. ఒక విభాగం మొత్తం భౌతికశాస్త్రసూత్రాల మీద రూపొందించిన ఆటవస్తువులతో, ప్రదర్శనలతో నిండి ఉంది. ఆ మొత్తం ఫ్లోరంతా ఎంతో ఆసక్తిదాయకంగా అనిపించింది. ఆ ఫ్లోర్లన్నీ కలయతిరుగుతూ నేను సైన్సు గురించిన ఆలోచనలతో ఉప్పొంగిపోయాను. కానీ భారతీయ రక్తంలో సైన్సుకన్నా మించిందేదో ఉందనిపిస్తుంది. సైన్సు నన్నెప్పుడూ చకితుణ్ణి చేయలేదు. అంతకన్నా నేను మనిషి పట్లనే ఎక్కువ విస్మయ భరితుణ్ణవుతానని చెప్పడం సమంజసమేమో.
నా హైస్కూల్లో నా క్లాస్ మేట్లు సైన్సు విషయాల మీదనే ఎక్కువ ధ్యాస పెట్టి ఉండేవేవారు. మేం ఏ సైన్సుఫేర్ కి వెళ్లినా వాళ్లు ప్రతి ఎగ్జిబిట్ల వెనుకా ఏ సైన్సు సూత్రముందా అన్నది పరిశీలించడం మీదే ఎక్కువ ఆసక్తి చూపించేవారు. నేనేమో ఆ ఎగ్జిబిటు రంగులు, ఆ కోలాహలం, దాని చుట్టూ ఉండే మనుష్యసంరంభం మీద ఎక్కువ ఆసక్తి చూపించేవాణ్ణి. భారతదేశానికి అన్నిటికన్నాముందు తన మనుషుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎక్కువుందనుకుంటాను, అయితే దేశానికి సైన్సు కూడా అవసరమేననుకో, కాదనను. కానీ, నేననుకుంటాను: తమ చుట్టూ ఉండే మనుషుల గురించి ఆలోచించే మనుషులు భారత దేశానికి ఎక్కువ అవసరమని. కానీ అటువంటి వాళ్లు నాకు ఢిల్లీలో అతి తక్కువ మంది, అసలు లెక్కించడానికి కూడా సాధ్యంకానంత అల్పసంఖ్యలో కనిపించారు. ఏ నగరమయితే ప్రజల మనుషుల వల్ల వెలుగునీ, వేకువనీ పొందుతుందో ఆ నగరాన్ని మాత్రమే నేను ఏ దేశానికయినా రాజధాని అని పిలవగలుగుతాను. ఢిల్లీ, పబ్లిక్ పెర్సనాలిటీలు ఉండే నగరమే తప్ప ప్రజలమనుషులు ఉండే నగరం కాదు.
ఇక్కడితో ఆగుతాను. నగరమంతా రేపటి సంరంభానికి ముస్తాబవుతోంది. బహుశా రేపటి రాత్రికి నీతో పంచుకోవడానికి సంగతులు చాలానే ఉండవచ్చు.
3
నిజానికి ఈ రోజు ఉదయమంతా గొప్ప అనుభవం. రిపబ్లిక్ పెరేడ్ నిజంగా కన్నులపండువు. ప్రతి ఒక్కరూ తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారేనా చూసి తీరవలసిన దృశ్యమది. అంటే అది చూడకపోతే మన జీవితంలో మనమేదో కోల్పోయినట్టని మాత్రం నేనబోవడం లేదు. అంతకన్నా ఆ దృశ్యం చూడటమంటే మన జీవితంలో కొత్త సంతోషాన్ని అందుకోవడమనడం సముచితంగా ఉంటుంది. పరేడ్ ఎంత నేత్రరంజకమంటే అటువంటి సంప్రదాయాన్ని ప్రారంభించిన వాళ్లకే ఆ ఘనత చెందుతుంది. అదొక గతం, ఒక వారసత్వం, ఒక సంప్రదాయం భవిష్యత్తుగా రూపు దిద్దుకుంటుండంగా అనుభవమయ్యే వర్తమానం. అది పాతకొత్తల జమిలినేత. అదొక వాక్యం, దర్శనం, భిన్నత్వంలో ఏకత్వానుభవం. భారతదేశం ఎలా ఉండేది, ఎలా ఉంటూఉంది, ఎలా ఉండబోతోంది అన్నదానికొక రేఖామాత్ర సూచన కూడా అది. అది మన ఆత్మవిశ్వాసానికీ, బలానికీ, ఉల్లాసానికీ, మన అస్తిత్వయాథార్థ్యానికీ అప్రతిహత వ్యక్తీకరణ.
