సెనెకా ఉత్తరాలు-7

మనవాళ్ళు జన్మరాహిత్యం కోరుకున్నారు అంటే దాని అర్థం, మనం చనిపోయేక, మరొక జన్మ ఎత్తకూడదని కాదు. అసలు ఈ జన్మలోనే, మళ్ళా గానుగెద్దులాగా తిరిగిన ఈ దారిలోనే, ఈ నలుగులాట మరొకసారి పడవలసిన అవసరం లేకుండా ఉండాలనే.