సెనెకా ఉత్తరాలు-13

ప్రతి సారీ నువ్వొక మనిషిని ద్వేషిస్తున్నప్పుడు, అతడి ఉనికిని ఏవగించుకుంటున్నప్పుడు, పరిశీలించుకో, నీలోని ఏ అవలక్షణానికి అతడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడో. ఆ అవలక్షణం నీదే. ఆ చప్పుడు నీలోని హీనపార్శ్వం చేస్తున్న చప్పుడు.