ఆ మొత్తం కార్యక్రమం దాని నిర్దుష్టతలో, దాని కాలక్రమబద్ధతలో అన్ని విధాలా రాజ్య ఉత్సవం అని చెప్పదగ్గదే. కానీ అది ప్రజాఉత్సవమా? కానీ నేనెందుకో పబ్లిక్‌కీ, పీపుల్ కీ మధ్య ఉండే కచ్చితమైన ఈ విభజనరేఖ దగ్గరే పదే పదే నిలిచిపోతుంటాను. భారతదేశంలో రాజ్యం యూరోపియరాజ్యం లాగా సరళమైందీ కాదు, కమ్యూనిస్టు రాజ్యంలాగా మరీ బిగువైందీ కాదు. నిజానికి భారతదేశంలో ప్రజలకీ, రాజ్యానికీ మధ్య గల సరిహద్దు రేఖలెంత సున్నితమైనవంటే మనం ఏ నిర్ణయాలకీ ఒక పట్టాన అంత సులభంగా వచ్చెయ్యలేం. పొద్దున్నే ఎనిమిది గంటల వేళ. చలిగాలుల తీవ్రత ఇంకా బాధిస్తూనే ఉంది. కానీ వీథులనిండా రిపబ్లిక్ ఉత్సవాల్ని చూడటానికి మనుషులు గుమికూడటం మొదలయ్యింది. పెద్దలు, పిల్లలు, యువత, వృద్ధులు, స్త్రీలు ఆబాలగోపాలం గొప్ప ఆసక్తితో బయటకి వస్తున్నారు. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉన్నాయి. వి.ఐ.పిలు వాళ్ల బంధుజాలంతో మూగుతూ సగానికి పైగా స్థలాన్ని ఆక్రమించేస్తున్నారు. అయినప్పటికీ ప్రజలు, సామాన్య జనం, ఆ సందర్భంలో భాగం పంచుకోవడానికి ఉవ్విళ్లూరుతూనే ఉన్నారు.
ఆ మొత్తం సన్నివేశంలో నిజంగా ఉత్తేజకరమైనదేదో ఉంది. అధికారానికీ, కండబలానికీ, రాజదండానికీ, డబ్బుకీ, వైభవానికీ ఆవల అక్కడ సత్యమైందేదో, ఉదాత్తమైంది, నిజంగా సుందరమైందేదో, ఉత్తమమైంది ఉందక్కడ. ఆ క్షణాన నాకు స్వాతంత్రోద్యమ గాథ అంతా గుర్తొచ్చింది. అంతులేని ఆ బలిదానాలు, ఆ కన్నీళ్లు, ఆ ఉరికంబాలు, ఆ కారాగారవాసాలు గుర్తొచ్చాయి. ఆ తీర్పులు, ఆ నిరసనలు, ఆ మహత్తర సంగ్రామం గురించి నేను చదివినదంతా, విన్నదంతా గుర్తొచ్చింది. ఈ పురాతనదేశాన్ని ఆ మహత్తరసంగ్రామమే ఆధునికజాతిగా మార్చింది. ఆ పోరాటం ముగింపు కొచ్చిందా? బహుశా యుద్ధక్షేత్రం మీద సంగ్రామం అయితే అయిపోయిందని చెప్పవచ్చు. కానీ స్కంధావారం లోని సంకులసమరం ముగిసిపోయిందనలేం. హృదయాల్లోని అంతర్మథనం, మనసుల్లో, ఆత్మల్లో సంఘర్షణ ముగిసిపోలేదు సరికదా, ఇప్పుడే మొదలయ్యిందని చెప్పవలసి ఉంటుంది.
అక్కడ పరేడ్ లో పదాతిదళం అత్యంత క్రమశిక్షణతో మార్చ్ చేస్తుండటం చూస్తూ అనుకున్నాను, ఆ సైనికులు తమ రాజకీయ కార్యనిర్వాహక వర్గం గురించి, తమ విశ్వసనీయతని కోల్పోయిన తమ పాలకుల గురించి ఏమనుకుంటూ ఉండివుంటారు? అలాగే తమ పౌర అధికార బృందాల గురించి? వాళ్లు కూడా రాజకీయ నాయకుల దారినే అవినీతిలో, అసభ్య ఆచరణల్లో చాలా దూరమే పోయిఉన్నారు కదా. కానీ ఆ పదాతిదళం క్రమశిక్షణలో వీసమెత్తు కూడా తొట్రుపాటు లేదు. నేను వాళ్లని అభిమానించకుండా ఉండలేకపోయాను. నేను కూడా వాళ్లలాగే ఉండాలనుకున్నాను. నీ చుట్టూ ఎటువంటి చీకటన్నా ఆవరించిఉండనివ్వు, కానీ నీ స్వధర్మం నుంచి నువ్వు పక్కకి జరగ్గూడదనిపించింది. ఇదిగో, ఇప్పుడు నాకు సరయిన పదం దొరికింది, ఆ మొత్తం రిపబ్లిక్ విన్యాసమంతా జాతి స్వధర్మానికి వ్యక్తీకరణ అనిపించింది.
మధ్యాహ్నం కొద్ది సేపు కునుకు తీసాను. మధ్యలో తీరిక చిక్కినప్పుడల్లా ‘గురు ట్రెడిషన్’ చదువుతూనే ఉన్నాను. అది వివేకమనే నౌక పైన మహాప్రయాణం లాంటిది. సంప్రదాయం గురించీ, దేశం గురించీ, చరిత్ర గురించీ, వ్యక్తుల గురించీ, ధర్మాల గురించీ, ధార్మిక సంస్థల గురించీ పరమాచార్యకున్న అపారమైన స్పష్టత వెలుతురు చిమ్ముతూ ఉంది. ఆయన మనోనైర్మల్యం ఎంత తేటగా ఉందంటే ఆయన అంతఃకరణమీద ఏ చిన్నిపాటి మరక కూడా పడి ఉండదనిపించింది. ఒక చోట అన్నారు కూడా, సంస్థాగతమైన మద్దతు వల్ల దృఢంగా ఉండే గురువుల కన్నా ఆత్మబలం వల్ల దృఢంగా ఉండే గురువులే మిన్న అని. తాను స్వయంగా పీఠాధిపతి అయి ఉండికూడా తనకీ మాటలు రాయడానికి ఏమీ సంకోచం లేదని కూడా రాసాడాయన. అటువంటి స్పష్టత మరికొంతమందికి కూడా లభ్యం కాగలిగితే! ఆధునిక ఆలోచనా వ్యవస్థలకు చెందిన మహనీయులు మరికొందరికి కూడా అటువంటి స్పష్టత సాధ్యం కాగలిగితే!
4
ఇది సమయం నీతో మాట్లాడటానికి. నువ్వు ప్రతి రోజూ కొన్ని పనులు అదే సమయానికి క్రమం తప్పకుండా చేస్తూ ఉండటంలో అత్యంత శక్తిమంతమైనదేదో ఉంది. అదొక పవిత్ర క్రతువుగా, ప్రార్థనగా మారిపోతుంది. వేదాలు దాన్ని ‘ఋతం’ అన్నాయి. (మార్పు లేని నిత్య నియమాల లయ అది). ఆ నియమానికి అడ్డుపడేదేదయినా అనృతం అవుతుంది. అయితే వేదఋషులు భావించిందేమంటే అటువంటి అడ్డుపడటమేదయినా సరే కేవలం తాత్కాలికమేననీ ఆ నిత్యనియమం మళ్లా అప్రతిహతంగా పునఃసాక్షాత్కరించకుండా ఉండదనీ భావించారు. నేననుకుంటాను, నువ్వు ఏ పనులైనా కాలం తప్పకుండా ప్రతిరోజూ చెయ్యడంలో నీ అస్తిత్వపు లోతుల్లోంచి నీ ప్రాణశక్తి ఏదో మేల్కొని పనిచెయ్యడం మొదలవుతుంది. ఆ జాగృతి సూర్యోదయం ప్రపంచాన్ని వెలిగించినట్టుగా నిన్ను దీప్తిమంతం చేస్తుంది. ఇప్పుడిక్కడ ఇలా కూచుని నీకీ నాలుగు వాక్యాలు రాయడం కూడా ఒక ఆరాధన వంటిదేనని నేననుకుంటున్నాను. ఇదొక ప్రార్థనే. చివరగా ఇది దీని క్రమత వల్లా, శక్తిపాతం వల్లా, శుభ్రత వల్లా పవిత్రకార్యంగా రూపొంది నా దేహాన్నీ, నా శ్వాసనీ, నా మనోవృత్తులన్నిటినీ క్షాళనం చేస్తుంది. ఇటువంటి పనిచెయ్యడమంటే నాలోని దైవత్వాన్ని దేన్నో మేల్కొల్పడమన్న మాట. అది నీలోని దైవత్వానికి దేనికో అనుగుణంగా ప్రతిస్పందించడమన్న మాట. అది నీ అస్తిత్వంలోని దివ్యత్వంపట్ల జాగరితమవడమన్న మాట.
పొద్దున్న మేం ఎన్.సి.సి వార్షిక రాలీకి వెళ్లాం. దాన్ని ప్రధానమంత్రి రాలీ అని కూడా అంటారు. సైన్యంలో, నౌకా దళంలో, వాయుదళాల్లో, దేశవ్యాప్తంగా ఉండే ఎన్.సి.సి దళాలన్నీ తమ వార్షిక విజయాల్ని ఈ విధంగా వేడుక జరుపుకుంటారు. మేం వెళ్లవలసిన చోటు దూరంగా ఉన్నది కావడంతో పొద్దున్న ఏడుగంటలకే బయలుదేరిపోయాం. వాతావరణం బాగుండక పోవడంతో 11 గంటల దాకా సూర్యుడు మబ్బు చాటునే ఉండిపోయాడు. బాగా చలిగాలి. మంచుపట్టి చూపు సరిగా ఆనని పరిస్థితి వల్ల రాలీ కొన్ని ప్రత్యేక విన్యాసాలు చూపించలేకపోయింది. అందులో హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడం లాంటి కొన్ని విశిష్ట విన్యాసాలు కూడా ఉన్నాయట. అయినప్పటికీ ఆ మొత్తం రాలీ ఎంతో మనోహరంగా యువశక్తి సామర్థ్యాల ప్రదర్శనగా, ఉప్పొంగే యువరక్తం తుళ్లింతగా అనిపించింది.
…ఆ వెంటనే యువత గురించిన ఆలోచనల పరంపర నన్ను చుట్టబెట్టింది. గ్రామీణ భారతదేశపు యువత గురించీ, మురికివాడల్లో నివసించే యువత గురించీ బీద యువతీయువకుల గురించీ, హోటళ్లలో వెయిటర్ల గురించీ, సమాజంలో అన్నివిధాల గానూ నిర్భాగ్యులైన యువకులందరి గురించీ ఆలోచించకుండా ఉండలేకపోయాను. ఈ పొద్దున్నే నేను చూసిన పరిపూర్ణ యవ్వనవంతులతో పోల్చి చూసుకుంటే వాళ్లంతా ఎక్కడున్నట్టు? వాళ్లకీ వీళ్లకీ మధ్య సముద్రమంత తేడా. ఆత్మ విశ్వాసం కానివ్వు, తల్లితండ్రుల సంరక్షణ కానివ్వు, ఒక ధ్యేయం పెట్టుకోవడంలో కానివ్వు, వారు కలలు కానివ్వు లేదా వారికి లభిస్తున్న సాంఘికాహ్వానం కానివ్వు. ఏ సంఘమైనా ఎవరు అందగాళ్లో కంటున్న ఎవరు ఆకర్షణీయులో, ఎవరు ఉత్సాహవంతులో వాళ్లని మాత్రమే తనలోకి ఆహ్వానించుకోవాలనుకుంటుంది. మరి నిర్భాగ్యులైన లక్షలాది మంది మాట? వాళ్లకేమి ఒనగూడబోతోంది? ఆ విన్యాసాలన్నీ ముగిసే సమయానికి ఈ ఆలోచనలతో నేను విషాదభరితుణ్ణయిపోయాను.
విజ్జీ, ఎందుకో సుందరదృశ్యమేదన్నా సరే నన్ను విషాదభరితుణ్ణి చేస్తుంది. నాలో ఏదో అపరాధభావాన్ని మేల్కొల్పుతుంది. కొన్ని సార్లు పగని, కొన్ని సార్లు ప్రతీకారేచ్చని. వాటిని అధిగమించి నా శాంతాన్ని నేను నిలుపుకోగలగడం ఈ మధ్యనే నాకు చాతనవుతోంది. అదేదో రాజీ పడటం వల్ల సాధ్యమవుతున్నది కాదు. నా బుద్ధి వల్లగాని లేదా హృదయపూర్వకంగాగాని సాధ్యమవుతున్నది కాదది. హృదయంలో ఏ అలజడీ లేకుండానే ఏక కాలంలో అందాన్నీ, అందవికారాన్నీ కూడా చూడగలిగేటట్టుగా నన్ను వివేకవంతుడిగా చేస్తున్న ఆ శక్తి దైవానుగ్రహం అయిఉండాలని ఇప్పుడనుకుంటున్నాను. బహుశా తక్కినవాళ్లు నేను బండబారిపోయాననవచ్చు. కానీ నేను నా సున్నితత్త్వాలు పరిణతవ్యక్తిత్వంగా రూపుదిద్దుకుంటున్నాయనే భావిస్తున్నాను.
నాలో నేను అనుభవించిన భయంకరమైన ఆత్మ సంఘర్షణానంతరం ఇప్పుడు నేను ఈ ప్రపంచానికి ఇవ్వగల అతి గొప్ప కానుక నా అస్తిత్వమేనని భావిస్తున్నాను. నా అస్తిత్వం. అత్యంత సాధారణమైన నా అస్తిత్వం. నిశ్శబ్దపూర్వకమైన నా అస్తిత్వం. తన నిశ్శబ్దంతో, తన నిరాడంబరంతో, అటువంటి అస్తిత్వం సంక్షుభిత సోదర మానవుల పట్ల దయార్ద్రభరిత అస్తిత్వచలనంగా రూపుదిద్దుకుంటుంది. నా చుట్టూ ఉంటున్న వారికి నా ద్వారా అటువంటిదేదో అందుతోందని నేను గుర్తించగలుగుతున్నాను. అహంకారస్ఫురణ లేని అస్తిత్వం. అదే ఎవరికన్నా చేరవలసిన చోటు. పరమపదం. ఈ జీవిత కాలంలోనే అటువంటి అస్తిత్వస్థితికి నన్ను చేర్చగలడని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
మధ్యాహ్నం రాజఘాటికి వెళ్లాము. రాజఘాట్ సందర్శించిన గుర్తుగా రామచరిత మానస్ అనువాదం కొన్నాను. రాజఘాట్ని చూడగానే శిరిడి గుర్తొచ్చింది నాకు. ఢిల్లీలోనూ దానికి చుట్టుపక్కలా ఉన్న అసంఖ్యాకమైన చక్రవర్తుల సమాధులన్నిటిలోనూ రాజఘాటే అత్యంత నిరాడంబరమైందీ, ఉదాత్తమైందీ, మనకేదో సందేశాన్ని అందచేసేదీ అనుకుంటాను. అక్కడ ఆరకుండా ఒక దీపం వెలుగుతూంటుంది నీకు గుర్తు లేదూ? ఆ దీపం అక్కడ ఇప్పటికీ ఇంకా వెలుగుతూనే ఉంది. నేను చెప్తున్నది కేవలం ఆ భౌతిక దీపం గురించి మాత్రమే కాదు, శిరిడీ సాయినాథుని దివ్యానుగ్రహం లాంటి ఆధ్యాత్మిక దీపకాంతి అక్కడ ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. ఇక ఉండనా మరి.
5
అగ్రాకి పోయి రావడంతో రోజంతా ప్రయాణంలో గడిచి పూర్తిగా అలిసిపోయాను. ఈ క్షణాన్నే నిద్రలోకి జారుకోవాలని ఉంది. కానీ నేను నిద్రలోకి జారుకునేలోపల నీతో నాలుగు మాటలు పంచుకోవాలని తాజ్ అందం నన్ను పట్టిఉంచుతోంది. ఈ రోజు నేను తాజమహల్ ని దాని అపురూపమైన సమయాల్లో ఒక అద్భుతవేళ చూసాను. మేము అక్కడికి చేరుకున్న వేళ దాని అందాన్ని చూడటానికి అనువైన వేళల్లో ఒకానొక సముచిత వేళ. సూర్యుడు ఆకాశంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు. సందర్శకులు కూడా ఆట్టే లేరు. చుట్టూ ఉద్యానాల మీంచి శీతపవనాలు తరలిపోతున్నాయి. సాధారణంగా సుందరస్థలాల్లో అనుభవమయ్యే సంతోషంలాంటిదే అక్కడా నేను అప్పుడు అనుభవానికి గ్రహించాను.
ఆ వెనువెంటనే నేను సౌందర్యమంటే ఏమిటన్న మీమాంసకి లోనుకాకుండా ఉండలేకపోయాను. నాకేమనిపించిందంటే సత్యం, శివం, సౌందర్యం అన్న మూడు విలువలల్లోనూ ప్రాచీనమానవుడు సత్యం గురించి ఎక్కువ ఆలోచించాడనిపించింది. అది కొంత మందికి ఉపయోగకరంగానూ లేదా మరికొంతమందికి అందంగానూ కనిపించిందంటే అతనికేమీ అది ఆసక్తి కలిగించలేదు. లేదా అతని అన్వేషణని అదే మాత్రమూ సంతృప్తిపరచలేదు.
అతను తెలుసుకోవాలనుకున్నదల్లా అది సత్యమవునా కాదా అనే. అన్నిటికన్నా వెనుక ఏమున్నదనే. ఈ పై పొట్టు వెనుక, ఈ అంతర్భాగంలోపల ఈ తెర వెనుక, ఈ ఆభాస వెనుక ఈ మాయాజాలం వెనుక నిజంగా ఏమున్నదన్నదే అతని సమస్య. కాగా మధ్యయుగాల మానవుడిసమస్య సౌందర్యంతో. అతని అన్వేషణ సుందరక్షణాల కోసం. అటువంటి అనుభవాల కోసం, అటువంటి మనస్థితి కోసం, అందం కోసం అతడు వెతుకులాడేడు. తులసీదాస్ రామచరితమానస్లో చదివాన్నేను, మధ్యయుగాల కవిత్వం భగవంతుణ్ణి మూర్తీభవించిన సౌందర్యంగానే భావించి అందుకోవడానికి ప్రయత్నించిందని. అతన్ని నిరాకార అంతిమసత్యంగా చూడటానికి ఇచ్చగించలేదని. ఆ పరిశీలనతో నేను ఏకీభవిస్తున్నాను. ఆ మాటే నిజం కాకపోయుంటే పాలరాతిలో తాజ్ లాంటి కావ్యం మలచబడి ఉండేది కాదు. కానీ ఆధునికమానవుడి సమస్య హితానికి చెందిన సమస్య. ఏదన్నా నిజమవునా కాదా, లేదా అది సుందరమా కాదా అన్నదాంతో అతనికి సంతృప్తి లేదు. అది ఎంతో కొంత హితకారి కూడా అయిఉండాలి, ఎవరికో ఒకరికి ఏదో ఒక మేలు చెయ్యగలిగిఉండాలి. ఏ విధంగానూ హితకరంగానీదేదీ ఆధునిక సందర్భానికి అచ్చిరాదు. మరి అటువంటప్పుడు ఆగ్రాలో ఎందుకింకా అంత జనసమ్మర్దం?
ఈ మధ్య కమ్యూనిస్ట్ చైనా రాజకీయఅధ్యక్షుడు కూడా తన భారతదేశ పర్యటనలో భాగంగా తాజ్ మహల్ దగ్గర కొన్ని గంటల సేపు గడిపాడని పత్రికల్లో చదివాను. చూడగా నాకేమనిపించిందంటే తాజ్ మహల్ తన సాంప్రదాయిక సౌందర్యాత్మకతతో పాటు ఎంతో కొంత హితకారిగా కూడా కనిపిస్తోందని. ఈ కంప్యూటర్ల యుగంలో తాజ్ మహల్ లాంటి పురాతనకట్టడం నుంచి ఉత్పన్నం కాగల ఆ ‘మంచి’ ఏమయి ఉండవచ్చు? ఇక్కడితో ఆగుతాను. మేము తాజ్ మహల్ నుంచి తిరిగివచ్చేటప్పుడు దారిలో ఒక హోటల్లో మధ్యాహ్న భోజనం చేసాం. భోజనానంతరం నేను ఆ హోటల్ ఎదురుగా ఉన్న లాన్లలో కొంత సేపు కూచున్నాను. ఆ కొద్ది నిముషాల్లో అక్కడ లిల్లీ పువ్వుల మీద ఝుమ్మని మూగుతున్న తేనెటీగ నా దృష్టిని ఆకర్షించింది. ఆ లిల్లీ పువ్వూ, ఆ తేనెటీగా నా చైతన్యాన్ని మొత్తం ఆక్రమించేసాయి, నా వ్యక్త, అవ్యక్త మానసమంతటా వాటి పరస్పర మిలనమే నిండిపోయింది. ఆ మొత్తం లీల అంతటిలోనూ సత్యమేదో ఉంది, సౌందర్యమేదో ఉంది, సాహిత్యమేదో ఉంది. అది గడచిపోతున్నదానికీ, గడుస్తున్నదానికీ, గడవనున్నదానికీ కూడా సంగమంగా అన్ని విభజనరేఖలకూ అతీతంగా కనిపించింది.
ఆ క్షణాన్న నేను, కనీసం ఆ క్షణాన్న ఆధునిక మానవుణ్ణి కాను. ఆ క్షణాన్న నేను అనంతుడిగా, నిత్యనూతనుడిగా మారిపోయాను. చివరికి ఆ దినదేదీప్యత అంతటిలోనూ తన సమస్తవైభవంతో తళతళ మెరుస్తున్న తాజ్ కూడా ఆ పుష్పంలోని ఆ భ్రమరం ముందు వెలవెలబోయింది. ఏదో ఒక రూపంలో శాశ్వతత్త్వం కోసం ఎవరో మానవుడు సాగించిన ఆ కృత్రిమప్రయత్నం అత్యంత పరిహాసాస్పదచర్యగా తోచింది. ఆ పువ్వుకీ, ఆ తుమ్మెదకీ ఏమి కానుంది? బహుశా అవి రెండూ కూడా ఈ దినాంతానికే అదృశ్యం కాబోవచ్చు. కానీ ఆ పువ్వు గానీ, ఆ తుమ్మెద గానీ తమ మోహపారవశ్యాన్ని పాలరాతిలో భద్రపరచాలని తపించవు. ప్రాణులుగా అవి నశ్వరాలు. కానీ పువ్వుగా, తుమ్మెదగా అవి శాశ్వతాలు.
బహుశా నా వాక్యాలు వేదాంతానికి మళ్లినట్టున్నాయి. కానీ ఆ చిన్నికీటకం ద్వారా నాకేదో గంభీర సత్యం బోధపడింది. ఈ భూమ్మీద తాజ్మహల్లాంటిది ఒకటున్నట్టు దానికి తెలియదు కదా. అలాగే ఆ కీటకం గురించి కూడా తాజ్కే తెలియదు. కానీ నేను ఉన్నాను, ఆ రెండు అనుభవాలకూ ద్రష్టగా. సౌందర్యం గురించీ, అస్తిత్వం గురించీ ఆ రెండూ వ్యక్తం చేస్తున్న పరస్పర విరుద్ధమైన ఆ రెండు అస్తిత్వాల్నీ సమన్వయపరచుకోవాల్సిన బాధ్యత నాదే. కానీ ఆ రెండింటిలోనూ నేనా తేనెటీగ వైపే మొగ్గుచూపాను, మరెందుకు కాకపోయినా, కనీసం దాని పరిమాణానికయినా. ప్రయాణం చాలా అలసట పెట్టింది. ముఖ్యంగా తిరుగు ప్రయాణం. ఇంకా ఏదో రాయాలనే ఉంది, కానీ ఇక ఇక్కడితో ఆగుతాను…
Letters from Delhi
1
…My heart is so full of wonder at this miraculous play of divine grace that I felt an immediate urge to share it with you without losing a moment.
Why must God perform miracles? I believe a miracle is nothing other than God’s most tender gesture of love. Frail, ordinary things—a chance meeting, a casual greeting, the mundane occupations of everyday life—turn into revelations the moment God chooses to speak through them. It is like offering the loveliest blossom of your daily worship to the Divine; it is like an embrace, an unadorned kiss, a quiet word of praise, or a morning telephone call from someone dear to your heart.
Yet the true beauty of a miracle lies in how profoundly it bears witness to grace showering upon you. When a miracle occurs, it carries you into the deepest chambers of your own heart. You celebrate the quiet joy of being chosen, the happiness of knowing you are numbered among the few who have tasted His compassion.
2
I posted yesterday’s letter this morning. I longed to call you as well, but from where could I even place a call? We spent the entire day sightseeing. In the morning we visited the Qutub Minar, and climbed an adjoining rise to see a Jaina temple. The afternoon took us to the National Science Centre. Afterward, the organizers escorted our tribal guests to the aerodrome, and by dusk, they brought us to the Lakshmi Narayan Temple just as the evening arati was being offered.
This duty entrusted to me came as no surprise. There is undeniably something noble in it; besides, I am performing an official state courtesy. It is certainly a far better occupation than wearing out the hours in an office. Yet it is this very machinery of state that sets me thinking. I find myself turning over endless questions about this country, its history, its civilization, and its future. Has there ever been anything genuinely sublime in the long chronicles of this land? Perhaps under Ashoka, under Harsha, or through the golden age of the Guptas, conditions were fundamentally no different: the same quiet oppression, the same self-deception, the very same indifference toward one’s fellow beings.
What Delhi offers its people is, in truth, dispiriting. There is little here that truly elevates the spirit. Wherever grandeur displays itself—be it expansive public parks, the memorial grounds of statesmen, temples, or museums—every spectacle merely summons to my mind the hundreds of thousands left unsheltered, the millions crowded into squalid slums, the throngs packed into city buses, and the countless families consigned to the suffocating upper reaches of high-rise tenements.
As a student, the words nation and national integration never failed to stir me. But does a nation truly take shape through seminars, conferences, and guided excursions such as these? This tour provides everything—food, shelter, security, responsibility, diversion, and sightseeing. Yet where is the true animating spark? Somehow, I feel as though I am losing myself.
On a personal level, I have nothing to complain of. The delegates gathered here seem to be enjoying themselves thoroughly. Today I spoke with a young Santhali woman from Bihar. I also met two Bhil delegates from the Aravalli ranges of Rajasthan, and an Oraon from the forests of Sundargarh in Orissa. All of them spoke of how much joy this journey has brought them.
I went through the National Science Centre. While it represents a commendable effort, it failed to truly move me. A few exhibits were undeniably well conceived—particularly the working model of a coal mine. An entire gallery was filled with interactive toys and demonstrations illustrating fundamental laws of physics, making that floor quite engaging. Walking through those halls, my thoughts surged around the possibilities of science. Yet I cannot help feeling that something deeper than science runs through the Indian bloodstream. Science has never filled me with awe; it is human beings who awaken my wonder.
Back in high school, my classmates were absorbed in scientific concepts. Whenever we attended a science fair, they were intent on deciphering the underlying principle behind each exhibit. I, on the other hand, was drawn to the vivid colors of the displays, the lively clamor, and the human drama unfolding around them. India, I believe, needs above all to understand its own people—though I do not deny that the nation needs science too. Even so, my conviction remains: what this country needs most are people who think deeply about the human beings around them. In Delhi, such souls seem few and far between—so scarce as to be almost unreckonable.
A city gains its morning light and its true awakening only from people of the soil; only such a city could I ever call the true capital of a nation. Delhi is a city of public personalities, not of the people.
I will close here. The whole city is dressing itself for tomorrow’s celebrations. By tomorrow night, I shall perhaps have much to share with you.
3
This morning was, in truth, a magnificent experience. The Republic Day parade was a visual feast—a spectacle every citizen ought to behold at least once in a lifetime. I do not mean that missing it leaves one’s life incomplete; rather, to look upon it is to welcome a fresh joy into one’s existence. The credit for such a resplendent display belongs entirely to those who founded this tradition. It is the past, an inheritance, a tradition transforming into the future before our very eyes—a shared weaving of the old and the new. It is a testament, a vision, a living experience of unity within diversity. It offers a broad outline of what India was, what it remains, and what it strives to become: an irresistible expression of our self-confidence, our inner strength, our vitality, and the reality of our collective existence.
In its clockwork precision and solemn pageantry, the entire ceremonial display was undoubtedly a celebration of the State. Yet, was it a festival of the people? Somehow, I find myself pausing at the sharp line that separates the public from the people. The State in India is neither elementary like its European counterparts, nor rigid like a communist apparatus. The frontier between the people and the State here is so delicate that one cannot arrive at hasty verdicts.
It was eight in the morning, with the biting winter chill still stinging the air. Yet crowds had already begun to pack the avenues to witness the parade. Men and women, the aged and the young, children in their parents’ arms—everyone had stepped forth with eager anticipation. Security was formidable. VIPs and their entourages swarmed the enclosures, claiming more than half the available space. Even so, ordinary citizens yearned with equal fervor to claim their share in the moment.
Something genuinely moving stirred through the whole scene. Beyond raw power, martial muscle, the scepter of authority, wealth, and pomp, something true, noble, lovely, and fine shone through. In that moment, the entire epic of our freedom struggle rushed back to me—the boundless sacrifices, the tears, the gallows, the prison cells. The trials, the protests, everything I had ever read or heard of that great upheaval returned to my thoughts. It was that epic struggle that forged an ancient land into a modern nation.
Has that struggle reached its close? On the open battlefield, the conflict may be over. But within the encampment of the soul, the tumult has not ceased. The churning within the heart, the quiet conflict within our minds and spirits, is far from done; in truth, it has only just begun.
Watching the infantry march past with flawless discipline, I wondered: what must these soldiers think of their political executive, of rulers who have squandered their moral credibility? And what must they think of their civil bureaucracy, which has followed the political class so far down the path of corruption and degradation? Yet in the discipline of those marching ranks, not a single foot faltered. I could not help admiring them; I found myself wishing to be like them. Let whatever darkness encircle you, your feet must never swerve from your svadharma.
Now I have found the exact word: the entire pageant of the Republic felt like an embodiment of the nation’s svadharma.
In the afternoon, I rested briefly. Whenever a quiet hour presented itself, I returned to reading The Guru Tradition. It is like setting sail on a great voyage upon a ship of wisdom. The Paramacharya’s luminous clarity concerning tradition, country, history, individuals, faiths, and spiritual institutions sheds radiant light on every page. His clarity of mind is so pristine that his inner consciousness seems untouched by the slightest blemish.
He remarks in one place that masters anchored in inner spiritual strength are far superior to those sustained merely by institutional power. He adds, without hesitation, that he writes these words despite being the head of an ancient monastic seat himself. If only such crystalline clarity were granted to a few more souls! If only such lucid vision were possible for the thinkers of our modern systems!
4
This is the hour to speak with you. There is an immense, quietly potent power in performing certain tasks each day at their appointed hour, without fail. It deepens into a sacred rite, a prayer. The Vedas called it Ṛta—the unswerving rhythm of eternal cosmic order. Whatever disrupts that rhythm is anṛta, falsehood. Yet the Vedic seers knew that any such disruption is only passing; the eternal order never fails to reassert itself with irresistible force.
When you perform actions day after day with disciplined rhythm, life-energy stirs awake from the deepest ground of your being. That awakening illuminates you just as the dawn illumines the world. Sitting here now, writing these few lines to you feels like an act of worship. It is a prayer. Through its rhythm, its quiet descent of power, and its intrinsic clarity, it transforms into a consecrated act, cleansing my body, my breath, and every current of my mind.
To turn to you like this is to awaken the divine within me. It is to answer the divine within you, keeping vigil before the sacred presence of your being.
This morning, we attended the annual NCC Rally, also known as the Prime Minister’s Rally. Across the Army, Navy, and Air Force, NCC contingents from every corner of the country gather here to celebrate their year’s achievements. Because the venue lay at a considerable distance, we set out as early as seven. The weather remained uncooperative; the sun stayed hidden behind a dense pall of cloud until nearly eleven. A biting chill cut through the air, and thick fog, severely limiting visibility, forced the cancellation of several specialized maneuvers, including flypasts by circling helicopters. Even so, the entire rally unfolded with breathtaking energy—a magnificent showcase of youthful vigor, the irrepressible surge of young blood.
Yet almost immediately, a cascade of thoughts concerning our youth closed in upon me. I could not help reflecting on the youth of rural India, those crowded into urban slums, impoverished young men and women, waiters in roadside diners, and all those who remain utterly disenfranchised within our society. Measured against the polished, radiant youth I watched this morning, where do they stand?
An ocean divides them: in confidence, parental care, clarity of ambition, the nature of their dreams, and the social embrace extended to them. Society opens its doors readily to those who are favored with poise, charm, and vitality. But what of the millions left behind? What will ever fall to their share? By the time the formations marched off the field, a heavy melancholy had settled over me.
Vijji, why is it that beauty so often moves me to sorrow? It stirs a strange guilt within me—sometimes a flare of resentment, sometimes a silent urge for reckoning. It is only recently that I have learned to outgrow those impulses and preserve my inner peace. That peace does not come from compromise; nor is it wrought merely through intellect or an emotional resolve. I have come to realize that the power which grants me the discernment to look upon beauty and squalor at once—without allowing turmoil to shake my heart—is nothing other than divine grace.
Others might take this for callousness. But to me, it marks the ripening of inner sensitivity into mature poise.
After enduring terrible inner conflicts within my own soul, I have come to feel that the greatest gift I can offer this world is simply my presence. My being: unassuming, quiet, and ordinary. Through its very silence and unadorned simplicity, such an existence becomes a gentle, compassionate movement toward suffering fellow beings. I can sense that those around me receive something of this through me. A presence stripped of ego—that is the sanctuary every soul must strive to reach: the supreme realm, Paramapada. I pray to God to grant me the grace to abide in such a state of being within this very lifetime.
In the afternoon, we visited Rajghat. As a memento of that visit, I purchased a translation of the Ramcharitmanas. The moment I looked upon Rajghat, Shirdi returned to my memory. Among the countless tombs of emperors scattered across Delhi and its environs, Rajghat remains the most austere, the most noble, and the one that bears a living message.
You remember the flame that burns there without dying, don’t you? It continues to burn today. I speak not merely of that physical flame; an inner spiritual light—like the divine grace of Shirdi Sai Nath—radiates there for all time.
Let me pause here for now.
5
The journey to Agra and back consumed the entire day, leaving me utterly exhausted. I long to surrender to sleep this very instant. Yet before I slip away, the beauty of the Taj holds me fast, urging me to share a few thoughts with you.
I saw the Taj Mahal today in an extraordinary hour. The moment we arrived was one of the rarest, most auspicious hours to behold its grace. The sun shone with brilliant clarity in the sky, visitors were sparse, and cool winter winds drifted across the surrounding gardens. The serene delight one usually tastes in landscapes of sacred beauty touched me there as well.
Yet almost immediately, I found myself drawn into an inquiry on the nature of beauty. It struck me that among the three enduring ideals—Satyam, Shivam, Sundaram (the True, the Good, and the Beautiful)—ancient man contemplated primarily upon Truth (Satyam). That a thing appeared useful to some or attractive to others held little interest for him; it could never satisfy his relentless quest.
All he sought to uncover was whether a thing was true. What lay behind it all? What rested behind this outer husk, deep within the interior, behind this veil, behind this appearance, behind this grand illusion? That was his sole inquiry.
Medieval man, however, was consumed by Beauty (Sundaram). His quest was for luminous moments, for sublime aesthetic states, for beauty itself. Reading the Ramcharitmanas of Tulsidas, I realized that medieval poetry reached out to God primarily as Beauty incarnate, rather than as a formless, abstract Ultimate Truth. I share that view. Were it not so, an epic in marble like the Taj Mahal could never have been carved.
Yet modern man’s dilemma revolves around Utility and the Good (Shivam/Hitam). He cannot rest content with whether something is true or beautiful; it must serve a functional purpose, it must yield some tangible benefit to someone. Anything devoid of utility finds no welcome in the modern condition.
Why, then, do crowds still throng Agra in such numbers?
I read recently that during his state visit to India, the President of Communist China spent several hours at the Taj Mahal. It appears to me that beside its classical aesthetic splendor, the Taj offers some subtle, lingering good (hitam). In an age dominated by computers, what manner of ‘good’ can emanate from an ancient monument like the Taj?
Let me pause here to tell you: on our return journey, we stopped at a restaurant for lunch. After eating, I sat for a few minutes on the lawn out front. In those brief moments, a honeybee humming over a cluster of lilies arrested my entire attention. That lily and that honeybee took complete possession of my consciousness; their union filled my visible and invisible mind. In that entire play (līlā), there was truth, there was beauty, and there was poetry. It appeared as the convergence of what was, what is, and what will be—transcending every dividing line.
In that fleeting instant, I was no longer a modern man. I felt boundless, ancient, and ever-new. Beside that bee nestled within the blossom, even the Taj, gleaming in all its daytime majesty, paled into insignificance. That contrived human attempt to arrest eternity in stone suddenly seemed almost comical. What will become of that flower and that bee? Perhaps both will perish by the fall of dusk. Yet neither the blossom nor the bee strives to preserve its ecstatic union in marble. As mortal creatures, they are perishable; but as flower and bee, they are eternal.
Perhaps my thoughts have drifted into metaphysics. Yet through that tiny insect, a profound truth unveiled itself. The bee knows nothing of a Taj Mahal on this earth; neither does the Taj know anything of the bee. Yet I was there—a witness to both realities. The burden fell upon me to reconcile these two opposing testimonies of existence and beauty.
Between the two, my heart leaned toward the honeybee—if for nothing else, then for the humility of its scale.
The journey wore me out, particularly the drive back. There is much more I wish to say, but I must stop here…
21-9-2026

